Home Blog Page 1479

20 కర్ణాటక ప్యాకెట్ స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ.చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని బత్తలపల్లి నుండి ముదిగుబ్బ పోవు బస్సు రోడ్డు నందు డి చెర్లోపల్లి క్రాస్ వద్ద పత్యాపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ వద్ద 20 కర్ణాటక ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. తదుపరి వారు మాట్లాడుతూ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు అమ్మకాలు చట్టరీత్యా నేరమని, మద్యం తాగువారు మద్యం షాపులోనే కొనుగోలు చేయాలని తెలిపారు. ఎక్కడబడితే అక్కడ అమ్మకాల కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఎక్కడైనా నాటు సారా తయారీ, అక్రమంగా మద్యం రవాణా లాంటి సమాచారాలు అందితే మాకు తెలియపరచాలని, సమాచారం అందించిన వారి పేరును గోపెయంగా ఉంచుతామని తెలిపారు.

ఫోను లిఫ్టు చేసినందుకు మాయమైన 90, 000రూ.లు

విశాలాంధ్ర ధర్మవరం:: రెవెన్యూ డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం చంద్ర చర్ల గ్రామానికి చెందిన కత్తే సుధాకర్ సెల్ఫోన్ కు ఎస్బిఐ ఆఫ్ ఇండియా పేరున ఫోన్ కాల్ రావడంతో వారు లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసినప్పుడు ఎవరు మాట్లాడకపోవడంతో నిమిషాల వ్యవధిలోనే వారి బ్యాంకు నుంచి 50 వేల రూపాయలు, 40 వేల రూపాయలు రెండు దఫాలుగా అతని ఖాతా నుంచి మాయమైంది. కత్తి సుధాకర్ కు ధర్మవరం ఎస్బిఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఇలా జరగడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, వారి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలుపుతున్నారు. ఇటువంటి వాటి పట్ల ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన చేసుకోవడం అందరికీ మంచిదని పోలీసులు తెలుపుతున్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో సక్రమంగా అమలుపరచండి..

ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో సక్రమంగా అమలుపరిచేర తగిన చర్యలు గైకొనాలని కోరుతూ ధర్మవరం నియోజకవర్గం దాడి తోట గ్రామానికి చెందిన ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్ రెడ్డి విజయవాడలోని కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విన్నవించారు. ఈ సందర్భంగా గౌరవ పూర్వకంగా కలవడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్లు కూడా త్వరితగతిన ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరడం జరిగిందని తెలిపారు. తదుపరి నియోజకవర్గంలోని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని వారు తెలిపారు. స్పందించిన మంత్రి తప్పక మీకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు.

20 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల కం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించిన 20 కుటుంబాలు జనసేన పార్టీలోకి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడం వల్లనే తాము జనసేన పార్టీలోకి చేరడం జరిగిందని, పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లి, న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని, పార్టీ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక లాంటి వారిని తెలిపారు. పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని వారు హామీ ఇచ్చారు.

సమ సమాజంలో గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో అశోక్ నగర్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి సిపిఐ పార్టీ నాయకులు, బీసీ సంఘం నాయకులు, టిడిపి పార్టీ నాయకులు, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జమ్మి .శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, కుల వివక్షత, పై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు బలహీన, వర్గాలకు హక్కులు, మహిళలకు విద్య అవకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెలగల దుర్గారావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు జేష్ట రామకృష్ణారావు, గోపాలకృష్ణ గోకులే, సిపిఐ పార్టీ మండల సహాయక కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, ఇళ్ల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

0

శాసనసభ్యులు బడేటి చంటి….

ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి (పేర్కొన్నారు). గురువారం స్థానిక బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేయగా ఎన్నికల కోడ్ అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించి మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడిపి మూడవ డివిజన్ ఇంచార్జ్ జాలా బాలాజీ, కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, నగర కార్పొరేషన్ మాజీ విప్ గూడవల్లి వాసు, పలువురు కార్పొరేటర్లు, టిడిపి సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్,పెద్ది బోయిన శివప్రసాద్,చల్లా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ గ్రంథాలయ అధికారికి సన్మానం

