Thursday, February 6, 2025
Home Blog Page 125

గజేంద్రసింగ్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించాం: పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆయన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ… గజేంద్రసింగ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. గతంలో ఆయన జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతగానో సహకరించారని తెలిపారు. ఏపీ పర్యాటక రంగానికి సంబంధించి గజేంద్రసింగ్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని పవన్ వెల్లడించారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గజేంద్రసింగ్ ను కోరామని చెప్పారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి, కేంద్ర రైల్వే మంత్రి, కేంద్ర పంచాయతీ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు.

భవిష్యత్తులో యుద్ధాలన్నీ వీటితోనే జరుగుతాయి: ఎలాన్ మస్క్

ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్న తీరుపై టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ సహిత యుద్ధ విమానాలతో ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయని మస్క్ అన్నారు. ఈ ఫైటర్ జెట్ విమానాలు పైలట్లను చంపేస్తున్నప్పటికీ… కొంతమంది ఎఫ్-35 వంటి పైలట్లను చంపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని విమర్శించారు. ఈ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని చెప్పారు.ఎఫ్-35 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ డ్రోన్ ల ద్వారానే జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీఎం ఏక్‌నాథ్ షిండే రాజీనామా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. ఇవాల్టితో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు. షిండేతో పాటు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లు పాల్గొన్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయతి కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. తద్వారా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధికంగా 132 స్థానాల్లో విజయం సాధించారు. శివసేన (షిండే) వర్గం 57 స్థానాల్లో, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం 41 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అధిష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖంగా ఫడణవీస్ పేరు వినిపిస్తోంది.

మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమీక్ష అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అధికారులు ఏడు బృందాలుగా పది రాష్ట్రాల్లో పర్యటించి ఆయా చోట్ల పట్టణ ప్రణాళిక విభాగాల్లోని ఉత్తమ విధానాలను ఈ నివేదికలో పొందుపరిచారని చెప్పారు. ఐదు అంతస్తుల వరకూ నిర్మాణాలకు లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా అనుమతులిచ్చే కొత్త విధానాన్ని మొదటి సారి ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. దీని వల్ల 95 శాతం మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే బెడద తప్పుతుందన్నారు. భవనాలు, లేఅవుట్ల అనుమతులకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేయనున్నామని చెప్పారు. ఐదు అంతస్తుల భవనాలకు సంబంధించి సర్వేయర్‌లే స్వయంగా ప్లాన్ దరఖాస్తులను ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసి రుసుము చెల్లించిన వెంటనే అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేశామని, అయితే అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడితే సర్వేయర్ లైసెన్సు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామన్నారు.

రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు అదే ప్రాంతంలో అదనపు అంతస్తులు నిర్మించుకోవడానికి ఇకపై టీడీఆర్ బాండు అవసరం లేదన్నారు. స్థలం కోల్పోయినట్లు అధికారుల ధ్రువీకరణ ఆధారంగా అనుమతిస్తారని చెప్పారు. వీరు వేరొక చోట చేపట్టే అదనపు అంతస్తుల నిర్మాణానికి టీడీఆర్ బాండు తప్పనిసరి అని తెలిపారు. 500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకూ సెల్లార్ పార్కింగ్ అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనలకు సీఎం ఆమోదించారని చెప్పారు. 120 మీటర్ల కంటే ఎత్తయిన భవనాల సెట్ బ్యాక్ పరిమితిని 20 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఎత్తయిన భవనాల్లో పార్కింగ్ పోడియాన్ని 5 అంతస్తుల వరకూ అనుమతించామన్నారు. పది అంతస్తుల కంటే ఎత్తయిన భవనాల్లో రిక్రియేషన్ కోసం ఒక అంతస్తు ఉండేలా అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనలనూ సీఎం ఆమోదించారని మంత్రి తెలిపారు. ఇక నుంచి లేఅవుట్లలో 9 మీటర్ల వెడల్పు రోడ్లు వదిలేలా వెసులుబాటు కల్పించామని తెలిపారు.

ఢిల్లీలో పవన్ కల్యాణ్

కాసేపట్లో గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ
3.30 గంటలకు నిర్మలా సీతారామన్ తో సమావేశం
రేపు మోదీతో భేటీ కానున్న పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించనున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర జలమంత్రి సీఆర్ పాటిల్, 3.30 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4.30 గంటలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సాయంత్రం 5.15 గంటలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో సమావేశం కానున్నారు.

