Wednesday, May 14, 2025
Home Blog Page 15

భీకర దాడులు

0

పాక్‌ దుస్సాహసం

. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలతో దాడి
. తిప్పికొట్టిన భారత బలగాలు
. మూడు యుద్ధ విమానాలు, 12 డ్రోన్లు కూల్చివేత
. గడప దాటొద్దని ప్రజలకు హెచ్చరికలు
. జమ్మూ, కుప్వారా, పూంచ్‌లో సైరన్ల మోత
. 8 పాకిస్థానీ క్షిపణులను ఎస్‌`400 వ్యవస్థతో ధ్వంసం

న్యూదిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్‌ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్‌… తన ఉనికి చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడిరది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్‌ ఆత్మాహుతి డ్రోన్‌ దాడులకు పాల్పడిరది. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్‌ దాడుల్ని తిప్పికొట్టింది. జమ్మూ, పంజాబ్‌ మొత్తం బ్లాకౌట్‌ కాగా రాజస్థాన్‌లోని కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అఖ్నూర్‌, కిష్ట్వార్‌, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్‌ దుస్సాహసానికి పాల్పడిరది. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధవిమానాలతో దాడులకు దిగింది. పాక్‌ ప్రయోగించిన దాదాపు 12 డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను ఎస్‌400 వ్యవస్థ ద్వారా భారత సాయుధ దళాలు ధ్వంసం చేశాయి. పాక్‌ ఉపయోగించిన రెండు జేఎఫ్‌17, ఒక ఎఫ్‌`16 యుద్ధ విమానాలను, ప్రొఖ్రాన్‌ వద్ద క్షిపణిని పేల్చివేశాయి. అయితే ఆకస్మికంగా జరిగిన దాడితో జమ్మూకశ్మీర్‌ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపై ఉన్న వారంతా ఆందోళనతో పరుగులు తీశారు. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లో హై అలర్డ్‌ ప్రకటించారు. ఆయా ప్రాంతాల గగనతలంలో పాక్‌ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడగా భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కాగా, పాక్‌ దాడులతో పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌ సహా ఏడుచోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దాడుల వేళ జమ్మూకశ్మీర్‌ పూర్తిగా అంధకారమైంది. జమ్మూ, కుప్వారా, పూంచ్‌లో సైరన్లు మోగాయి. జమ్మూ విమానాశ్రయంపై రాకెట్‌ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. శ్రీనగర్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వైమానిక దళం ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్‌ లక్ష్యంగా చేసుకుంది. జైసల్మేర్‌ వద్ద డ్రోన్లను భారత సైన్యం గాల్లో పేల్చివేసింది. జమ్మూ వర్సిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చివేసింది. జమ్మూ, కుప్వారా, పఠాన్‌కోట్‌ సహా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ డివిజన్‌లోని సాంబాతో పాటు అఖ్నూర్‌, రైసీ, రాజౌరీ, కిష్ట్వార్‌లో భారీగా కాల్పులు, ఫిరంగి దాడులు జరిగాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం ఆదేశించింది. సెల్‌ఫోన్‌ సేవలు నిలిపివేసింది. యూఏవీ (మానవరహిత ఏరియల్‌ వెహికల్స్‌)లతో పాక్‌ దాడి చేస్తుండగా… భద్రతా దళాలు ప్రతిఘటిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. అత్యాధునిక సాంకేతికతతో డ్రోన్లను గాల్లో ధ్వంసం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు అందలేదు. ‘జమ్మూ పూర్తిగా అంధకారమైంది. అంతటా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో పాకిస్థాన్‌ దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టగలదు’ అని జమ్మూకశ్మీర్‌ డీజీపీ శేష్‌పాల్‌ వైద్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘జమ్మూలోని మా ఇళ్ల మీదకు క్షిపణులు దూసుకొస్తున్నాయి. పౌరుల జీవితాలకు ముప్పు ఏర్పడిరది. మాకు రక్షణ లేదు. ఇదంతా నిజంగా జరుగుతోంది. జమ్మూ మొత్తం బ్లాకౌట్‌ అయింది’ అంటూ ఓ స్థానికుడు ఎక్స్‌ మాధ్యమంగా ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ భయాందోళనకు గురయ్యాడు.

