Wednesday, May 14, 2025
Home Blog Page 12

జమ్మూలో ఉద్రిక్తత.. మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాక్ బలగాలు కాల్పులు జరపడం, దాడులకు తెగబడుతుండడంతో ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. దాడులు మరింత తీవ్రం కావచ్చనే భయంతో జమ్మూ నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే, బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంది.

జమ్మూ ప్రజల ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. జమ్మూ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. జమ్మూ, ఉధంపూర్ ల నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్‌ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

దేశంలోకి చొరబాటుకు యత్నం.. 7గురు టెర్రరిస్టులు హతం

భారత సైన్యం కొడుతున్న దెబ్బలకు పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి.తాజాగా, ఇండియాలోకి చొరబడ్డానికి ప్రయత్నించిన 7 గురు టెర్రరిస్టులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతం చేసింది. శుక్రవారం పాక్ రేంజర్ల సాయంతో 7 గురు టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లోకి చొరబడ్డానికి ప్రయత్నించారు. అలర్టైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని కాల్చిపడేసింది.

ఆపరేషన్ సిందూర్‌ కారణంగా 100 మంది దాకా టెర్రరిస్టులు బలయ్యారు. దీంతో పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. భారత్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిన్న 15 చోట్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోయింది. భారత సైన్యం వాటిని ధ్వంసం చేసి పడేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా పాకిస్తాన్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. మిలటరీ స్టేషన్లను ఇతర నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించారు. భారత సైన్యం వారి ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది.

యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలము : అమెరికా

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం మధ్యలో మేము కలుగజేసుకోము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశిస్తున్నాము. రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదు. యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలము. మధ్యలో కలుగు జేసుకుని యుద్ధం ఆపమనడం మా పని కాదు అని అన్నారు.

రక్షణ, భద్రతా ఆపరేషన్లపై ప్రత్యక్ష ప్రసారాలు వద్దు

దేశంలోని అన్ని మీడియా సంస్థలకు కీలక హెచ్చరిక చేసిన కేంద్ర రక్షణ శాఖ

కేంద్ర సమాచార, ప్రసార శాఖ నుంచి మీడియాకు ఆదేశాలు
దేశ రక్షణ, భద్రతా దళాల కార్యకలాపాలకు సంబంధించిన వార్తల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటువంటి సున్నితమైన అంశాల ప్రత్యక్ష ప్రసారాలు,సన్నిహిత వర్గాల సమాచారంః అంటూ రాసే కథనాల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా ఛానెళ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులకు ఒక సలహా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గత నెలలో విడుదల చేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది.

జాతీయ భద్రత దృష్ట్యా, రక్షణ కార్యకలాపాలు లేదా భద్రతా దళాల కదలికలకు సంబంధించి ఎలాంటి రియల్ టైమ్ కవరేజీ, దృశ్యాల ప్రసారం లేదా ఃసన్నిహిత వర్గాల సమాచారంః ఆధారిత వార్తలను ప్రచురించవద్దని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమస్యాత్మక సమాచారం ముందుగానే బయటకు పొక్కితే, అది శత్రు మూకలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని, తద్వారా సైనిక చర్యల సమర్థతకు, సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

గతంలో కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రదాడులు (26/11), కాందహార్ విమాన హైజాక్ వంటి సంఘటనల సమయంలో మీడియా కవరేజీ వల్ల జాతీయ ప్రయోజనాలకు అనుకోని ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయని కేంద్రం గుర్తుచేసింది. జాతీయ భద్రతను కాపాడటంలో మీడియా, డిజిటల్ వేదికలు, వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తారని, చట్టపరమైన బాధ్యతలతో పాటు, మనందరి చర్యలు కొనసాగుతున్న ఆపరేషన్లకు లేదా మన బలగాల భద్రతకు ఆటంకం కలిగించకుండా చూడటం నైతిక బాధ్యత అని పేర్కొంది.

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021లోని రూల్ 6(1)(జూ)ని అన్ని టీవీ ఛానెళ్లు తప్పనిసరిగా పాటించాలని గతంలోనే సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధన ప్రకారం, ఁభద్రతా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పుడు, ఆ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చే నిర్దిష్ట వ్యవధుల్లోని సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలి, ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లేదుఁ అని స్పష్టం చేసింది.

ఇటువంటి ప్రసారాలు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నిబంధనలు, 2021కి విరుద్ధమని, అలాంటి వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల, జాతీయ భద్రత దృష్ట్యా అన్ని టీవీ ఛానెళ్లు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, భద్రతా దళాల కదలికలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను చేయవద్దని సూచించింది. ఆయా కార్యకలాపాలు ముగిసే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ద్వారా ఎప్పటికప్పుడు అందించే సమాచారానికే మీడియా పరిమితం కావాలని కోరింది.

ఈ విషయంలో అన్ని వర్గాలు అప్రమత్తత, సున్నితత్వం, బాధ్యతతో వ్యవహరించాలని, దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.

దేశంలో ఇంధన కొరత అంటూ మరో ఫేక్ ప్రచారం

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో పలు ఫేక్ న్యూస్ వైరల్ గా మారుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ఈ పోస్టులపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఎప్పటకప్పుడు స్పందిస్తూ వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. పొరుగు దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడిందని, పెట్రోల్ డీజిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయిల్ సరఫరా వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. ఇంధనం విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన ఆందోళన అక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పనిలేదు. బంకుల వద్ద అనవసర రద్దీని నివారించి, మెరుగైన సేవలు అందించేందుకు మాకు సహకరించండి అంటూ ఇండియన్ ఆయిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

పాక్‌-భారత్‌ ఉద్రిక్తతలు.. సీఏ పరీక్షలు వాయిదా

దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్‌, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్‌, ఫైనల్‌, పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం పరీక్షకు నమోదుచేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్‌ icai.org. చూడవచ్చని తెలిపింది.

