Wednesday, May 14, 2025
Home Blog Page 291

ఘనంగా ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్స్ డే

అధ్యక్షులు చలపతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవం (పెన్షనర్స్ డే) అధ్యక్షులు చలపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్న రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏటిఓ పద్మనాభం, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ సందీప్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు శంకరనారాయణ, ఐ సి ఐ సి ఐ బ్యాంక్ మేనేజర్ నిగోల్, కొత్తపేట ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ సువర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ పదవి విరమణ తర్వాత మంచి ప్రశాంతతతో, మనశ్శాంతితో జీవించినప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. పెన్షన్ల యొక్క సమస్యలను పరిష్కరించుటలో ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అన్ని సాధ్యపడుతాయని తెలిపారు. పెన్షనర్ల సమస్యలపై ప్రతినెల నిర్వహించే సమావేశంలో అందరూ తప్పక హాజరై, చర్చించాలని తెలిపారు. బ్యాంకు ద్వారా అవసరమయ్యే సేవలను తప్పక అందిస్తామని తెలిపారు. పెన్షన్ దారులకు ట్రెజరీ కార్యాలయంలో కావలసిన సహాయ సహకారాలను తప్పక అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏమాత్రం పొరపాటు జరిగిన ధన నష్టం జరుగుతుందని తెలిపారు. మీ బ్యాంకు ఖాతా నెంబర్ కానీ, పాస్వర్డ్ గానీ, ఏటీఎం వివరాలు గానీ తెలపరాదని తెలిపారు. అనంతరం పదిమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులైన పోతిరెడ్డి, గోవిందరెడ్డి, సరోజినీ, సదాశివరెడ్డి, కంబగిరి ,శివయ్య, నాగరాజు, శ్రీనివాసులు, యజ్జన్న, రామిరెడ్డి లను విశ్రాంతి ఉద్యోగుల సంఘం వారు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి నర్సిరెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చెన్నప్ప, కోశాధికారి సుధాకర్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు.

టిడిపి సభ్యత్వ నమోదులో 3వ డివిజన్ రికార్డు….

0

తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…

విశాలాంధ్ర ఏలూరు:టిడిపి సభ్యత్వ నమోదులో 3వ డివిజన్ 2061 సభ్యత్వాలు నమోదు చేసి అన్ని డివిజన్ ల కంటే అగ్ర భాగాన ఉండి సరికొత్త రికార్డు సృష్టించిందని తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ తెలిపారు.బుధవారం స్థానిక మూడవ డివిజన్ లో సభ్యత్వ నమోదులో బాలాజీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నెలలో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటికీ 2061 సభ్యత్వాలు నమోదు చేసి నగరంలోనే ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు.ఈ సభ్యత్వ నమోదుతో స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నేతృత్వంలో బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని తెలిపారు.డివిజన్లో ప్రతి నలుగురులో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి తీసుకు వస్తామన్నారు. టిడిపి కార్యకర్తలకు సంక్షేమం అందించడంతోపాటు రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగేందుకు పూర్తిస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ఆర్థికంగా పేదలు నిలదొక్కుకునే విధంగా కృషి చేస్తామని ప్రకటించారు. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెరిగే విధంగా బడేటి చంటి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.దీనికోసం డివిజన్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు.ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కోఆప్షన్స్ సభ్యురాలు జాలా సుమతి బాలాజీ,బొట్టేటి మహేష్ లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 3వ డివిజన్ అధ్యక్షులు చనపతి వెంకటరమణ,ఇంకుల రూపేష్, జాలా శివశంకర్, గాలి త్రిమూర్తులు, వీరబత్తిన వనిత, మర్రి ఏసు,షేక్ రిజ్వానా, సుల్తానా బేగం, పొందూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

0

రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్‌లో 6.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పటాన్‌చెరులో 7డిగ్రీలు, మెదక్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 11.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శీతలగాలుల నేపథ్యంలో ఇప్పటికే ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

జమిలి బిల్లును కాంగ్రెస్ సమర్థించదు: షర్మిల

జమిలి ఎన్నికల బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి… బీజేపీ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం… బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని షర్మిల అన్నారు. అసెంబ్లీల గడువును లోక్ సభతో ముడిపెట్టడం సమంజసం కాదని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న జమిలి బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని షర్మిల అన్నారు. రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండొంతుల మోజార్టీ బీజేపీకి లేదనే విషయం లోక్ సభలో ఓటింగ్ తో తేలిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూలిపోతే… రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కూలిపోవాలని… ఇందులో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. లోక్ సభలో ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని చెప్పారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే జమిలి బిల్లును కాంగ్రెస్ సమర్థించదని స్పష్టం చేశారు.

జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌లో రూ.4వేల కోట్లు దుర్వినియోగం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం ₹4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్లో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జల్ జీవన్ మిషన్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్ర‌ధాని మోదీ క‌ల అదే..తాగు నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని.. ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని చెప్పారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయిందని పవన్ అన్నారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ₹70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.

విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి ఈ ఏడాది రూ.22 వేల కోట్లు రాబట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి రూ.14 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు వివరించారు. అదేవిధంగా గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి, బ్యాంకు రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులు అమ్మి వెయ్యి కోట్లు వసూలు చేశామన్నారు.మిగతా ఎగవేతదారుల నుంచి ఏడు వేల కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ.22,280 కోట్లు వివిధ బ్యాంకులకు జమ చేశామని చెప్పారు. ఇందుకోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని తెలిపారు. ఎగవేతదారులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను స్పెషల్ కోర్టు ఆదేశాలతో బ్యాంకులు, ఈడీ అధికారులు విక్రయించారని వివరించారు.

మరో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, ఈ ఆస్తులను కూడా వేలం వేసేందుకు స్పెషల్ కోర్టు అనుమతిచ్చిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న సుమారు 13 వేల కోట్లకు పైగా రుణాలను చోక్సీ చెల్లించలేదని తెలిపారు. దీంతో ఈడీ జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర రుణదాతలకు చెల్లించాలని ముంబై స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పీఎంఎల్ఏ చట్టం ఆధారంగా రుణాల ఎగవేతదారుల నుంచి సొమ్ము రాబడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

భారత్ కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ మొత్తంలో పన్నులు విధిస్తున్నారని ఆరోపిస్తూ తాము కూడా అంతే మొత్తంలో పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. భారత్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు అమెరికా వస్తువులపై 100 శాతం, 200 శాతం పన్నులు విధిస్తున్నాయని చెప్పారు. దిగుమతి చేసుకునే వస్తువులపై ఎంత శాతం పన్ను విధించాలనేది ఆయా దేశాల ఇష్టమని ట్రంప్ చెప్పారు. అయితే, అమెరికాకూ ఆ హక్కు ఉంటుందని గుర్తుచేశారు. తమ వస్తువులపై భారీగా టాక్స్ విధిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. అంతేమొత్తంలో ఆయా దేశాల వస్తువులపై పన్నులు వసూలు చేస్తామని వివరించారు. ఇతర దేశాలు అమెరికాను ఎలా ట్రీట్ చేస్తాయో అదేవిధంగా అమెరికా ఆయా దేశాలను ట్రీట్ చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ సంఘీభావం.. ఖాకీ డ్రెస్ లో ఆటోలో అసెంబ్లీకి రాక

ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆటోలను స్వయంగా కేటీఆర్, గంగుల కమలాకర్, బండారి లక్ష్మా రెడ్డి లు డ్రైవింగ్ చేసారు.ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా, ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీఆర్ఎస్‌ పక్షాన వారికోసం పోరాడతామని స్పష్టం చేశారు.

ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది.కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏటా 12వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది.

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి ఆరోగ్యంలో సమస్యలు కనిపించడంతో స్థానికంగా ఆందోళన మొదలైంది. ఈ సమాచారం బయటకు రావడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందుగా నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడికి చికిత్స అందించారు. అయితే, వ్యాధి నిర్ధారణ కాలేకపోవడంతో అతడిని చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ, పూర్తి నిర్ధారణ కోసం బాలుడి రక్త నమూనాలను పుణేలోని ప్రముఖ ల్యాబ్కు పంపించారు. నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. జికా వైరస్ లక్షణాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలుగా వెంకటాపురం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైరస్ గురించి అవగాహన కల్పించి, అవసరమైన మందులు, చికిత్సలు అందిస్తున్నారు. జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రాధాన్యతతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

క్రూ-10 ప్రయోగం ఆలస్యం.. మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత

వారం రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లి సాంకేతిక కారణాలతో అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆమె ఐఎస్ఎస్‌లోనే గడపక తప్పేలా కనిపించడం లేదు.ఎనిమిది రోజుల ప్రయోగాల కోసం బచ్ విల్‌మోర్‌తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్యుల్‌లో ఈ ఏడాది జూన్ 6న సునీత ఐఎస్ఎస్‌కు వెళ్లారు. 14వ తేదీనే వీరు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీ కారణంగా వారిని అక్కడే వదిలేసి వ్యోమనౌక ఒంటరిగా తిరిగి వచ్చింది. దీంతో అప్పటి నుంచి వారు అక్కడే చిక్కుకుపోయారు. వారిని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు ఇటీవల స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్‌ను నాసా ప్రయోగించింది. ఇందులో నాలుగు సీట్లు ఉండగా హాగ్, గోర్బునోవ్ అనే వ్యోమగాములను పంపించి మిగతా రెండు సీట్లను సునీత, విల్‌మోర్‌ కోసం ఖాళీగా వదిలిపెట్టారు. సెప్టెంబరులో ఐఎస్ఎస్‌తో అనుసంధానమైన ఈ మిషన్ ఫిబ్రవరిలో తిరిగి రావాల్సి ఉంది. అయితే, క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి అప్పటి వరకు సునీత, విల్‌మోర్ ఇద్దరికీ నిరీక్షణ తప్పనట్టే.