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ గ్రంథాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తొలత నివాళులు అర్పించారు. తర్వాత ఉత్తమ గ్రంథాల అధికారి మహబూబ్ బాషాను ఘనంగా సన్మానించారు, సన్మాన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్ బాషా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ యొక్క చేతులు మీదుగా ఆగస్టు 15న మహబుబ్ బాషా ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అవార్డు తీసుకోవడం మన పెనుకొండ కు ఎంతో గరవకారణం అని అన్నారు. ఈ యొక్క జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఉత్తమ గ్రంథాలయ అధికారి అయిన టువంటి మహబూబ్ బాషాని మన సన్మానించుకోవడం ఎంతో గర్వకారణమైన విషయం అన్నారు,మంచిస్వభావి,గ్రంథాలయంలోని పుస్తకాలను పరిరక్షింక్షిచడం ,ప్రాచీన గ్రంధాలను బద్రపరచడం.పాఠకుల యొక్క సంఖ్యను పెంచడంలోనూ గ్రంధాలయం పరిశుభ్రంగా ఉంచడంలోని గ్రంథాలయాన్ని విద్యార్థులకు ఉపయోగ కరంగా మలచటంలోను, పాఠకుల ఆదరణ పొందడం లోను, పాఠకులకు అందుబాటులో కావాల్సిన పుస్తకాలని భద్ర పరచ డంలోను.నియమ నిబంధనలను పాటిస్తూ గ్రంథాలయయాన్ని అన్ని విధాలుగా అందరికీ అందు బాటులోకి తీసుకు రావటంలో చాలా కృషిచేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంఎన్ మూర్తి , .నంజుశీడ ఇమ్రాన్, పెద్దన్న, రామాంజ నేయులు, నారాయణ, జాఫర్ వలి పాన్ భాష,ప్రతాపరెడ్డి, శివ, నరసింహులు, గ్రంధాలయ పాఠకులు మరియు తదితరులు.

సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే

మంత్రి పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర -అనంతపురం : శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక డ ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ మేయర్ వసీం, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పూల నాగరాజు, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, డిఆర్ఓ ఏ.మాలోల, తదితరులు పాల్గొని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సమాజంలో మార్పు తెచ్చిన, స్ఫూర్తి నింపిన వ్యక్తులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. అణగారిన వర్గాలను సమాజంలో వేరుచేసి చూస్తున్న రోజుల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే సమాజంలో మార్పులను తీసుకురావాలని పూలే తను, తన భార్యతో మాత్రమే తన మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించారన్నారు. జ్యోతిబా పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో సామాజిక అంతరాలు తొలగించేందుకు దేశంలో మొట్టమొదటిసారి ప్రయత్నం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతీరావ్ ఫూలే వర్థంతి కి ఘన నివాళి

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర పెనుకొండ : పెనుకొండ పట్టణం లోని టిడిపి కార్యాలయం నందు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, మహాత్మా జ్యోతి రావ్ ఫూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడని,
ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారని ,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని మతాలు, కులాల పేద ప్రజల అభ్యున్నతి కి కృషి చేశాడని టీడీపీ నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు,నారాయణస్వామి, చంద్రమౌళి, వెంకట రాముడు, మాజీ సర్పంచ్ అశ్వర్థ నారాయణ, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, మండల రూరల్ కన్వీనర్ సిద్దయ్య, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ , కౌన్సిలర్ గిరి,రామలింగ, నరేంద్ర, పులుగుర శ్రీనివాసులు,బోయ నంజుండ కురబ నంజుండ సూరి , గోపి, చెన్నరాయుడు, లక్ష్మీదేవమ్మ, శ్రీదేవి సుబ్రమణ్యం మల్లికార్జున సోము తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. రైతు సంఘం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ విమర్శించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు కాస్తో కూస్తో గిట్టుబాటు ధర ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా నిట్టనిలువ ముంచే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడైనా రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తానని అబద్దపు హామీలు ఇచ్చిందన్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 వేలు ఇస్తానని చెప్పి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రైతులకు ఇంతవరకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక మోడీ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదని వారన్నారు. వెంటనే మిర్చి ధరకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పంట నష్ట పరిహారం కింద మిర్చిని కూడా చేర్చాలని, అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో 1000 మంది పైగా రైతులు ట్రాన్స్ ఫార్మర్లు కోసం డీడీలు చెల్లించినా కూడా ఇంతవరకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వకుండా కూటమీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగిలి మారెప్ప, మదరసాబు, రజ్జప్ప, బుడ్డన్న, మహబూబ్, ముక్కన్న, భాష, తదిత రైతులు పాల్గొన్నారు.