Saturday, January 11, 2025
Home Blog Page 22

సర్వీస్ ప్రొవైడర్స్ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు చేసుకోండి..

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ.. ధర్మవరం పురపాలక సంఘం నందు సర్వీస్ ప్రొవైడర్స్ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వివిధ రకములైన సర్వీస్ ప్రొవైడర్స్ అనగా కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, గ్లిజర్, టీవీ, ఏసీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్ రిపేరు చేసేవారు, బ్యూటీషియన్ (మగ, మహిళలు) మొదలగు సేవలు అందించే వారి నుండి దరఖాస్తు సేకరణతో పాటు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించి ఎన్ఎస్డిసి ద్వారా సర్టిఫికెట్స్ తో పాటు అర్హత పొందిన వారికి హోమ్ ట్రయలింగ్ ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా వీరిని ఆన్ బోర్డ్ చేసి జీవనోపాధి కల్పించబడునని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 5వ తేదీ లోపు మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగం నందు నమోదు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ మేళా కూడా నిర్వహించబడునని తెలిపారు. కావున అర్హత గల అభ్యర్థులందరూ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, విద్యార్హత సర్టిఫికెట్, పాస్వర్డ్ ఫోటోలు 2 తో కలిసి అన్ని జిరాక్స్లు వెంట తీసుకొని రావాలని తెలిపారు.

దేవాలయానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన దాశెట్టి కుటుంబీకులు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవపురంలోని శ్రీ వైద్య నారాయణ ధన్వంతరి, త్యాగరాజ స్వామి దేవాలయ నిర్మాణం కొరకు కీర్తిశేషులు దాశెట్టి ఓబులమ్మ జ్ఞాపకార్థం, వారి భర్త దాసెట్టి నారాయణస్వామి, వారి కుమారులు దాసెట్టి సుబ్రమణ్యం, దాశెట్టి నాగరాజు, దాశెట్టి శ్రీనివాసులు కలసి ఒక లక్ష రూపాయలను విరాళంగా కమిటీ వారికి అందజేశారు. అనంతరం కమిటీ వారు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

ఘనంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 55వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రభుత్వ బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్ నందు జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ హెచ్ భాష ముఖ్యఅతిథిగా విచ్చేసి ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1970లో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో స్వాతంత్రం,ప్రజాస్వామ్యం,సోషలిజం నినాదంతో అధ్యయనం పోరాటం అంటూ యావత్తు విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనేక ఉద్యమాలు చేపడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడింది అని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థుల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఎస్ఎఫ్ఐ అగ్రస్థానంలో ముందుంటు నిరంతరం విద్యార్థులను చైతన్య పరుస్తూ శాస్త్రీయ దృక్పథంతో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కనుమ దామోదర్, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు

శబరిమలకు ధర్మవరం అయ్యప్ప భక్తులు సైకిల్ యాత్ర..

విశాలాంధ్ర- ధర్మవరం;: పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల అయ్యప్ప స్వామి భజన మందిరం గురుస్వామి విజయ్ కుమార్ శిష్యులు ధర్మారం నుండి శబరిమలకు సైకిల్ యాత్ర తో బయలుదేరారు. ఈ సందర్భంగా గురుస్వామి అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి శిష్య బృందానికి ఆశీస్సులను అందజేసి పంపడం జరిగింది. తొలుత సైకిళ్లకు పూజలు నిర్వహించారు. అనంతరం గురుస్వామి మాట్లాడుతూ ధర్మారం నుండి శబరిమల ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా ఉంటుందని ఇది మూడవసారి సైకిల్ యాత్ర చేస్తున్నారని, 18 మంది అయ్యప్ప మాల ధారణ భక్తాదులు బయలుదేరి వెళ్లడం జరిగిందని తెలిపారు. హిందూ సాంప్రదాయాలను మరింత విస్తరింప చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. వారం రోజుల లోపు శబరిమల చేరుకుంటారని తెలిపారు. శబరిమల యాత్ర చేసే అయ్యప్ప స్వాములు లోకేష్, మణికంఠ, ఓంకార్, ఓబులేసు, జగదీష్, తేజ, సుంకర చిన్న ,మహేష్ రెడ్డి, కుమార్, బాలు, నాగేంద్ర ,కళ్యాణ్, తేజ, వంశీ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. తదుపరి కుటుంబ సభ్యులు, మిత్రులు, తోటి అయ్యప్ప మాల ధారణ భక్తాదులు శుభాకాంక్షలు తెలియజేశారు.

