పారిశుద్ధ్య కార్మికులను కాపాడటమే మా లక్ష్యం అనంత డిస్కవరీ అనిల్ కుమార్
విశాలాంధ్ర -అనంతపురం : నగరంలోని మురికి కాలువలు దిగి పని చేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం డిస్కవర్ అనిల్ కుమార్ ముంబై నుండి హై క్వాలిటీ గం బూట్స్ తెప్పించి ఒకటవ సర్కల్లోని 14 సచివాలయాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా అనంతపురం అనిల్ కుమార్ మాట్లాడుతూ… పారిశుద్ధ కార్మికులను కాపాడుకోవడం నగరంలోని ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. వారి బాగోగులు చూసుకోవడం కేవలం ప్రభుత్వం బాధ్యత ఎంత ఉందో మన కోసం వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ కార్మికుల బాగోగులు ప్రతి పౌరుని బాధ్యత కూడా అంతే ఉందన్నారు . ఈ గం బూట్లు పంపిణీ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలు సుమారు 150 మంది కార్మికులకు ఈ గం బూట్స్ అందజేస్తామని దీనికి సుమారు 1 లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఈ గం బూట్స్ ను డంప్యాడ్లో జీవనోపాధి కోసం చెత్త లో ఉండే ఐరన్, ఇతర వస్తువులను ఏరుకునే వారు కి కూడా అందజేసి డంప్యాడ్ లో వెళ్లే ప్రతి ఒక్కరు ఈ బూట్లు ధరించే విధంగా చేస్తామన్నారు. బూట్లు ధరించి డంప్యాడ్ లో వెళ్లే వారికి ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.