1,620 పోస్టులు…10 నోటిఫికేషన్లు

0

జిల్లాకోర్టుల ఉద్యోగాల భర్తీకి చర్యలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేర్వేరుగా పది నోటిఫికేషన్‌లు గురువారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ల ద్వారా మొత్తం 1620 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 13 నుండి జూన్‌ 2 వరకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులను జిల్లాలవారీగా భర్తీ చేయనున్నారు. ఏపీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లు దాఖలు చేయవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.800, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సబార్డినేట్‌ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కాగా… జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ విద్యార్హతగా పేర్కొన్నారు. కాపీయిస్ట్‌, టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్‌ తప్పనిసరి. కంప్యూటర్‌ అనుభవం ఉండాలి. వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. జనరల్‌ ఇంగ్లీషు, జనరల్‌ నాలెడ్జిపై పరీక్ష ఉంటుంది. మొత్తం ఖాళీలు: 1620, వీటిలో జూనియర్‌ అసిస్టెంట్‌- 230, ఆఫీస్‌ సబార్డినేట్‌- 651, ప్రాసెస్‌ సర్వర్‌- 164, రికార్డ్‌ అసిస్టెంట్‌- 24, కాపీయిస్ట్‌- 193, ఎగ్జామినర్‌- 32, ఫీల్డ్‌ అసిస్టెంట్‌- 56, టైపిస్ట్‌- 162, స్టెనోగ్రాఫర్‌- 80, డ్రైవర్‌- 28 పోస్టులు ఉన్నాయి.

మద్యం కేసులోకి ఈడీ ఎంట్రీ

0

వివరాలు ఇవ్వాలని సిట్‌ చీఫ్‌కు లేఖ
ధనుంజయ, కృష్ణమోహన్‌, గోవిందప్పకు సుప్రీంలో ఎదురుదెబ్బ
కీలక వ్యక్తుల అరెస్టులపై సిట్‌ బృందం ఆరా

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. రూ.వేలకోట్లు అక్రమ మార్గంలో తరలించారన్న ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్‌ నిరోధకం చట్టం2002 కింద కేసు నమోదు చేస్తామని లేఖలో స్పష్టం చేసింది. పీఎమ్‌ఎల్‌ఏ సెక్షన్‌ కింద కేసు నమోదుకు తమకు డాక్యుమెంట్లు కావాలని సిట్‌ అధిపతి, విజయవాడ సీపీకి ఈడీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, ఇప్పటి వరకు సీజ్‌ చేసిన బ్యాంక్‌ ఖాతాల వివరాలు పంపాలని, మద్యం కుంభకోణంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన 21/2024 ఎఫ్‌ఐఆర్‌కి సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీ కావాలని కోరింది. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది అరెస్టయ్యారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులకు మెమోలు జారీజేయాలని సిట్‌ భావించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని, ఆయన పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్‌ చేసింది. వీరిని కస్టడీలోకి తీసుకుని మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో మరికొన్ని అరెస్ట్‌లు జరిగాయి. పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్‌ అధికారులు వారిని విచారించారు. మద్యం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, ఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టులో ఈ కేసు పెండిరగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారు సుప్రీంలో పిటిషన్‌ వేసి… మధ్యంతర రక్షణ కల్పించాలని కోరగా… గతంలో వేసిన పిటిషన్‌ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్‌ను వేయాలని సుప్రీం తెలియజేస్తూ విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. వీరికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఈ ముగ్గురి కోసం సిట్‌ బృందం ఆరా తీస్తోంది. విజయవాడ, హైదరాబాద్‌లలో తీవ్రంగా గాలిస్తున్నాయి. వారు తమ సెల్‌ఫోన్లను స్విఛాఫ్‌ చేసినట్లు సిట్‌ గుర్తించింది. వారి అరెస్టు అనివార్యమనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ సమయంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ కేసు మరింత తీవ్ర రూపం దాల్చనుంది.