4న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు సన్మానం కార్యక్రమం

ధర్మవరం పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక నిర్వాహకురాలు సంకారపు జయశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:; చేనేత కుల బాంధవుడు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సన్మాన కార్యక్రమం జనవరి 4వ తేదీ శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నిర్వహిస్తున్నట్లు ధర్మవరం పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక నిర్వాహకురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వాటికి సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని తొగట వీర క్షత్రియ కళ్యాణ మండపంలో సభ్యులతో కలిసి విడుదల చేశారు. అనంతరం జయశ్రీ మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమం పట్టణంలోని శివానగర్ శివాలయము ప్రాంగణమునందు ఖాళీ ప్రదేశం నందు జరుగునని తెలిపారు. చేనేత కుల బాంధవుడు బిసి వర్గానికి చెందినటువంటి కందికుంట వెంకటప్రసాదను సన్మానించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఏపీలో ఉన్నటువంటి 18 చేనేత కులాల వారికి ఒక పండుగ దినము అని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం ప్రథమ పౌరురాలు అయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కాచర్లలక్ష్మి, ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ ను రాజకీయాలకు అతీతంగా ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మన చేనేత కులాలను గౌరవించుకున్న వాళ్ళము అవుతామని తెలిపారు. ధర్మవరం పట్టణంలో దాదాపు 80 వేలకు పైగా ఉన్నటువంటి చేనేత కులాల వారు ప్రతి ఒక్కరు ఈ సన్మాన కార్యక్రమంలో హాజరై కుటుంబ సమేతంగా రావాలని తెలిపారు. అదేవిధంగా తోగాటవీర క్షత్రియ, పద్మశాలి, పట్టు శాలి, దేవాంగం, స్వకుల సాలె, కుర్ని, కత్రి చేనేత కుల బాంధవులు కూడా వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సభలో చేనేతల సమస్యలు గూర్చి చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిర్రాజు రవి, గుద్దిటి రాము , బీరేగోపాల్, కొండా పుల్లయ్య, టీచర్ ప్రకాష్, పరిసే సుధాకర్, చింతా నాగరాజు, దాసరి రంగయ్య, హేమంత్, పామిశెట్టి శివశంకర్, బీరే కేశవ నీలూరి శ్రీనివాసులు ,గడ్డం శ్రీనివాసులు, గడ్డం పార్థ ,కోనేటి వెంకటేష్, పొట్టి ప్రసాద్, ఉక్కిసలగోవిందు, ఉక్కిసెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సరాన్ని మద్యంతో ప్రారంభించవద్దు..

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ సాకే భాస్కర్ పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం ; 2025 నూతన సంవత్సరాన్ని మధ్యముతో ప్రారంభించవద్దని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ సాకే భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూర్య హై స్కూల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరములు సరదాగా ప్రారంభించిన దురాలవాట్ల ప్రభావం చాలా కాలం ఉంటుందని, కావున వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం తెలిపిన మేరకు పాఠశాలల్లో కళాశాలలో గంజాయి, మాదకద్రవ్యాలు అమ్ముతున్నారని మీరు వాటి జోలికి వెళ్ళకూడదని వారు తెలిపారు. పిల్లల్లో నైతిక విలువలను పెంచడానికి ప్రవచన కారులను సలహాదారులుగా కూడా పెట్టుకుంటున్నారని తెలిపారు. తదుపరి జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హరి మాట్లాడుతూ అక్టోబర్ 16న 3,300 మద్యం దుకాణాలను పర్మిషన్ ఇస్తే డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో 4, 677 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయన్నరు. ఒకప్పుడు నెల్లూరులో ప్రారంభమైన సారా వ్యతిరేక పోరాట వెనుక జన విజ్ఞాన వేదిక ఉంది అని వారు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వాలు కుట్ర మూలంగా అది నిర్వీర్యం అయిపోయిందని బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాదకద్రవ్యాలని వాడకూడదు అంటుందే గానీ మద్యం కూడా అదే కోవలికి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవడం దురదృష్టకరమని తెలిపారు. మధ్యము మాదకద్రవ్యాలకు అలవాటు పడకూడదని తెలిపారు. మన కుటుంబంలో ఒకరో ఇద్దరో తాగే వారు ఉంటే, పిల్లల చదువు, ఆహారం పిల్లలలో ఉండే నిరాశ, నిర్లి ప్రతా ఇవన్నీ పరిశీలించాలన్నారు. మద్యం అలవాటు కావడం వలన హత్యలు, గొడవలు, ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ విక్రాంత్, డాక్టర్ సుధాకర్ రావు, జెవివి నాయకుడు బాలగంగాధర నాయక్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ బాబు, లక్ష్మీనారాయణ రెడ్డి ,లోకేష్, నరేంద్రబాబు, సురేష్ ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

