Home Blog Page 1496

వాలంటీర్లే లేరు.. వాళ్లకు జీతాలు ఎలా చెల్లించాలి?: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదన్న మంత్రి
2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని వ్యాఖ్య
ఎన్నికలకు ముందు వాలంటీర్లతో రాజీనామాలు చేయించారన్న మంత్రి

ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాలవీరాంజనేయస్వామి తెలిపారు. కానీ, లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించేవాళ్లమని చెప్పారు. 2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని… ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు.

2023 ఆగస్ట్ వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని… 2023 సెప్టెంబర్ లో వారిని కొనసాగించే జీవో ఇవ్వలేదని తెలిపారు. వారిని కొనసాగిస్తున్నట్టు జీవో ఇచ్చిఉంటే వారి జీతాలను కూడా పెంచేవాళ్లమని చెప్పారు. అయితే, వాలంటీర్ల వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు.

మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మళ్లీ షాక్ ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ రేట్లు, ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ముందు భారీగా పెరిగిన ఈ ధరలు తర్వాత తగ్గుముఖం పట్టాయి. కానీ నిన్నటి నుంచి మాత్రం వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ సంఘటనలు, ఆర్థిక పరిస్థితులు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు (బుధవారం) ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగి రూ.77,080కు చేరుకుంది.

నేటి బంగారం ధరలు

ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,230కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 70,810కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,080కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,660కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు రూ. 2,200 పెరగడం విశేషం. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

ముంబైలో రూ. 77,080, రూ. 70,660

ఢిల్లీలో రూ. 77,230, రూ. 70,810

హైదరాబాద్‌లో రూ. 77,080, రూ. 70,660

విజయవాడలో రూ. 77,080, రూ. 70,660

వడోదరలో రూ. 77,130, రూ. 70,710

కోల్‌కతాలో రూ. 77,080, రూ. 70,660

చెన్నైలో రూ. 77,080, రూ. 70,660

బెంగళూరులో రూ. 77,080, రూ. 70,660

పూణేలో రూ. 77,080, రూ. 70,660

కేరళలో రూ. 77,080, రూ. 70,660

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 91,600

ముంబైలో రూ. 91,600

హైదరాబాద్‌లో రూ. 101,100

సూరత్‌లో రూ. 91,600

తిరుపతిలో రూ. 101,100

విజయవాడలో రూ. 101,100

వడోదరలో రూ. 91,600

పాట్నాలో రూ. 91,600

అహ్మదాబాద్‌లో రూ. 91,600

కేరళలో రూ. 101,100

చెన్నైలో రూ. 101,100

కోల్‌కతాలో రూ. 91,600

సర్వీస్ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటాం: ఏపీ మంత్రి అనగాని

ఏపీలో సర్వీస్ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వృత్తి పనుల వారికి గతంలో సర్వీస్ ఇనాం భూములు కేటాయించారు. లబ్ధిదారులు ఆ భూములను సాగు చేసుకోవడం తప్ప వాటిపై వారికి ఎలాంటి హక్కులు లేవు. ఆ భూములపై వారికి హక్కులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సర్వీస్ ఇనాం భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఎకరాలు ఉండొచ్చని మంత్రి తెలిపారు. నగరాలు, పట్టణాల్లో 40 నుంచి 50 గజాల్లో కట్టుకున్న ఇళ్లలో కొన్ని 22ఏ నిషేధ జాబితాలో ఉన్న విషయంపై మాట్లాడుతూ ఆ సమస్య ఎక్కడెక్కడ ఏ మేరకు ఉందో ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకురావాలని… తాము పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది

హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్

గత ఎన్నికలకు ముందు ఃవ్యూహంః సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై పోలీసు కేసు నమోదయింది. విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న జరగాల్సిన పోలీసు విచారణకు వర్మ డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని… విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని… నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు.

మరోవైపు పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారించిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడం విదితమే. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను మాత్రం విచారణకు స్వీకరించింది. పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఈ క్రమంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని… వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ఎస్ఐపీబీ సమావేశంలో రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుతో పాటు, ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే అంశంపై మంత్రివర్గంలో చర్చించి, వాటికి ఆమోదం తెలియజేస్తుంది. అలాగే సూపర్ సిక్స్ పథకాల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పరిశ్రమలకు సంబంధించి భూకేటాయింపులపైనా కేబినెట్‌లో చర్చించనుంది.

ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

0

. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ అభివృద్ధి
. సోనియమ్మ లేకుంటే తెలంగాణ లేదు
. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే… చర్చకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అడబిడ్డలు మనసు నిండుగా తనను ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. మంగళవారం వరంగల్‌ లో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ప్రజా కవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వర్చువల్‌ విధానంలో వరంగల్‌ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం… వరంగల్‌ లో కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌ను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు మాహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడిరచి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్‌ జెండాను ఎగరేసింది మన ఆడబిడ్డనే అంటూ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి ఉన్నారని, ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టాటా బిర్లాలను తలదన్నేల రాష్ట్రంలో ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా ప్రభుత్వం తీర్చిదిద్దబోతోందని పేర్కొన్నారు. ‘మేం నిర్మిస్తే మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారని ఒకాయన మాట్లాడుతుండు కానీ కాళొజీ కళాక్షేత్రం పదేళ్లుగా పూర్తి చేయనప్పుడే మీ బుద్ధి బయటపడిరది. మీరు పూర్తిచేయలేదు కాబట్టే మేం కాళోజీ కళాక్షేత్రంను పూర్తి చేశాం’ అని రేవంత్‌ చెప్పారు. వరంగల్‌ గడ్డపై రైతు డిక్లరేషన్‌ తో తెలంగాణలో కాంగ్రెస్‌ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. చారిత్రాత్మక వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌ కు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వరంగల్‌ అభివృద్ధికి దాదాపు రూ.ఆరువేల కోట్లు కేటాయించామన్నారు. వరంగల్‌ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్లే అన్నారు. వరగంల్‌ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదని చెప్పారు. ‘మీరు కుట్రలు, కుతంత్రాలు చేయొచ్చు కానీ మీ కుట్రలను గుర్తించి ఊచలు లెక్కబెట్టిస్తాం’ అని బీఆర్‌ఎస్‌ నాయకులను ఉద్దేశించి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ… పది నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని ఒకాయన మాట్లాడుతుండు కానీ వాస్తవానికి పది నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారని, అదానీ, అంబానీ లకే పరిమితమైన సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారని అన్నారు. పది నెలల్లో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారు. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పొందారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతీ పేద కుటుంబం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందుతోందని చెప్పారు. ‘పదినెలల్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగం కోల్పోయారు తప్ప ఇంకేమీ కాలేదని… ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 22లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం’ అని చెప్పారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన వ్యక్తి కేసీఆర్‌ అని కానీ నేడు రాష్ట్రంలో 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం రైతులు పండిరచారని వెల్లడిరచారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో వరి ధాన్యం పండిరచలేదన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే దేనిపై అయినా చర్చించేందుకు సిద్ధమని.. ఆయన ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాలని సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తూ … కేటీఆర్‌ మాట్లాడగానే రెండోరోజు కిషన్‌ రెడ్డి మాట్లాడుతడని నేను సోనియమ్మకు గులాం అని కిషన్‌ రెడ్డి మాట్లాడుతుండు కానీ అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తల్లి సోనియమ్మ అనే విషయం ఆయన గుర్తు పెట్టుకోవలన్నారు. సోనియమ్మ మా అమ్మ,…. నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ… అలాంటి ఆ తల్లి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి కూడా మేం సిద్ధమే అన్నారు. ఇది మాకు అవమానం కాదు.. ఆత్మ గౌరవంగా పేర్కొన్నారు. ఆ తల్లి లేకుంటే తెలంగాణ ఉండేది కాదని, కిషన్‌ రెడ్డి సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుంటే… మోదీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుందన్నారు. తెలంగాణను అపహాస్యం చేసిన తెలంగాణ ద్రోహి మోదీ అని, ఆయనకు గులాంగా మారిన వారికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు.