లాహోర్‌ను వీడండి: అమెరికా

ఇస్లామాబాద్‌: లాహోర్‌లో పాక్‌ మోహరించిన హెచ్‌క్యూ 9 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ రాడార్లను భారత్‌ ధ్వంసం చేయడంతో అమెరికా ఒక్కసారిగా అప్రమత్తమైంది. తమ దేశ పౌరులు ఎవరైనా ఉంటే తక్షణమే లాహోర్‌ను విడిచి వెళ్లిపోవాలని అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు పాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నగరంలో పేలుళ్లు, డ్రోన్ల కూల్చివేతలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పేర్కొంది. తమ సిబ్బందిని షెల్టర్‌లోకి తరలించినట్లు వెల్లడిరచింది. బుధవారం రాత్రి పాకిస్థాన్‌ భారత్‌లోని 15 నగరాలు లక్ష్యంగా దాడులు మొదలుపెట్టడంతో భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని సకాలంలో అడ్డుకొన్నాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. నేటి ఉదయం నుంచి పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకొంటుండంతో తీవ్ర గందరగోళం నెలకొంది. యుద్ధ భయంతో పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి 7 శాతం పతనమైంది. దీంతో ట్రేడిరగ్‌ను కొద్దిసేపు ఆపేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400 రంగంలోకి దిగింది. నిన్నరాత్రి పాక్‌ ప్రయోగించిన చాలా ఆయుధాలను ఇది నిర్వీర్యం చేసింది. తాజాగా రావల్పిండిలోని క్రికెట్‌ మైదానంలో కూడా పేలుడు జరిగినట్లు సమాచారం. ఇక్కడ రాత్రికి జరగాల్సిన పాకిస్థాన్‌ లీగ్‌ మ్యాచ్‌ వాయిదా పడిరది. గురువారం మధ్యాహ్నం కరాచీ, గుజ్రాన్‌వాలా, చక్వాల్‌, అట్టోక్‌, కరాచీ, చోర్‌, బహవల్పూర్‌, మినవాలి…తదితర ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కానీ, వీటిపై భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పాకిస్థాన్‌ వెన్నులో వణుకుపుట్టించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ విరుచుకుపడిరది. దీని తర్వాత పాకిస్థాన్‌ భారత్‌లోని 15 నగరాలపై దాడి చేసేందుకు యత్నించింది. దీనిని ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అడ్డుకుని పాక్‌ దాడిని భగ్నం చేసింది. మరోవైపు, కౌంటర్‌ అటాక్‌గా భారత్‌… లాహోర్‌లోని పాకిస్థాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ని సర్వనాశనం చేసింది. గురువారం ఉదయం లాహోర్‌ కంటోన్మెంట్‌కి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయిల్‌ తయారీ హార్పి డ్రోన్స్‌ పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. పాక్‌ ప్రభుత్వంతో పాటు ఆ దేశ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో తెలియక లాహోర్‌, కరాచీ, సియాల్‌కోట్‌ విమానాశ్రయాలు మూసేసింది. మరోవైపు, రాజధాని ఇస్లామాబాద్‌ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే, లాహోర్‌ను వెంటనే విడిచి వెళ్లాలని అమెరికా తన ప్రజలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్‌ దాడులు ఇందుకు కారణమని తెలుస్తోంది. లాహోర్‌ ప్రధాన విమానాశ్రయం సమీపంలోని ప్రజల్ని పాక్‌ అధికారులు ఖాళీ చేయిస్తున్నారనే సమాచారం పాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అందింది. లాహోర్‌లో ఉన్న అమెరికన్లు వెంటనే నగరాన్ని విడిచివెళ్లాలని, సాధ్యం కాకపోతే షెల్టర్‌లో ఉండాలని ఆదేశించింది.

