ఆలయ ఈవో వెంకటేశులు. ఆలయ అర్చకులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో కార్తీకమాసమును పురస్కరించుకొని ఆలయ ఈవో వెంకటేశులు, భక్తాదులు, దాతల సహాయ సహకారములతో అంగరంగ వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్లు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఆచార సాంప్రదాయాల ప్రకారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఈవో వెంకటేశులు మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవానికి సేవ, దాత లుగా కీర్తిశేషులు రామయ్య భార్య లక్ష్మమ్మ, కుటుంబ సభ్యులు వసుధాంజలి, గుండాల చంద్రశేఖర్, కుమారుడు హర్షవర్ధన్, సాయి దీప్తి, సాయిల సహకారంతో నిర్వహిస్తూ దాతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పొరాళ్ల పుల్లయ్య ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తాదులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నమయ్య సేవా మండలి పౌర్ణమి సందర్భంగా దాతలు రామకృష్ణమ్మ, శ్రీరామ రెడ్డి, లక్ష్మీదేవి, గంగిరెడ్డి కుమారులు హేమ్ కుమార్ రెడ్డి ,శ్యామల కరుణాకర్ రెడ్డి, సవిత, హవీష్ రెడ్డి, హనీష్ రెడ్డి, గ్రీష్మారెడ్డి ల దాతల సహకారంతో దాదాపు 1100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకలు భక్తాదుల సందడితో, భక్తి వాతావరణంలో, అందరినీ అలరించింది. అనంతరం సాయంత్రం ఆలయ లోపల దాదాపు 1000 దీపాలతో విష్ణు దీపోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతోపాటు దాతలు, భక్తాదులు, అన్నమయ్య సేవా మండలి బృందం పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం..
విద్యార్థుల మంచి చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు .. కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం; విద్యార్థుల మంచి చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని కరెస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సత్య కృపా డిగ్రీ కళాశాల యందు ఫేర్వెల్ డే ను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డోలా పెద్ద రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరమని, విద్యను ఎవరు దొంగలించలేరని, విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు, ప్రభుత్వ ఉద్యోగము లభిస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకొని చక్కటి విద్యను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చదివినప్పుడే సార్థకత ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ చదువు ఎడల మంచి ఆసక్తిని చూపించాలని తెలిపారు. అనంతరం కళాశాలలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు మెమొంటోలను వారు అందజేశారు. తదుపరి విద్యార్థుల ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధ నేతల బృందం తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన డాక్టర్ బషీర్
విశాలాంధ్ర- ధర్మవరం;; పట్టణములోని సాయి నగర్ లో గల స్పందన ఆసుపత్రి అధినేత డాక్టర్ బషీర్ 58వ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణములోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు లోగల బీసీ హాస్టల్ బాలికలు, ఎస్సీ హాస్టల్ బాలికలు, కోర్ట్ రోడ్డు లో బాలసదన్, దుర్గా నగర్ హాస్టల్, ఎర్రగుంట బీసీ హాస్టల్, ఎస్బిఐ కాలనీ బీసీ హాస్టల్ లోని విద్యార్థినీ విద్యార్థులకు దాదాపు 450 దుప్పట్లను ఆసుపత్రి మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్ సిబ్బంది చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్లు, విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా దంపతులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్లు మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి స్పందన హాస్పిటల్ సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉందని, ఇటీవల విజయవాడలో వరద బాధితులకు వివిధ రూపాలలో డాక్టర్ బషీర్ డాక్టర్ సోనియాల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. అదేవిధంగా పట్టణంలో బిపి, షుగర్ పరీక్షలను నిర్వహిస్తూ, అందరికీ అవగాహన కల్పించడంలో మంచి గుర్తింపు కూడా పొంది, మంచి వైద్య చికిత్సలను అందించడంలో పట్టణంలోనే ముందంజలో ఉందని తెలిపారు. ఏది ఏమైనా డాక్టర్ బషీద్ దంపతులు విద్య, వైద్య, తదితర అంశాలను తమదైన శైలిలో మానవతా విలువలను పెంచుతూ, జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు హాస్టల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
నటుడు పోసాని కృష్ణమురళిపై కడపలో కేసు నమోదు
పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్, ఎస్సీ సెల్ నేతల ఫిర్యాదు
పోసానిపై ఇప్పటికే 50కిపైగా కేసుల నమోదు
మరో రెండు రోజుల్లో పోసానికి నోటీసులు జారీచేస్తామన్న పోలీసులు
ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఏపీలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాజంపేట పోలీస్ స్టేషన్‌లోనూ వీరు ఫిర్యాదు చేయడం గమనార్హం.
మరోవైపు, అనంతపురం తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు పోసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోసానిని విచారణకు పిలుస్తామని, రెండుమూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు, సినీనటి శ్రీరెడ్డిపైనా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
నన్ను వేధించిన అధికారులకే పోస్టింగ్ ఇస్తున్నారు: చింతమనేని ప్రభాకర్ ఆవేదన
వైసీపీ హయాంలో తనను వేధించిన అధికారులకు ఇప్పుడు మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. తనను వేధించిన అధికారులు కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని, ఇందులో రెండింటిని కోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, తనతో పాటు ఈ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని తెలిపారు.
తనపై వైసీపీ ప్రభుత్వం 14 అక్రమ కేసులు పెట్టిందని ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన విజయవంతమైనందుకు కూడా కేసులు పెట్టారన్నారు.
యూపీలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ నగరంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో ఎన్ఐసీయూలో (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 10.35 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎన్‌ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు ఉండగా వారిలో 44 మందిని సిబ్బంది రక్షించగలిగారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
చిన్నపిల్లల వార్డులో రెండు యూనిట్లు ఉండగా అందులో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. బయటవైపునకు ఉండే యూనిట్‌లోని పిల్లలను సిబ్బంది రక్షించగలిగారు. కానీ లోపలి వైపునకు ఉండే యూనిట్‌లో కొంతమందిని మాత్రమే కాపాడగలిగామని ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ ప్రకటించారు. మంటలను ఆర్పివేయడానికి ఆరు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించామని చెప్పారు.
కాగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే హాస్పిటల్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో వార్డు కిటికీలను పగలగొట్టి రోగులను వైద్యులు, వైద్య సిబ్బందిని రక్షించారు. పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది రెస్క్యూ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో హాస్పిటల్ ప్రాంగణంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా భయాందోళనలకు గురైన రోగులు, వారి కుటుంబ సభ్యులు కనిపించారు. ఇక అగ్నిప్రమాదంతో హాస్పిటల్ లోపల అనేక వైద్య పరికరాలు కాలిపోయాయి.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలోని ఎన్‌ఐసీయూలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరం అని, హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. మరణించిన చిన్నారుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మరోవైపు మృతి చెందిన 10 మంది చిన్నారుల్లో ఏడుగురిని గుర్తించామని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య, విద్యాశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.
పరారీలో వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ.. సెర్చ్ వారెంట్ జారీ చేసిన పోలీసులు!
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. రాఘవరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయన ఇంట్లో ఏ క్షణంలోనైనా సోదాలు నిర్వహించడానికి అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. వారం రోజుల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ నే తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన స్వగ్రామం అంబకపల్లెతో పాటు పులివెందుల, లింగాల మండలాల్లో పూర్తిగా నిఘా పెట్టారు.
నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ(శనివారం) అయిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలికి ఇవాళ సెలవు ప్రకటించారు. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2024 -25 పై డిమాండ్స్, గ్రాంట్స్ పై పలు శాఖల మంత్రులు వివరణ ఇవ్వనున్నారు. ఆర్ అండ్. బీ..ఇండస్ట్రీస్, జల వనరులు, వ్యవసాయం, సివిల్ సప్లై, హౌసింగ్ శాఖల గ్రాంట్స్‌లపై ఆయా శాఖల మంత్రుల వివరణ ఇవ్వనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై సభలో సల్ప కాలిక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారాల ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభముందు ఉంచుతున్నానని.. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమని తెలిపారు. రాష్ట్రంలోని వ్యవస్ధలను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా తెలియజేశామని అన్నారు. కేంద్ర పథకాల నిధుల మల్లింపు.. పిల్లల పౌష్టికాహరాన్ని అందించే పథకాల నిధులు కూడా మళ్లించారని, ఇందన రంగ నిధులు మళ్లింపు… ఇలాంటి పరిస్ధితుల వల్ల ఆర్ధిక గందరగోళ పరిస్ధితులు ఎదురయ్యాయని.. నేడు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ పతనం అంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. 57 శాతం ఓట్లతో 175 సీట్లకు గానూ 93 శాతం సీట్లు గెలిచామని గుర్తుచేశారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన విప్లవ సమాధానం ఈ ఫలితమని పయ్యవుల కేశవ్ తెలిపారు.
మరోవైపు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాబోమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వంపై తాము విమర్శలు చేస్తామని తెలిపారు. అది కూడా తన నివాసంలోని మీడియా పాయింట్ నుంచే ఈ విమర్శలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అదీకాక తమకు ప్రతిపక్ష హోదా కేటాయిస్తే.. అసెంబ్లీలో మైక్ అధిక సమయం కేటాయించాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం భావనలా ఉందని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకానున్నారు.
సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరుతున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొని ఆయన హైదరాబాద్ కు బయల్దేరుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్న చంద్రబాబు… శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి… ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలందరికీ స్క్రీనింగ్ పరీక్షలు
విశాలాంధ్ర – అనంతపురం : రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లాలోని పిల్లలందరికీ పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిలో ఉన్న వ్యాధులు, వైకల్యాలను పూర్తిగా తల నుండి కాలి వరకు స్క్రీనింగ్ చేసి తొలి దశలోనే వ్యాధులను గుర్తించి సేవలందించడం లక్ష్యంగా స్క్రీనింగ్ పరీక్షలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి నారాయణస్వామి పేర్కొన్నారు. ఈవిధానం ద్వారా ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, అవసరమైన సంరక్షణ, చికిత్స, మద్దతు మరియు రెఫరల్ చికిత్సకు అనుసంధానించడం పై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.
వీటిలో ముఖ్యంగా
1.పుట్టుకతో వచ్చే లోపాలు,
2.వ్యాధులు,
3.పోషకాహార, మరియు
4.అభివృద్ధి అలస్యం మొదలగు 44 రకాల తీవ్ర స్థాయిలో ఉన్న వ్యాధులను గుర్తించుట కొరకు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్మానాత్మకంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది మరియు గుర్తించిన పిల్లలందరికీ అతపరమయిన స్క్రీనింగ్, మెడికల్ మరియు శస్త్రచికిత్సల ద్వారా సహకారం అందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారన్నారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే 0-6 సంవత్సరాల వయస్సు గల 1,45,388 పిల్లలను 2302 అంగన్వాడి బడులలో, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న 7 నుండి 16 సంవత్సరాల వయస్సుగల
మొత్తం 2,00,118 మంది
పిల్లలందరిని ఈ కార్యక్రమం ద్వారా సేవలందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సేవలు అనంతపురం జిల్లాలొని సుమారు 3.45506 మంది పిల్లలకు క్రమపద్ధతిలో స్క్రీనింగ్ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమాన్ని డిఇఐసి మేనేజర్ డి. రజిత పర్యవేక్షణలో ఫాలో అప్ చేయబడుతుంది అని పేర్కొన్నారు.