చదువుతోపాటు కరాటే విద్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది..

కరాటే మాస్టర్ ఇనాయత్ భాష
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులందరూ కూడా చదువుతోపాటు కరాటే విద్య కూడా నేర్చుకొని మంచి జీవితాన్ని గడపాలని కరాటే మాస్టర్ ఇనాయత్ భాష తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేట పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంగల్య సిల్క్స్ జింక పురుషోత్తము, సీనియర్ బ్లాక్ కలర్స్ హశ్విక, అబూబకర్ పాల్గొన్నారు. అనంతరం వీరి చేతులు మీదుగా కరాటే విద్యార్థులకు బెల్టు, ఎల్లో, ఆరెంజ్,గ్రీన్,బ్లూ పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆత్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు కరాటే కూడా నేర్పించాలని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

రైలు ప్రయాణికులకు భోజనపు ప్యాకెట్లు పంపిణీ…

శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పాడేరు నుంచి పుట్టపర్తికి వస్తున్న 210 మంది సేవాదళ్ మందికి ధర్మవరం రైల్వే స్టేషన్లో శ్రీ సత్య సాయి సేవా సమితి గాంధీనగర్ కన్వీనర్ నామ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజనపు ప్యాకెట్లతోపాటు వాటర్ ప్యాకెట్లను కూడా వారు పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాదాతగా శేషాచారి నిర్వహణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తి బాబా ఆశీస్సులతో పుట్టపర్తికి వెళ్లే భక్తాదులకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. అనంతరం స్టేషన్ మాస్టర్ నరసింహా నాయుడు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు అనన్యమైనవని, అందరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని మానవతా విలువలను పెంచాలని తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడంలో లేదా సేవా కార్యక్రమాన్ని అందించడంలో ఉన్న తృప్తి మరెక్కడ లభించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదిమంది సమితి సభ్యులు పాల్గొన్నారు.

పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు

పేర్ని నాని భార్య జయసుధ పేరిట గోడౌన్
గోడౌన్ నుంచి బియ్యం మాయం అయినట్టు గుర్తింపు
పెరిగిన షార్టేజికి అదనంగా రూ.1.67 కోట్లు చెల్లించాలని తాజా నోటీసులు

గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధాంగి జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. మొత్తమ్మీద గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు తేల్చారు. ఈ క్రమంలో, పెరిగిన షార్టేజికి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అగ్ని ప్రమాద కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ చేయూత

విశాలాంధ్ర- సంతకవిటి/రాజాం (విజయనగరం జిల్లా ): సోమవారం ఉదయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం,శ్రీకాకుళం జిల్లా శాఖ వారు సిరిపురం గ్రామం, సంతకవిటి మండలం నందు అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయ సామగ్రి అయిన కిచెన్ సెట్లు, టారపలిన్ షీట్స్, దోమతెరలు, చీరలు, తువ్వాలు, ఉన్ని దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని పి జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్, ద్వారా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంతకవిటి మండలం తాసిల్దార్ సత్యం, కొల్ల అప్పలనాయుడు, గట్టి భాను, విజయనగరం రెడ్ క్రాస్ ప్రతినిధులైన కొత్త సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్య కుమార్, గోవిందరాజులు, సత్య రామ్, సుధాకర్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.