Wednesday, May 14, 2025
Home Blog Page 292

టిడిపి సభ్యత్వం ప్రతి కుటుంబానికి అండతో కూడిన భరోసా

సహజ మరణానికి 10,000
ప్రమాదం జరిగితే 2 లక్షలు
ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు

విశాలాంధ్ర -తనకల్లు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు మండలంలో జోరుగా కొనసాగుతోంది సభ్యత్వం వల్ల కలిగే లాభాల గురించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెదురుశేఖర్ రెడ్డి పగడాల వెంకటప్ప దేశాయ్ హరినాథ్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నాగేంద్రప్రసాద్ టిడిపి జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ తదితరులురెడ్డివారి పల్లి, రెడ్డివారిపల్లి తండాలలో సభ్యత నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. సభ్యత్వం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ టిడిపి సభ్యత్వం తీసుకోవాలని ఆ సభ్యత్వం మన కుటుంబాలకు భరోసాగా నిలుస్తోందని ముందుకొస్తున్నారు. రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని కుటుంబాలకు భరోసాగా నిలవాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ చేపట్టిన కార్యక్రమాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ఆలోచించి కందికుంటకురాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పేద బీద బడుగు బలహీనవర్గాలు ముఖ్యంగా వాహనాలు నడిపేవారు సభ్యత్వం తీసుకోవాల్సిన పరిస్థితులపై ఆలోచించుకోవాలన్నారు. మండలంలోని 17 గ్రామపంచాయతీలలో బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు మాజీ సర్పంచులు మాజీ జెడ్పిటిసిలు వార్డు మెంబర్లతో సహా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు నాయకులు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు లో పాల్గొని ప్రజలకు మంచి చేయాలన్నారు మూడు రవీంద్ర నాయక్ భాస్కర్ నాయక్ కుంచె మునియప్ప వెంకటరమణ సూర్యనారాయణ మూడే శివన్న రాజు నాయక్ శకుంతలమ్మ రాజేశ్వరమ్మ రమణమ్మ శ్రావణి అజయ్ కుమార్ హరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులతో భూ స‌మ‌స్య‌లకు శాశ్వత పరిష్కారం

విశాలాంధ్ర – నెల్లిమర్ల : రెవెన్యూ సదస్సులతో భూ స‌మ‌స్య‌లకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని
మండల నోడల్ అదికారి, గృహ నిర్మాణ శాఖ జిల్లా పి.డి పి. కూర్మినాయుడు అన్నారు. మండలం లోని బొప్పడాం గ్రామంలో మంగళవారం సబ్ రిజిస్ట్రార్‌, దేవాదాయశాఖ, అటవీ శాఖలతో కలిసి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. నోడల్ అధికారి కూర్మినాయుడు మాట్లాడుతూ మీ భూమి- మీ హక్కు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని . ప్రజలు భూ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేడు గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 45 రోజుల పాటు జరిగే రెవెన్యూ స‌ద‌స్సులకు ప్రజలు అర్జీ రూపంలో తమ సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇకనుంచి భూ సమస్యలపై భాదితులు కార్యాలయాల చుట్టూ తిరగడం కాకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ , మ్యుటేషన్, 22ఎ,డీకేటి, రీ సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు.
బాధితులు తమ సమస్యలు అర్జీ రూపంలో తెలియజేసి రసీదు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ అంబళ్ళ కిరణ్ కుమార్, ఎంపిటిసి బొంతు పురుషోత్తంనాయుడు , తహసీల్దార్ బి.సుదర్శనరావు, పంచాయితీ కార్యదర్శి పుష్పలత, ఆర్ ఐ వేణు గోపాల్ రావు, విఆర్ ఓ బి గోవిందారామ్, మండల సర్వేయర్ టి దివ్య మానస, గ్రామ పెద్దలు. బొంతు వెంకటరమణ ,అంబల్ల సత్యనారాయణ, అంబల్ల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

మొబలైజేషన్ లో భాగంగా వార్షిక ఫైరింగ్ నిర్వహించిన ఏ.ఆర్ అధికారులు

విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ పోలీసులకు ఈరోజు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు. ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా పర్యవేక్షణ మరియు ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం మండలం మన్నీల రేంజ్ లో ఏ.ఆర్ పోలీసులకు వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేపట్టారు. మొబలైజేషన్ లో భాగంగా వార్షిక ఫైరింగ్ లో పాల్గొన్న సిబ్బందికి వృత్తి నైపుణ్యం పెంచుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రెడ్డెప్పరెడ్డి, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

పి ఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుందాం

— అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి

విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందామని అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సూర్యఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకం గురించి పోలీసు సిబ్బందికి అవగాహన చేశారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ…ఇది ఎంతో మంచి పథకం అని, దీని ద్వారా రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాఫ్ నిర్మించుకోవాలన్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చన్నారు. అనంతరం … జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సోలార్ రూఫ్ టాప్ కౌంటర్లను అదనపు ఎస్పీలు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయా కంపెనీల వారు డెమో నిర్వహించి పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేష్, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి రవిరాం నాయక్, సి.ఐ లు విశ్వనాథ్ చౌదరి ( ట్రాన్సుకో), హరినాథ్, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, మధు, ఈఈ జెవీ రమేష్, డి.ఈ రామకృష్ణ, ఏ.డి లు శ్రీనివాసులు, చంద్రశేఖర్ జేవి రమేష్, ఎస్పీ సిసి ఆంజనేయప్రసాద్, డిపిఓ సూపరింటెండెంట్లు ప్రసాద్ , సావిత్రమ్మ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు గాండ్ల హరినాథ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అందరి సమక్షంలో ఆయా ఈవీఎం గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, తహసిల్దార్ హరికుమార్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి దేవి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజ్, డిప్యూటీ తహసిల్దార్ దివాకర్ రావు, బిజెపి ప్రతినిధి ఈశ్వర్ ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మసూద్ వలీ, వైఎస్సార్సిపి ప్రతినిధి శ్రీనివాసులు, బీఎస్పీ అంజయ్య, టిడిపి ప్రతినిధి నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