రేపు ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీతో పవన్ భేటీ అవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించనున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర జలమంత్రి సీఆర్ పాటిల్, 3.30 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4.30 గంటలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సాయంత్రం 5.15 గంటలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో సమావేశం కానున్నారు.

రేపు ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీతో పవన్ భేటీ అవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ావన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్తంగా యాక్సెస్ కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 2025, 2026, 2027 వరుసగా మూడు క్యాలెండర్ సంవత్సరాలకు గానూ మొత్తం రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను ఈ పథకానికి కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుందని, వినియోగం సులభంగా ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీలు సులువుగా ఈ పథకం లబ్దిని పొందేలా చూస్తామని తెలిపారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా విద్యారంగంలో రీసెర్చ్, ఆవిష్కరణలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్్ణ విశేషాలు ఇవే..
వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ స్కీమ్ ద్వారా రీసెర్చ్ స్కాలర్‌లకు వనరులు మెరుగుపడనున్నాయి. దేశ విద్యారంగంలో పరిశోధన ఆధారిత సంస్కృతి పెంపొందుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రయోగశాలలలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడనుంది. ఇప్పటికే ఉన్న ాఅనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) వంటి కార్యక్రమాలకు ఊతం ఇవ్వనుంది.

వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం.. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్‌తో పాటు స్వయంప్రతిపత్తి కలిగిన యూజీసీ ఇంటర్-యూనివర్సిటీ సెంటర్‌లతో సమన్వయం చేస్తారు. దీంతో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న 6,300 ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతారని అంచనాగా ఉంది. వికసిత్ భారత్, జాతీయ విద్యా విధానం -2020, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యాల సాధనలో ఉపయోగపడనుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని విద్యార్థులు.. అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ఈ స్కీమ్ ద్వారా స్కాలర్ ప్రచురణలకు యాక్సెస్‌ లభిస్తుంది.

హాస్పిటల్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. కొన్ని గంటల్లోనే డిశ్చార్జ్

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చిన్నపాటి అనారోగ్య సమస్యతో చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఎసిడిటీతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన మరో 2-3 గంటల్లోనే డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని గంటల్లోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపింది. ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, పరిశీలన కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారని వివరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

నిజం బయటకు రావాలి

0

న్యూదిల్లీ: అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణల అంశాన్ని రూల్‌ 267 కింద పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తడానికి విపక్షాలను అనుమతించక పోవడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ విషయంపై ‘నిజం బయటకు రావాలి’ అని ఆయన అన్నారు. నిబం ధన 267 ప్రకారం, చైర్‌ ఆమోదంతో అత్యవసర విషయంపై చర్చించడానికి అప్పటికే జాబితా చేసిన బిజినెస్‌ నిలిపివేయడం సహజమేనని ఖడ్గే తెలిపారు.
విదేశాల్లో కాంట్రాక్టులు పొందేందుకు కొంతమంది కీలక వ్యాపారులకు సహాయం చేయడం ద్వారా దేశ ప్రతిష్ఠను ప్రధాని మోదీ మంటగలుపుతున్నారని కూడా ఖడ్గే విమర్శించారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ‘‘రూల్‌ 267 అటువంటి ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడానికి మాత్రమే రూపొందించబడిరది. ఆ అవకాశం లేకపోతే, ఆ నియమం ఉండకూడదు. ఈ నియమం ప్రకారం ఈ సమస్యను లేవనెత్తడానికి మాకు అనుమతి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము’’ అన్నారు. జేపీసీలో అధికార బీజేపీ నుంచే ఎక్కువ మంది సభ్యులుంటారని… అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. జేపీసీని ఏర్పాటు చేయండి… నిజం బయటకు రానివ్వండి అని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. పార్లమెంటులో ఉభయ సభలు వాయిదా పడడానికి గల కారణాలేంటో తనకు తెలియదని ఖడ్గే అన్నారు. అదానీ గ్రూప్‌పై అవినీతి, లంచం, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని రక్షించేందుకు ఈ అంశాన్ని లేవనెత్తడం చాలా ముఖ్యమని… మోదీ జీ మాత్రం హంగామా సృష్టిస్తున్నారని చెప్పారు. పార్లమెంటును ప్రతిపక్షాలే స్తంభింపజేస్తున్నాయన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అవినీతిపరులకు వెన్నుదన్నుగా నిలుస్తూ స్వయంగా మోదీనే దేశ ప్రతిష్ఠను చెడగొడుతున్నారన్నారు. కాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ… ‘మోదానీ సమస్య ఈరోజు లోక్‌సభ మరియు రాజ్యసభ రెండిరటినీ కుదిపేసింది. మోదానీ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఇండియా కూటమి పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రజాధనం లంచం ఇవ్వడానికి ఉపయోగించబడిరది. మేము ఈ విషయాన్ని సభ ద్వారా దేశానికి చెప్పాలనుకుంటున్నాము’ అన్నారు. మోదీజీ ఎక్కడికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా… అదానీకి కాంట్రాక్టులు లభిస్తాయి. చాలా పెద్ద జాబితా ఉంది. అందుకే దీనిపై సభలో నిర్మొహమాటంగా చర్చించాలని కోరామని జైరామ్‌ తెలిపారు. ‘దేశానికి హాని జరుగుతున్నప్పుడు ఈ సమస్యలను సభ ముందుకు తీసుకురావడం చాలా ముఖ్యం. దాని కారణంగా ప్రపంచం మనపై విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది’ అని జైరామ్‌ పేర్కొన్నారు.

