Thursday, January 9, 2025
Home Blog Page 14

జిల్లా ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎంఎండిఏ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్నాకు ధర్మవరం ఎం ఎం డి ఏ అధ్యక్షులు రోషన్ జమీర్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు స్వయంగా పుట్టపర్తికి వెళ్లి, మర్యాదపూర్వకంగా తెలియజేశారు. అనంతరం ఎస్పీతో మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు వచ్చినా తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని వారు కోరడం జరిగిందన్నారు. స్పందించిన ఎస్పీ మాట్లాడుతూ మైనారిటీ లకు అన్నివేళలా అండగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుటలో తన వంతు కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు దాదా పీర్, జిల్లా సభ్యులు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

కడప జోన్ 4 పరిధిలో 150 స్టాఫ్ నర్సుల భర్తీ

డి ఎం అండ్ హెచ్ ఓ
డాక్టర్ ఈ బి దేవి
విశాలాంధ్ర అనంతపురం : ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ 4 వారి పరిధిలోని 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగములను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ప్రాంతీయ సంచాలకులు కడప వారు కోరడమైనది, ఈ ఉద్యోగములకు సంబంధించి దరఖాస్తు నమూనా మరియు ఇతర వివరములను : సి ఎఫ్ డబ్ల్యూ . ఏపీ . గోవ్ . ఇన్ వెబ్సైట్ నందు ఉంచడమైనదని అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తు తో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుమును మరియు సంబంధించిన సర్టిఫికెట్లను జతపరిచి ఈనెల 3 తేదీ నుంచి 17 వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల దరఖాస్తులను ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము, కడప నందు అందజేయవలసినదిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బీ దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని తెలియజేశారు.

రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన ధర్మవరం బాలికల జట్టు

విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రస్థాయిలో జరిగిన ఇంటర్ స్కూల్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ధర్మవరం బాలికల జట్టు రాణించి టోర్నమెంట్ రన్నర్స్ గా (ద్వితీయ స్థానం) సాధించిందని అనంతపురం ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపీ జయచంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 డిసెంబర్ 28, 29, 30 తేదీలలో చిత్తూరు నగరంలోని పి ఈ ఎస్ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన టోర్నమెంట్లో ధర్మవరం జట్టు చిత్తూరు జిల్లాకు చెందిన బంగారుపాలెం జట్టు తలపడగా హోరాహోరీగా జరిగాయి అని తెలిపారు. ఫైనల్స్ లో బంగారుపాలెం జట్టు 36 పాయింట్లు, ధర్మవరం జట్టు 34 పాయింట్లు సాధించగా, కేవలం రెండు పాయింట్లు తేడాతో ధర్మవరం జట్టు ఓటమి చెంది, రన్నర్స్ గా నిలిచింది అని తెలిపారు.ఈ టోర్నమెంట్లో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి అని తెలిపారు.రాష్ట్రస్థాయిలోనే ధర్మవరం బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల జయచంద్ర రెడ్డి , ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, సెక్రటరీ వాయల్పాడు ఇదయతుల్లా, కోచ్ సంజయ్, సీనియర్ క్రీడాకారులు, స్థానిక బాస్కెట్బాల్ గ్రౌండ్లో బాలికలకు అభినందనలు తెలిపారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం శుభదాయకం

పలువురు ప్రశంసలు వెల్లువ
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నెల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇకనుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఒక వరంలాగా మారిందని, ఆకలి బాధలు తప్పను ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం ఎంతో సంతోషాన్ని ,తృప్తిని ఇచ్చిందని తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6,220 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇటీవల ఉచితంగా పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు అందజేయడం, ఇప్పుడు విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని చదువుతోపాటు వారి ఆకలిని తీర్చేందుకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. దీంతో పేద విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేయడం ఒక శుభ సూచకమని తెలుపుతున్నారు.

ఎస్సీ కుల గణన అభ్యంతరాల స్వీకరణ జనవరి 7 వరకు పొడిగింపు..

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం:; ఎస్సీ కుల గణన అభ్యంతరాల స్వీకరణ గడువును కలెక్టర్ ఆదేశాల మేరకు జనవరి ఏడవ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల గణన అభ్యంతరాలు జనవరి 11న నమోదు అవుతుందని, తుది కుల గణన సర్వే వివరాలు జనవరి 17న వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. ఈ కుల గణన గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగియడంతో కలెక్టర్ మరో వారం రోజులు పాటు పొడిగించడం జరిగిందని తెలిపారు. ఎస్ఓసి విధివిధానాల తెలుపుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 265 విడుదల చేసినట్టు వారు తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 11వ తేదీ వరకు అధికారులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సచివాలయాల వద్ద పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు.

బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బి టి ఏ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంఈ ఓ.

