రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నర్సింహులు
విశాలాంధ్ర ధర్మవరం ; కన్ను అనేది మానవునికి అతి ముఖ్యమైన శరీరంలో ఒక భాగం అని, కానీ ఆ భాగము ద్వారానే శరీరంలోని వివిధ రోగాలను తెలుసుకొని అవకాశం నిండుగా ఉన్నాయని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు అనంతపురంలోని మెడికల్ కాలేజీలో గల ఐఎంఏ హాల్లో గల”కన్ను అనే కిటికీ ద్వారా జబ్బుల పై జరిగిన అవగాహన సదస్సుకు”ముఖ్యఅతిథిగా డాక్టర్ నరసింహుల తో పాటు ఐఎంఏ ప్రత్యేక వైద్య నిపుణులు విచ్చేశారు. ఈ అవగాహన సదస్సులో వివిధ విభాగాల మెడికల్ వైద్యాధికారులు, ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొన్నారు. వివిధ నిష్ణాతులైన వైద్యులు పలు విషయాలతో పాటు వివిధ రోగాలు, వాటిని నివృత్తి చేసుకునే విషయాలను తెలియజేశారు. తదుపరి డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ రక్తనాళాలు కంటి ద్వారా మాత్రమే చూసే అవకాశం ఉందని, కంటి ద్వారా షుగరు, బీపీతోపాటు వివిధ రోగాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శరీరంలోని వివిధ భాగాలలో గల రోగాలను కూడా కంటి ద్వారా చూసే అవకాశం మాకు మాత్రమే ఉందని తెలిపారు. కంటి సమస్యలపై సమన్వయంతో పలు విషయాలను కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. మెదడులో జరిగే పరిణామాలు కంటి ద్వారానే ప్రస్ఫుటం అవుతాయని తెలిపారు. కిడ్నీలు లోని రక్తనాళాలు, కన్ను లోని రక్తనాళాలు ఒకే విధంగా ఉంటాయని వారు తెలిపారు. అంతేకాకుండా కంటికి సంబంధించినటువంటి వివిధ రోగాలు, వాటి నివృత్తిని చేసే పలు అంశాలను స్లైడ్ ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ అక్బర్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అనంతపురం లక్ష్మణ ప్రసాద్, అధ్యక్షులు శ్రీనాథ్ చేతులు మీదుగా డాక్టర్ నర్సింహులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైద్య నిపుణులతో పాటు, వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కంటి ద్వారానే వివిధ రోగాలు తెలుసుకొనే అవకాశం మెండుగా ఉన్నాయి..
అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.. సిపిఐ, సిపిఎం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం; పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ర్ గురించి అనుచిత వాక్యాలు చేసిన హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని,దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వామపక్షాల డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు ధర్మవరంలోనీ స్థానిక కళాజ్యోతి సర్కిల్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగినది. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ను అవమానించడం జరిగినదని, భారతదేశ ప్రజల హక్కులను విధి విధానాలను. బడుగు బలహీన వర్గ ప్రజల హక్కులను,కార్మిక హక్కులను కించపరిచే విధంగా ఉందని దుయ్యబట్టారు. భారతదేశ సౌభ్రాతృత్వాన్ని, లౌకిక తత్వాన్ని, ప్రజల సమాన తత్వాన్ని, ప్రజల అన్ని రకాలుగా స్వేచ్ఛస్వాతంత్రాలతో. వాక్ స్వాతంత్రాలతో జీవించడానికి అవసరమైన అన్నిటిని రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించి, భారత దేశ ప్రజలందరూ బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడానికి అవసరం ఉన్న అన్ని విధివిధానాలను రూపొందించి, భారతరాజ్యాంగాన్ని. నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి దేశ ప్రజలందరూ ఆయన యొక్క శ్రమను ఔన్నత్యాన్ని గుర్తించి భారత దేశ ప్రజలు స్మరించుకుంటున్న నారని తెలిపారు. ఓర్వలేని భారత దేశ హోం మంత్రి ఆయనను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉన్నదని, రాజ్యాంగాన్ని సైతం మార్పులు చేయడానికి అనేక రకాల కుట్రలు అవకాశాలు చూస్తున్నారని వారు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత దేశ ప్రజలందరికీ ఉన్నదని, ఎంతో మహోన్నతంగా ఉన్న రాజ్యాంగం పట్ల దాడులు చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హోం మంత్రి వెంటనే రాజీనామా చేసి, భారతదేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, దేశ ప్రధాని సైతం హోంమంత్రికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జే వి రమణ, అయూబ్ ఖాన్, బాషా,సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవి కుమార్, సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్ష,కార్యదర్శులు పోల లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, వెంకటస్వామి, రైతు సంఘం కార్యదర్శి మారుతి, కదిరప్ప, సిఐటియు నాయకులు ఆదినారాయణ,సిపిఐ నాయకులు శ్రీధర్,గంగాధర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగార్జున,యువజన-ఏఐవైఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు సకల రాజా, నాయకులు ఆదినారాయణ,శ్రీనివాసులు,నారాయణస్వామి , తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో క్లస్టర్ లెవెల్ స్పోర్ట్స్ మీట్
క్రీడల ద్వారానే మానసిక ఆరోగ్యం… ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:;భారత ప్రభుత్వం,యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ,నెహ్రూ యువ కేంద్రం అనుబంధ సంస్థ అయిన సోషల్ సోల్జర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్మవరం ఆర్ డి టి గ్రౌండ్ నందు యువత కు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది అని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు గారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత కే. జయ మారుతి , యువ నాయకులు ముక్తం మనిదీప్, పి.ఈ.టీ
రాజేష్ , లెక్చరర్ హరి బాబూ కొచ్ జి. పృథ్వి రాజ్ , సి.వీరప్ప హాజరై పలు విషయాలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ యువత మానసిక, శారీరక ఆరోగ్యం గా ఉండాలి అంటే క్రీడల ద్వారానే సాధ్యం అని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తినీ కలిగి ఉండాలి అని తెలిపారు. అలాగే ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశం అయినప్పటికి క్రీడలలో మాత్రం చాల వెనుక బడి ఉంది అని , కావున ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గెలుపొందిన యువతకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రోపీ, మెడల్స్ , ప్రశంసా పత్రాలు అందించారు.
ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా శెట్టిపి జయచంద్రా రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ (అనంతపురం, సత్య సాయి జిల్లాలు కలిసి ఉన్న అసోసియేషన్) ధర్మవరం ప్రాంతమునకు సముచిత స్థానం లభించింది. ఆదివారం సాయంత్రం అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రా రెడ్డిని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ధర్మవరం పట్టణం నుండి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ బాస్కెట్బాల్ రాష్ట్ర జట్టుకు వరుసగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ధర్మవరం పట్టణంలో బాస్కెట్బాల్ క్రీడాభివృద్ధికి 22 సంవత్సరాల నుండి ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులతో, సభ్యులు తో కలిసి బాల, బాలికలను జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో తీర్చిదిద్దడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నిరంతరం కృషిచేస్తున్న శెట్టిపి జయచంద్రా రెడ్డి ని ఆదివారం రోజున ఉమ్మడి జిల్లా అసోసియేట్ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, యుటిఎఫ్ నాయకులు, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకం పట్ల జయచంద్రా రెడ్డి ఉమ్మడి జిల్లా అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. బాస్కెట్బాలును జాతీయ రాష్ట్రస్థాయిలో మరింత అభివృద్ధి పరిచేందుకు నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
నాట్యచారిని రామ లాలిత్యకు ఘన సన్మానం
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ కుమార్తె లాలిత్య ఏపీలోని కృష్ణాజిల్లాలో కూచిపూడి గ్రామములో జరిగిన కూచిపూడి పతాక సర్నోస్తవాల సందర్భంగా రామ లాలిత్య తోపాటు గురువు బాబు బాలాజీని కూడా ఘనంగా సన్మానించి,ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను అందజేయడం జరిగిందని గురువు బాబు బాలాజీ తెలిపారు. ఈ స్వర్ణోత్సవాల నాట్య సభలో 2000 మంది కూచిపూడి కళాకారులతో జరిగిన మహా బృందనాట్యములో రామ లాలీత్య పాల్గొనడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ వారి ద్వారా ఇటువంటి అవకాశం కలిగినందుకు రామ లాలిత్యతోపాటు బాబు బాలాజీ కూడా తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమం వేదాంతం వెంకట చలపతి ఆధ్వర్యంలో మంత్రులు కొల్లు రవీంద్ర డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఎమ్మెల్యే కుమార్ పాల్గొనడం జరిగిందని, వీరందరి ద్వారా కూడా రామ లాలీత్య ప్రశంశాలు పొందడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు నింపాలి: లోకేశ్
నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు తీసుకురావాలని ఏపీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. విధ్వంస, నియంతృత్వ పాలనను ప్రజలు గతేడాది తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకు వస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి: జగన్
ఏపీ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025లో ప్రతి ఇంట సుఖ శాంతులు వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అన్నారు. అందరికీ దైవానుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.
గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు
గోడౌన్‌లో బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని భార్య జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ నిమిత్తం ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఆర్ పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని తెలియజేశారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మంగళవారం రాత్రి పేర్ని నాని ఇంటికి వెళ్లారు. నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపుకి నోటీసులు అతికించి వెళ్లిపోయారు.జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్‌లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ ఏ-1గా ఉన్నారు. అయితే, ఈ కేసులో జయసుధకు కోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. పోలీసు విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్‌లో రేవంత్ బృందం పర్యటించనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్దిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 23 వరకూ సీఎం రేవంత్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఆ సదస్సులో పాల్గొననున్నారు. 2024లో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు రూ.40వేల కోట్లకుపైగానే పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది. అవి కార్యరూపం దాల్చి వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపారు. ప్రస్తుత దావోస్ పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం బృందం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13నే పర్యటనకు ఏర్పాట్లు చేయాలని భావించినా, సంక్రాంతి పండుగ తర్వాత 15న బయలుదేరే ఆలోచన చేస్తున్నారని సమాచారం. సీఎం రేవంత్ ఆస్ట్రేలియా పర్యటనలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాల, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని వీరు పరిశీలిస్తారు. ఆస్ట్రేలియాలో మూడు నాలుగు రోజుల పాటు పర్యటించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బృందం జనవరి 19న సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ రెండు రోజుల పాటు షాపింగ్ మాల్స్‌పై క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను పరిశీలిస్తారు. సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తల సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారు. అనంతరం దావోస్‌కు చేరుకుని ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు.
మైనర్‌పై అత్యాచారం.. కేరళ టీచర్‌కు 111 సంవత్సరాల జైలుశిక్ష!
ఐదేళ్ల క్రితం ప్లస్ వన్ (11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన కేరళ ఉపాధ్యాయుడికి తిరువనంతపురం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 111 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, రూ. 1.05 లక్షల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది. నిందితుడు మనోజ్ (44) 2019 జులై 2న బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిపై కరుణ చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి ఆర్ రేఖ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. స్పెషల్ క్లాస్ పేరుతో బాలికను ఇంటికి రప్పించి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ దారుణాన్ని మొబైల్‌లో చిత్రీకరించాడు. తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెలువరిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.