కాగా, షెడ్యూల్‌ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్‌ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్‌ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్‌ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రూప్‌ 1 ఫైనల్‌ ఎగ్జామ్‌ 2, 4, 6 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్‌ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. అనంతరం జరుగనున్న పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడ్డాయి. ఇంటర్‌కు సంబంధించిన పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఫైనల్‌ ఎగ్జామ్ పేపర్లు 1 నుంచి పేపర్‌ 5 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం5 గంటల వరకు, పేపర్‌ 6 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. సీఐడీ విచారణకు సజ్జల, అవినాష్ హాజరు

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విచారణకు మరో నేత దేవినేని అవినాష్‌తో కలిసి హాజరయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

విచారణకు వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వాహనాన్ని పోలీసులు కోర్టు రోడ్డు వద్దనే నిలిపివేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి సీఐడీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సజ్జలకు సంఘీభావంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌ల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు నమోదు చేసినట్లు సమాచారం.

భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో..బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ వాయిదా

భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం సరికాదని నిర్ణయించింది. ఐపీఎల్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్‌ లీగ్‌ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్‌లున్నాయి. లఖ్‌నవూ, హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, జైపుర్‌ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

గురువారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భద్రతాకారణాలరీత్యా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. పరిస్థితిని బట్టి టోర్నమెంట్‌ భవిష్యత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటాం. అన్నింటికన్నా ఆటగాళ్ల భద్రత ముఖ్యం అని పేర్కొన్నారు.

స‌రిహ‌ద్దుల్లో పాక్‌ కాల్పులు.. తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌ను సహించ‌లేని దాయాది పాకిస్థాన్ జ‌రిపిన కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందారు. మృతిచెందిన జ‌వాన్‌ను ముర‌ళీ నాయ‌క్‌గా గుర్తించారు. వీర జవాన్‌ది ఏపీలోని స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌ల ప‌రిధిలోని క‌ల్లి తండా. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు వెంబ‌డి పాక్ కాల్పులు జ‌ర‌ప‌గా మ‌న సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ముర‌ళీ నాయ‌క్ చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం స్వ‌గ్రామానికి వీర జ‌వాన్ పార్థివ దేహం రానున్న‌ట్లు తెలుస్తోంది.కాగా, వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ సోమందేప‌ల్లి మండ‌లం నాగినాయ‌ని చెరువుతండాలో పెరిగాడు. సోమందేప‌ల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో చ‌దివాడు. జ‌వాన్ మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. దీంతో స్వ‌గ్రామం క‌ల్లితండాలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

జడ్ ప్లస్ సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తన భద్రతను భారీగా తగ్గించారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఆయన నిన్న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. తనకు ఉన్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకుని, నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ భద్రతను తిరిగి కల్పించాలని జగన్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. తన నివాసం, కార్యాలయం వద్ద పటిష్టమైన భద్రతతో పాటు, జామర్లు, పూర్తిస్థాయిలో పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం వాహనం సమకూర్చలేని పక్షంలో, తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనకున్న ముప్పు దృష్ట్యా తక్షణమే సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీ బలగాలతో తగిన భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, నోటీసు గానీ ఇవ్వకుండా తన భద్రతను భారీగా తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం తనకు కేటాయించిన భద్రత నామమాత్రంగా ఉందని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా పని చేయడం లేదని జగన్ తెలిపారు. అధికార కూటమికి చెందిన నేతల నుంచి తనకు భౌతికంగా హాని తలపెడతామంటూ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. పలు పర్యటనల్లో ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించలేదని, గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు ఒక్క కానిస్టేబుల్‌ను కూడా నియమించలేదని గుర్తుచేశారు. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలోనూ హెలిప్యాడ్ వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని, దీనిపై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారని తెలిపారు.

పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్

స్వదేశీ ఆకాశ్ క్షిపణి సత్తా..
భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత లక్ష్యాలపై పాక్ చేసే కుయుక్తులను భగ్నం చేయడంలో ఈ మేడ్ ఇన్ ఇండియా ఆయుధం కీలక పాత్ర పోషిస్తోందని ఏఎన్ఐ వార్తా సంస్థకు అధికారులు తెలిపారు.

భారత సాయుధ దళాలు మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను పాకిస్తాన్ దాడులను నిరోధించడానికి విజయవంతంగా ఉపయోగిస్తున్నాయని రక్షణ శాఖ అధికారులు ఏఎన్ఐకి వివరించారు. భారత సైన్యం మరియు భారత వైమానిక దళం రెండూ ఈ క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దు పొడవునా మోహరించినట్లు వారు పేర్కొన్నారు.

భారత లక్ష్యాలపై పాకిస్థాన్ చేసే దాడులను తిప్పికొట్టడంలో మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారత సైన్యం, వాయుసేన రెండూ పాక్ సరిహద్దు వెంబడి ఈ క్షిపణి వ్యవస్థను కలిగి ఉన్నాయిఁ అని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే స్పందించి, శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఈ వ్యవస్థలు నిరంతరం సన్నద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం, భారత రక్షణ రంగ స్వావలంబనను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.