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : బహుజన టీచర్స్ అసోసియేషన్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను వలేటివారిపాలెం మండల విద్యాశాఖ కార్యాలయము నందు మండల విద్యాశాఖ అధికారి అద్దంకి మల్లికార్జున మరియు శాఖవరం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చిట్యాల చెన్నయ్య గార్లచే గురువారం ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ క్యాలెండర్ అనేక సామాజిక విషయాలు తోటి సామాజిక ఉద్యమ తత్వవేత్తల ఫోటోల తోటి ప్రచురించడం విజ్ఞానపరంగా చాలా బాగుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమములో బి టి ఏ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ సంఘ మహేంద్ర జిల్లా కౌన్సిలర్ మెండావెంకట్రావు మండల శాఖ అధ్యక్షులు వలేటి మాల కొండయ్య ప్రధాన కార్యదర్శి దేపూరి శివన్నారాయణ మండల నాయకులు దార్ల ఆదినారాయణ సవలం సూర్యనారాయణ చల్లా బ్రహ్మయ్య శివన్నారాయణ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నరసింహాచారి కోరారు. గురువారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ పథకాన్ని ఈ నెల ఆఖరి వరకు పొడగించినట్లు తెలిపారు. ఈ పథకం కోసం అప్లై చేసుకున్న వారు నెట్ సెంటరు నందు ఇచ్చిన ఫారాలను, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటోను తీసుకుని ఎమ్మిగనూరులోని సిద్దార్థ కాలేజి రెండో అంతస్తులోని విశ్వకర్మ కౌశల్ యోజన కేంద్రం నందు ఇవ్వాలని కోరారు. కేంద్రం వారు మీకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని తెలిపారు. ఎన్నికైన వారికి శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. కోసిగి, మంత్రాలయం, పెద్దకడబూరు మండలాల వారు తమ అప్లికేషన్లు సిద్దార్థ కాలేజిలో ఇవ్వాలన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి మీకు ఫోన్లు వస్తే నమ్మవద్దని అవి అన్నీ కూడా ఫేక్ ఫోన్లు అన్నారు. మీరు కేవలం కర్నూలు జిల్లా నుంచి వచ్చిన ఫోన్లు మాత్రమే నమ్మాలని కర్నూలు విశ్వకర్మ కౌశల్ యోజన పథకం కేంద్రం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

అనంత మిత్ర మున్సిపాలిటీ సమస్యల ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 మంది కాలర్లు ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేయగా, ఈ విషయమై ప్రజలకు, అధికారులకు, జిల్లా కలెక్టర్ తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విశ్వనాథ్, అనంతపురం మున్సిపల్ కమిషనర్ ఇంచార్జ్ రామలింగేశ్వర్, డైరెక్టర్ ఆకాశవాణి అనంతపురం నాగేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

5న కళ్యాణదుర్గం నియోజకవర్గం లో అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం

విశాలాంధ్ర- అనంతపురం : కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం లో కుందుర్పి మండలం, బెస్తరపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపాన్ని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్, కె .రామకృష్ణ, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ ల చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని గురువారం జిల్లా కార్యదర్శి జాఫర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణదుర్గం కమ్యూనిస్టు పార్టీకి పురిటి గడ్డ బెస్తరపల్లి కేంద్రంగా 1950 దశకంలో దున్నేవాడికి భూమి నినాదంతో శివాయిజమ భూములు, బంజరు భూములు, భూస్వాముల, పెత్తందారుల, కబంధహస్తాల్లో బినామీ పేర్ల మీద ఉన్న భూములు, దేవాలయ భూములు 45 వేల ఎకరాలకు పైబడి పంచిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. చారిత్రక భూ పోరాట ఉద్యమంలో పాల్గొన్న విప్లవ యోధులను స్మరిస్తూ పోరాట స్ఫూర్తికి చిహ్నంగా అమరవీరుల స్తూపంతో పాటు సిపిఐ ఆఫీసు గ్రంథాలయం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాల కార్యక్రమంలో భాగంగా 130 మంది అమరవీరుల పేర్లు లిఖిస్తూ జనవరి 5 న అమరవీరుల స్తూపావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేధావులు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతిపరులు, అలనాటి పోరాట యోధుల వారసులు ,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

టిడిపి విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేద్దాం

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

విశాలాంధ్ర,కదిరి. కదిరి పట్టణం సమీపంలోని మదనపల్లి రోడ్డులో పివిఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగే నియోజకవర్గ టిడిపి విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు.గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు (3వ తేది) మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే నియోజకవర్గ విస్తృత సమావేశానికి గ్రామస్థాయి కమిటీ సభ్యులు మండల స్థాయి కమిటీ సభ్యులు,
మండల కన్వీనర్లు, మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల ఇంచార్జులు, బూత్ కమిటీ సభ్యులు హాజరై సమావేశాన్ని జయ ప్రదం చెయ్యాలని తెలిపారు.