మాది ఇందిరమ్మ రాజ్యం

0

. మీలా రైతుల భూములు గుంజుకోబోం
. భూ బాధితుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: భట్టి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: కాంగ్రెస్‌ గతంలో రైతులకు ఇచ్చిన భూములను బీఆర్‌ఎస్‌ హయాంలో గుంజుకు న్నారని, వాటికి లేఅవుట్‌లు వేసి అమ్ముకున్నారని, దీంతో అన్నదాతల గురించి మాట్లాడే అర్హతను గత పాలకులు కోల్పోయారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితో, ఆమె ఆశయాలు, ఆలోచనలు ప్రకారం తమ ప్రభుత్వం ముందుకెళుతున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌, నెక్లెస్‌ రోడ్డులోని పీవీ మార్గ్‌ వద్ద ఆమె విగ్రహానికి పుష్కాంజలి ఘటించారు. అనంతరం పీసీసీ మహేశ్‌ గౌడ్‌ అధ్వర్యంలో గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేళి నివాళులర్పించారు. ఆపై విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. 24 అక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల్లో 10వేల ఎకరాలను బీఆర్‌ఎస్‌ అన్యాక్రాంతం చేసిందని ఆరోపించారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూములను రాష్ట్రాభివృద్ధి ఉద్దేశంతోనే తీసుకుంటాము తప్ప మీలా బలవంతంగా తీసుకోమని బీఆర్‌ఎస్‌ను భట్టి విమర్శించారు. లగచర్లలో అమాయక రైతులను రెచ్చగొట్టి అఇకారులపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు హింసను ప్రేరేపించి దాడులకు పురిగొల్పుతుంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్‌ రెడ్డి కష్టపడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని… కాంగ్రెస్‌ కూడా తమ లాంటి పార్టీ అని భ్రమ పడుతోందన్నారు. దేశాన్ని అస్థిరపర్చాలని, విభజించాలని, తద్వార రాజకీయ లబ్ధి పొందాలనుకునే మీకు ఇందిరమ్మ రాజ్యం కోరుకునే మాతో పొలిక సరి కాదని భట్టి విక్రమార్క అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ తెలిసినవాళ్లు, దేశంపై అభిమానం… చరిత్రపై అవగాహన ఉన్న వారు ఇందిరా గాంధీ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేరన్నారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరా గాంధీ మార్గాన్ని తమ ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పిన విధనంగానే కులగణన నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ స్ఫూర్తితో ఈ సర్వేను శాస్త్రీయంగా చేస్తున్నామన్నారు. కుల గణన సర్వే ముగిసిన తర్వాత రాజకీయ `ఆర్థిక సామాజిక అంశాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రగతిశీల నిర్ణయాల ద్వారా దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతామని భట్టి అన్నారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమ సమాజ నిర్మాణానికి ఇందిరాగాంధీ పునాదులు వేశారన్నారు. తన ప్రాణం కంటే కూడా ఈ దేశం ముఖ్యమని, దేశ సుస్థిరత కోసం చివరి రక్తపు బొట్టును కూడా ధారపోస్తానని చాటి చెప్పిన ఉక్కు మహిళ అంటూ కొనియాడారు. విదేశీ విధానంలో ఔన్యత్యాన్ని తెచ్చి భారత్‌ను గొప్ప దేశంగా నిలబెట్టిన ఆమె స్ఫూర్తిదాయకమని భట్టి శ్లాఘించారు. సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఫిషరీస్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, నాయకులు శంకర్‌ నాయక్‌, చరణ్‌ యాదవ్‌, భూపతిరెడ్డి పాల్గొన్నారు.

కొత్తగూడెం అభివృద్ధే లక్ష్యం

0

. త్వరలోనే రాబోతున్న విమానాశ్రయం: కూనంనేని
. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు

విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కాబోతోందని, తమ కల త్వరలోనే సాకారమవుతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధుల విషయంలో రాజీ ప్రసక్తే లేదని, కావల్సిన నిధులను రాబడుతున్నట్లు తెలిపారు. స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని కూనంనేని చెప్పారు. ఆయన మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని డీఏంఎఫ్‌ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రెండవ వార్డులో రూ.70 లక్షలతో నిర్మించనున్న సాధికారత కేంద్రానికి, 24వ వార్డులో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్‌ నిర్మాణానికి, 25వ వార్డులో రూ.30 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం కూనంనేని మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో మహా నగరాలకు దీటుగా కొత్తగూడెం నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కొత్తగూడెం అభివృద్ధి విషయంలో మంత్రులతో పాటు ప్రభుత్వ సహకారం తనకు ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్‌ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతామహాలక్ష్మీ, కమిషనర్‌ శేషాంజన్‌ స్వామి, ఇన్‌చార్జి తహసీల్దార్‌, డీఈ రవికుమార్‌, కౌన్సిలర్లు వేల్పుల దామోదర్‌, సత్యభామ, సాహెరా బేగం, బోయిన విజయ్‌ కుమార్‌, పి సత్యనారాయణాచారి, నాయకులు యూసుఫ్‌, మాచర్ల శ్రీనివాస్‌, అబ్దుల్‌ అజీజ్‌, అబ్దుల్‌ రహమాన్‌, రోహినినాథ్‌, బండారి రాములు, నేరెళ్ల రమేశ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

జీవో 16 చెల్లదు

0

హైకోర్టు సంచలన తీర్పు

విశాలాంధ్ర-హైదరాబాద్‌: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో తెచ్చిన జీవో 16 చెల్లదని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జీవో 16ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ జీవో ప్రకారం విద్యా, వైద్య శాఖల్లో పనిచేసే ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. హైకోర్టు తాజా తీర్పుతో ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. క్రమబద్ధీకరించిన వారిని తిరిగి ఒప్పంద ఉద్యోగులుగా కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొన్నట్లు పిటిషనర్లు తెలిపారు. అయితే తీర్పు ప్రతి అందితే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు అన్నారు. ఇదిలావుంటే జీవో 16 నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించడం ద్వారా తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం జీవో 16 రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు వెలువరించింది.

ఆకలి, పేదరికంపై పోరుకుఅంతర్జాతీయ కూటమి

‘జీ20’ ప్రారంభ సభలో బ్రెజిల్‌ ప్రకటన
రియో డి జనేరియో : ఆకలి, పేదరికంపై పోరాటానికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటైంది. జీ20 సదస్సు ప్రారంభోత్సవంలో ఈ కూటమిని బ్రెజిల్‌ అధó్యక్షుడు లులా డా సిల్వా ప్రకటించారు. బ్రెజిల్‌ నిర్దేశించిన లక్ష్యసాధనకు 26 అంతర్జాతీయ సంస్థలు, 81 దేశాలు, తొమ్మిది ఆర్థిక సంస్థలు, 31 స్వచ్చంధ సంస్థల మద్దతు ప్రకటించాయి. ‘73.3 కోట్ల మందికి పౌష్టికాహారం లభించని పరిస్థితుల్లో నేడు మనం బతుకున్నామని, ఈ సంఖ్య బ్రెజిల్‌, మెక్సికో, జర్మనీ, బ్రిటన్‌, దక్షిణ అమెరికా, కెనడా దేశాల జనాభాకు సమానమని లులా అన్నారు. 73 కోట్ల మందికిపైగా ఆకలితో అలమటిస్తున్నారంటే పరిస్థితి ఎంత జఠిలంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏటా ఆరు బిలియన్ల టన్నుల ఆహారోత్పత్తి ఉన్నాగానీ ఇంతటి పరిస్థితులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఆకలిపై, పేదరికంపై పోరాటానికిగాను జీ20కి బ్రెజిల్‌ అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా అంతర్జాతీయ కూటమి (గ్లోబల్‌ అలయెన్స్‌) ఏర్పాటు అయిందని లులా డా సిల్వా తెలిపారు.
ఈ కూటమి వల్ల న్యాయం జరగడమే కాకుండా తమకు గొప్ప వారసత్వం… ప్రపంచ శాంతి, సుసంపన్న సమాజాల నిర్మాణానికి చేయూత లభిస్తుందని ఆకాంక్షించారు. తమ ఉద్దేశానికి మద్దతిచ్చిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్‌ రాజధాని రియో డి జనేరియోలో ఈనెల 18,19 తేదీల్లో జీ20 సమావేశాలు జరిగాయి. కాగా, 2023, డిసెంబరు ఒకటో తేదీ నుంచి జీ 20 అధ్యక్ష పగ్గాలను బ్రెజిల్‌ చేపట్టిన విషయం విదితమే.