Home Blog Page 1478

భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌తో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ భాగస్వామ్యం

0


ముంబై: ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఏయూ ఎస్‌ఎఫ్‌బీ), భారతదేశంలో అతిపెద్ద స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఒకటి. భారతీ లైఫ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (భారతి గ్రూప్‌) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, వ్యూహాత్మక బ్యాంక్‌ అస్యూరెన్స్‌ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారం ఏయూ ఎస్‌ఎఫ్‌బీ వినియోగదారులకు విస్తృతమైన జీవిత బీమా, ఆర్థిక భద్రతా పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో, ఎఏయూ ఎస్‌ఎఫ్‌బీ డిప్యూటీ సీఈవో గ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ తిబ్రేవాల్‌, భారతి ఆక్సా లైఫ్‌ ఎండీ, సీఈవో పరాగ్‌ రాజా ఈ ఇన్సూరెన్స్‌ ఒప్పందంపై సంతకం చేసి, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు.

అపోలో హాస్పిటల్స్‌ అరుదైన రికార్డు

0

హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ అరుదైన రికార్డు సృష్టించింది. 24 రోజుల్లో 25 క్లిష్టమైన స్లీప్‌ డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ శస్త్రచికిత్సలు చేసింది. ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు చేయడం ప్రపంచంలోనే అరుదైన ఘనతగా చెప్పవచ్చు. అది కూడా 24 గంటలలో డిశ్చార్జితో. డాక్టర్‌ ధనుంజయరావు గింజుపల్లి ఆధ్వర్యంలో ఈ రికార్డు స్థాయి శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని అపోలో మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ ధనుంజయరావు మాట్లాడుతూ మూమెంట్‌ డిసార్డర్స్‌ వంటి పార్కిన్సన్స్‌ వ్యాధి, ఎసెంషియల్‌ ట్రెమర్స్‌, డిస్టోనియా లాంటి వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో ఈ వ్యాధుల సంఖ్య అధికంగా ఉన్నాయన్నారు. పార్కిన్సన్స్‌ వ్యాధి దేశంలో పది లక్షల మందికి పైగా ప్రభావితం చేస్తుందన్నారు. ఇది భారతదేశాన్ని న్యూరాలజికల్‌ వ్యాధుల ప్రధాన కేంద్రంగా మార్చుతుందని చెప్పారు. దీనిని నివారించేందుకు అపోలో హాస్పిటల్స్‌ హైదరాబాద్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) శస్త్రచికిత్సను ప్రవేశపెట్టిందని తెలిపారు.

డిస్కవర్ అనంతపురం గ్రీన్ ఆర్మీ తో చేతులు కలిపిన ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తుల అసోసియేషన్

విశాలాంధ్ర అనంతపురం : నగరంలో గత రెండు వారాలుగా నో టు ప్లాస్టిక్ బ్యాగ్స్ కార్యక్రమం కింద లక్ష బట్ట బ్యాగులు ఉచితంగా నగర ప్రజలకు పంచుతూ వారిలో అవగాహన కల్పిస్తూ విశేష స్పందన లభించిన అనంతపురం అనిల్ కుమార్ కార్యక్రమానికి గురువారం మాజీ సైనిక ఉద్యోగస్తులు వారితో చేతులు కలిపారు. ఈ సందర్భంగా మాజీ సైనికు ఉద్యోగి షేక్ అన్నా మాట్లాడుతూ… సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం వల్ల నగరానికి నగర ప్రజలకు జరిగే నష్టం వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని అందువలన నగర ప్రజలకు అలాగే పారిశుధ్య కార్మికులకు చెప్పలేని నష్టం జరుగుతుందని గ్రీన్ ఆర్మీ చేస్తున్న ఈ లక్ష బ్యాగుల మహాయజ్ఞంలో తాముపాలుపంచుకుంటున్నామన్నారు. దేశ పరిరక్షణ కోసం మేము బార్డర్లో పనిచేస్తుంటే పర్యావరణ పరిరక్షణ కోసం డిస్కవర్ అనంతపూర్ గ్రీన్ ఆర్మీ వ్యవస్థాపకులు అనంతపూర్ అనిల్ కుమార్ ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేదించాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ బట్టల సంచులను వితరణ చేయడం అభినందనీయమన్నారు. అనంతపూర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ… ఈరోజు పాతూరులోని మార్కెట్లో సుమారు రెండున్నర వెయ్యి బట్ట బ్యాగులు ప్రజలకు గ్రీన్ ఆర్మీ సభ్యులు మరియు మాజీ సైనికులు పంచడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక్ ఉద్యోగులు భాష, గ్రీన్ ఆర్మీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎంపిక…

ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం : అనంతపురంలోని పిటిసి గ్రౌండ్లో ఈనెల 21వ తేదీన ఎస్జీఎఫ్-అండర్ 19 క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ధర్మవరం పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని అయిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజ్ దీపిక రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులకు అభ్యాసాలు నిర్వహించడం జరుగుతుందని, జాతీయ, రాష్ట్ర పోటీలకు కూడా మా విద్యార్థినీలు ఎంపిక కావడం జరుగుతోందని తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తూ, ఆరోగ్య సూత్రాలను కూడా విద్యార్థులకు వివరిస్తూ, విద్య యందు కూడా మంచి ప్రతిభను కనబరుచుచున్నామని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు, బోధనేతర బృందం, తల్లిదండ్రులు తేజ్ దీపికాకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

20 కర్ణాటక ప్యాకెట్ స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ.చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని బత్తలపల్లి నుండి ముదిగుబ్బ పోవు బస్సు రోడ్డు నందు డి చెర్లోపల్లి క్రాస్ వద్ద పత్యాపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ వద్ద 20 కర్ణాటక ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. తదుపరి వారు మాట్లాడుతూ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు అమ్మకాలు చట్టరీత్యా నేరమని, మద్యం తాగువారు మద్యం షాపులోనే కొనుగోలు చేయాలని తెలిపారు. ఎక్కడబడితే అక్కడ అమ్మకాల కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఎక్కడైనా నాటు సారా తయారీ, అక్రమంగా మద్యం రవాణా లాంటి సమాచారాలు అందితే మాకు తెలియపరచాలని, సమాచారం అందించిన వారి పేరును గోపెయంగా ఉంచుతామని తెలిపారు.

ఫోను లిఫ్టు చేసినందుకు మాయమైన 90, 000రూ.లు

విశాలాంధ్ర ధర్మవరం:: రెవెన్యూ డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం చంద్ర చర్ల గ్రామానికి చెందిన కత్తే సుధాకర్ సెల్ఫోన్ కు ఎస్బిఐ ఆఫ్ ఇండియా పేరున ఫోన్ కాల్ రావడంతో వారు లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసినప్పుడు ఎవరు మాట్లాడకపోవడంతో నిమిషాల వ్యవధిలోనే వారి బ్యాంకు నుంచి 50 వేల రూపాయలు, 40 వేల రూపాయలు రెండు దఫాలుగా అతని ఖాతా నుంచి మాయమైంది. కత్తి సుధాకర్ కు ధర్మవరం ఎస్బిఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఇలా జరగడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, వారి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలుపుతున్నారు. ఇటువంటి వాటి పట్ల ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన చేసుకోవడం అందరికీ మంచిదని పోలీసులు తెలుపుతున్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో సక్రమంగా అమలుపరచండి..

ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో సక్రమంగా అమలుపరిచేర తగిన చర్యలు గైకొనాలని కోరుతూ ధర్మవరం నియోజకవర్గం దాడి తోట గ్రామానికి చెందిన ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్ రెడ్డి విజయవాడలోని కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విన్నవించారు. ఈ సందర్భంగా గౌరవ పూర్వకంగా కలవడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్లు కూడా త్వరితగతిన ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరడం జరిగిందని తెలిపారు. తదుపరి నియోజకవర్గంలోని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని వారు తెలిపారు. స్పందించిన మంత్రి తప్పక మీకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు.

20 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల కం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించిన 20 కుటుంబాలు జనసేన పార్టీలోకి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడం వల్లనే తాము జనసేన పార్టీలోకి చేరడం జరిగిందని, పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లి, న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని, పార్టీ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక లాంటి వారిని తెలిపారు. పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని వారు హామీ ఇచ్చారు.

సమ సమాజంలో గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో అశోక్ నగర్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి సిపిఐ పార్టీ నాయకులు, బీసీ సంఘం నాయకులు, టిడిపి పార్టీ నాయకులు, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జమ్మి .శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, కుల వివక్షత, పై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు బలహీన, వర్గాలకు హక్కులు, మహిళలకు విద్య అవకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెలగల దుర్గారావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు జేష్ట రామకృష్ణారావు, గోపాలకృష్ణ గోకులే, సిపిఐ పార్టీ మండల సహాయక కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, ఇళ్ల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

0

శాసనసభ్యులు బడేటి చంటి….

ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి (పేర్కొన్నారు). గురువారం స్థానిక బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేయగా ఎన్నికల కోడ్ అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించి మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడిపి మూడవ డివిజన్ ఇంచార్జ్ జాలా బాలాజీ, కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, నగర కార్పొరేషన్ మాజీ విప్ గూడవల్లి వాసు, పలువురు కార్పొరేటర్లు, టిడిపి సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్,పెద్ది బోయిన శివప్రసాద్,చల్లా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.