నెతన్యాహుకు మరణదండన విధించాలి

ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ

టెహ్రాన్‌: ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్‌లపై అరెస్ట్‌ వారెంట్‌ ఒక్కటే సరిపోదని… వారికి మరణదండనే తగుననని ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ అన్నారు. సోమవారం బసిజ్‌ పారా మిలటరీ దళాన్ని ఉద్దేశించి మాట్లా డుతూ… ‘‘ఈ నేరగాళ్లకు మరణ దండన విధించాలి. మన శత్రువులు గాజా, లెబనాన్‌లో విజయం సాధించలేరు. ఈ రెండు చోట్లా ప్రజల ఇళ్లపై బాంబులు జారవిడవడం విజయం కాదు. మూర్ఖులు అది ఆలోచించరు. ఎందుకంటే వారు ప్రజల ఇళ్లు, వైద్యశాలలు, కమ్యూనిటీలపై బాంబులు కురిపిస్తున్నారు. వారు చేస్తున్నది నేరం. వారిపై అరెస్టు వారెంట్‌ మాత్రమే జారీ చేశారు. అది సరిపోదు. నెతన్యాహు, గ్యాలెంట్‌కు కచ్చితంగా మరణశిక్ష విధించాలి’’ అని అలీ ఖమేనీ పేర్కొన్నారు. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి వారందరిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. నెతన్యాహు, గ్యాలెంట్‌లు.. గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతోపాటు ఆకలిచావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. అమెరికా సహా వివిధ పశ్చిమ దేశాలు ఈ వారెంట్‌ను అమలు చేయమని తేల్చిచెప్పాయి. తాము నెతన్యాహు పక్షాన ఉంటామని అమెరికా ప్రకటించింది. తాము ఐసీసీ వారెంట్‌ను తిరస్కరిస్తున్నామని ఇజ్రాయిల్‌ వెల్లడిరచింది. ఆ న్యాయస్థానానికి దానిని జారీ చేసే హక్కులేదని పేర్కొంది. తాము గాజాలో ఎటువంటి యుద్ధనేరాలకు పాల్పడలేదని తెలిపింది. మరోవైపు హమాస్‌ నేత ఇబ్రహీమ్‌ అల్‌ మస్రి అలియాస్‌ డెయిఫ్‌పై ‘అక్టోబర్‌ 7’ నాటి మారణకాండకు బాధ్యుడని ఐసీసీ ప్రకటించింది. అతడిపై కూడా వారెంట్‌ జారీ చేసింది.ఆయనను ఇజ్రాయిల్‌ జులైలో హతమార్చింది.

ఇళ్లపై కూలిన రవాణా విమానం

విల్నియస్‌: డీహెచ్‌ఎల్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 రవాణా విమానం సోమవారం లిథువే నియా రాజధాని విల్నియస్‌ విమానాశ్రయ సమీపంలోని ఇళ్లపై కుప్ప కూలింది. ఈ విమానం విమానాశ్రయంలో దిగడానికి కొద్ది నిమిషాల ముందు సమీపంలోని లిప్‌కల్నిస్‌ అనే ప్రాంతంపై పడిపోయింది. లిథువేనియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 6గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక, సహాయక సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానం జర్మనీలోని లీప్‌జిగ్‌ నుంచి బయల్దేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విమానాన్ని డీహెచ్‌ఎల్‌ కోసం స్విఫ్ట్‌ ఎయిర్‌ లైన్స్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి విమానా శ్రయంలోని మిగిలిన విమానాలను కూడా నిలిపివేశారు. మరోవైపు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం మాత్రం ఈ విమానం కూలిన ఇళ్లల్లోని ప్రజలు సురక్షితంగానే ఉన్నారని తెలిపింది.