9 ప్రాంతాల్లో భారత్‌ డ్రోన్‌ దాడులు

0

పాక్‌ ఆర్మీ ఆరోపణ
ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. గురువారం ఉదయం పాకిస్థాన్‌లోని లాహోర్‌తో పాటు ఇతర నగరాల్లో పేలుడు శబ్ధాలు వినిపించడంతో ఒక్కసారికి పాక్‌ ప్రజల్లో వణుకు పట్టింది. భారత్‌ మళ్లీ దాడి చేస్తుందా అనే అనుమానాలు పాక్‌ ప్రజలు వ్యక్తపరిచారు. అయితే, తాజాగా పాక్‌ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఈ పేలుళ్లకు భారత్‌ కారణమని ఆరోపించింది. తాము భారత్‌కు చెందిన 12 డ్రోన్లను కూల్చామని పాక్‌ ఆర్మీ చెబుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్‌, రావల్పిండి, గుజ్రాన్‌వాలా, అటాక్‌, బహవల్పూర్‌ వంటి నగరాలపై డ్రోన్‌ దాడులు జరిగాయని ఐఎస్‌పీఆర్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి ఆరోపించారు. డ్రోన్‌ దాడుల తర్వాత పాకిస్థాన్‌ విమానాశ్రయాల అథారిటీ కరాచీ, లాహోర్‌, ఇస్లామాబాద్‌, ఫైసలాబాద్‌, సియాల్‌కోట్‌ ప్రధాన విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసినట్లు పాక్‌ మీడియా వెల్లడిరచింది. విమానయాన అధికారులు ‘నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌’ ద్వారా అన్ని విమానయాన సంస్థలకు దీని గురించి తెలియజేశారు. పాక్‌ మీడియా ప్రకారం లాహోర్‌కు వచ్చే అన్ని విమానాలను కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు, ఇందులో జెడ్డా, దుబాయ్‌, మస్కట్‌, షార్జా, మదీనా నుండి వచ్చే విమానాలు కూడా ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సియాల్‌కోట్‌ విమానాశ్రయాలను ఖాళీ చేయించారు.
కరాచీ జిన్నా విమానాశ్రయం కూడా మూసివేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, గురువారం ఉదయం, లాహోర్‌లోని వాల్టన్‌ రోడ్‌, పరిసర ప్రాంతాల్లో ఒకదాని తర్వాత ఒకటి మూడు పెద్ద పేలుళ్లు వినిపించాయి, దీనితో భయాందోళనలు చెలరేగాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు. మూడు పేలుళ్లు కొన్ని సెకన్లలోనే జరిగాయని, వాటి శబ్దాలు అనేక కిలోమీటర్ల దూరం వినిపించాయని లాహోర్‌ పోలీసులు తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తాం..

కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం : నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మెరుగైన సేవలు అందిస్తామని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీవో హోం లో వారు విలేకరులతో మాట్లాడుతూ తాను టిడిపి హయాంలో ప్రజలకు ఎటువంటి సేవలు చేయలేకపోయారని, నా ఇష్టంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, ఇందుకు సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి కుమార్తె ఉమా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి పట్టణ సాయి వరకు అభివృద్ధి పరిచేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తదుపరి పహల్గామీలో మృతి చెందిన వారికి వారు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేంతవరకు గట్టి చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి మోడీని కోరారు. అనంతరం ఆర్డిటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనువెంటనే చర్యలు చేపట్టి ఆర్డిటి సంస్థను కాపాడాలని వారు కోరారు. ఆర్ డి టి దేశంలోనే ప్రముఖ సేవలు అందించుటలో మంచి గుర్తింపు పొందిందని, వేలాదిమంది పేద ప్రజలకు వివిధ సేవలను అందిస్తోందని వారు గుర్తు చేశారు. అలాంటి ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా తిరిగి సేవలు అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలిపారు. అట్లు కానీ ఎడల కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమాలు, చర్చలు జరుపుతామని తెలిపారు. ఆర్డిటి ప్రజలకు ఆక్సిజన్ లాంటిదని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు మద్దతు ద్వారా పార్టీకి న్యాయం చేసేలా పోరాటాలు సలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, పతి, రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సహాయం

అందించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సహాయం రూపంలో గల చెక్కును పరిటాల శ్రీరామ్ ఆ చెక్కును కుటుంబానికి అందజేశారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని రేగాటిపల్లి పంచాయతీలోని సీతారాం పల్లి గ్రామానికి చెందిన మారుతి జనవరి 11న రోడ్డులో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ మృతి చెందిన మారుతి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సేవలు అందించారని తెలిపారు. ఈ ఐదు లక్షల నగదు సభ్యత నమోదు ద్వారా ఇన్సూరెన్స్ రూపంలో వచ్చిందని తెలిపారు. తదుపరి మృతి చెందిన కుటుంబాన్ని కూడా వారు పలకరించారు. మీ కుటుంబానికి టిడిపి అన్నివేళలా అండదండలుగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అంటే కుటుంబానికి ఒక భరోసా అని తెలిపారు. కేవలం ఒక వంద రూపాయలు కడితే రెండు లక్షల రూపాయల సహాయం అందుతుందని, ఇప్పుడు దానిని ఐదు లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ ఆలోచన నారా లోకేష్ కు రావడం వల్ల అన్ని పార్టీలకు తెలుగుదేశం పార్టీని ఒక ఆదర్శంగా మార్చిన ఘనత నారా లోకేసుకే దక్కిందని వారు తెలిపారు.

వేసవి శిక్షణ శిబిరాలకు ముఖ్య కార్యదర్శి రమ ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 9వ రోజుఉచిత వేసవి శిక్షణ శిబిరాలు గ్రంధాలయ ముఖ్య కార్యదర్శి రమా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణా శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుకు బాట వేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తమకు ఉన్న అనుకూల సమయంలో గ్రంథాలయములో వివిధ రకాల పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం వెన్నెల టీచర్ చే తెలుగు కథలు చెప్పడం ఇంగ్లీష్ గ్రామర్ పిల్లలకు బోధించడం జరిగిందన్నారు. ధ్యాన యోగం కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

ఘనంగా జరిగిన వీరబ్రహ్మం స్వామి ఆరాధన మహోత్సవ వేడుకలు..

భక్తాదులు, పురోహితులు లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎర్రగుంటలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పురములో గల వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన మహోత్సవాలు పురోహితులు లక్ష్మీనారాయణ, భక్తాదులు, ఎల్ సి కె పురం ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితుల లక్ష్మీనారాయణ గణపతి పూజ, నవగ్రహాలు, శివునికి, అభిషేకం, వీర బ్రహ్మం విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలకు వివిధ పూలలతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకలను భక్తాదులు, ప్రజలు సహాయ సహకారాలతో, దాతల సహృదయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తదుపరి వీరబ్రహ్మం చరిత్ర, వారి మహిమలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట,ఎల్సికుపురం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్మవరం రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహణ..ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరంలోని రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మాక్ డ్రిల్ లో ఆర్డీవో మహేష్, తాసిల్దార్ నటరాజ్, రైల్వే స్టేషన్ మాస్టర్ నరసానాయుడు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, రెవెన్యూ, జి ఆర్ పి, ఆర్పిఎఫ్ నిర్వహించారు. వీరందరూ కూడా అవగాహన కొరకు మాకు డ్రిల్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఒకవేళ పాకిస్తాన్ మన దేశంపై ప్రతి దాడి చేస్తే ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రమాదాలు జరిగితే ఎలా రక్షించుకోవాలి, ప్రమాదాల బారిన పడితే వైద్యులు చేసే ప్రధమ చికిత్సలు తదితర వాటిని ఈ డ్రిల్స్లో వివరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూరాలు పార్టీ శాని పై మనవాళ్లు యుద్ధం చేసి కొందరు ఉగ్రవాదులు కూడా హతమార్చడం జరిగిందని వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతోందని, ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి రాజు జి ఆర్ పి సి ఐ అశోక్ కుమార్, వీఆర్ఏ రవి శేఖర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.