డీసి చైర్మన్ గా ఎన్నికైన రాటకొండ చంద్రశేఖర్…

విశాలాంధ్ర- నందిగామ :- కంచల మేజర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గా నందిగామ శివారు హనుమంతుపాలెం గ్రామానికి చెందిన రాటకొండ చంద్రశేఖర్ ను డబ్ల్యూ పి ఏ అధ్యక్షులు ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు ఇటీవల జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో ఏకపక్షంగా టిసి సభ్యులుగా ఎన్నికైన వారు డబ్ల్యు ఏ అధ్యక్షులను గత శనివారం సాయంత్రం మూడు గంటలకు ఎన్నుకున్నారు ఆ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాసరావు వారికి నియామక పత్రాలను అందజేశారు మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ కే.బాలకృష్ణ. ఎన్నికల పరిశీలకులు వెంకట్,స్థానిక తహసీల్దార్ సురేష్ ల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించగా డబ్ల్యూ ఏ అధ్యక్షులుగా ఎన్నికైన వారు రాటకొండ చంద్రశేఖర్ ను ఏకగ్రీవంగా కంచల మేజర్ 2 డి సీ చైర్మన్ గా ఎన్నుకున్నారు డీసీ చైర్మన్గా ఎన్నికైన రాటకొండ చంద్రశేఖర్ ను పలువురు పూలమాలలు వేసి దుశ్యాలవాల తో సత్కరించారు అనంతరం స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య బీసీ చైర్మన్ గా ఎన్నికైన రాటకొండ చంద్రశేఖర రావు,వైస్ చైర్మన్ తుమ్మల నరసింహారావు తో పాటు డబ్ల్యూ పి ఏ అధ్యక్షులుగా ఎన్నికైన వారిని ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో చిరుమామిళ్ల సుబ్బారావు,శాఖమూరి వంశీధర్,కాసర్ల లక్ష్మీనారాయణ,కత్తురోజు శ్రీనివాసచారి,20వ వార్డ్ కౌన్సిలర్ వెంకటకృష్ణ,రాట కొండ వెంకట్రావు,మంద జాన్ పీడర్,పెద్ద ఎత్తున హనుమంతుపాలెం గ్రామ ప్రజలు మరియు పట్టణానికి చెందిన ప్రముఖులు టిడిపి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు..

డీసి చైర్మన్ గా ఎన్నికైన రాటకొండ చంద్రశేఖర్…

విశాలాంధ్ర నందిగామ :- కంచల మేజర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గా నందిగామ శివారు హనుమంతుపాలెం గ్రామానికి చెందిన రాటకొండ చంద్రశేఖర్ ను డబ్ల్యూ పి ఏ అధ్యక్షులు ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు ఇటీవల జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో ఏకపక్షంగా టిసి సభ్యులుగా ఎన్నికైన వారు డబ్ల్యు ఏ అధ్యక్షులను గత శనివారం సాయంత్రం మూడు గంటలకు ఎన్నుకున్నారు ఆ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాసరావు వారికి నియామక పత్రాలను అందజేశారు మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ కే.బాలకృష్ణ. ఎన్నికల పరిశీలకులు వెంకట్,స్థానిక తహసీల్దార్ సురేష్ ల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించగా డబ్ల్యూ ఏ అధ్యక్షులుగా ఎన్నికైన వారు రాటకొండ చంద్రశేఖర్ ను ఏకగ్రీవంగా కంచల మేజర్ 2 డి సీ చైర్మన్ గా ఎన్నుకున్నారు డీసీ చైర్మన్గా ఎన్నికైన రాటకొండ చంద్రశేఖర్ ను పలువురు పూలమాలలు వేసి దుశ్యాలవాల తో సత్కరించారు అనంతరం స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య బీసీ చైర్మన్ గా ఎన్నికైన రాటకొండ చంద్రశేఖర రావు,వైస్ చైర్మన్ తుమ్మల నరసింహారావు తో పాటు డబ్ల్యూ పి ఏ అధ్యక్షులుగా ఎన్నికైన వారిని ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో చిరుమామిళ్ల సుబ్బారావు,శాఖమూరి వంశీధర్,కాసర్ల లక్ష్మీనారాయణ,కత్తురోజు శ్రీనివాసచారి,20వ వార్డ్ కౌన్సిలర్ వెంకటకృష్ణ,రాట కొండ వెంకట్రావు,మంద జాన్ పీడర్,పెద్ద ఎత్తున హనుమంతుపాలెం గ్రామ ప్రజలు మరియు పట్టణానికి చెందిన ప్రముఖులు టిడిపి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు..

స్కూల్ గేమ్స్ పోటీలో కేజీబీవీ విద్యార్థినికి తృతీయ స్థానం

విశాలాంధ్ర – నెల్లిమర్ల : నెల్లిమర్ల మండలం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. సోమవారం గుంటూరు లో జరిగిన 68 వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల బేస్ బాల్ పోటీల్లో ఈ కళాశాల విద్యార్థిని వై గురు చందన. ఇంటర్‌ 2వ సంవత్సరం రాష్ట్ర స్థాయి అండర్‌ 19 బేస్‌బాల్‌ పోటీలో తృతీయ స్థానం సాధించి బహుమతి గెలుచుకుంది. చందనను కళాశాల ప్రిన్సిపల్ ఉమ, అధ్యాపకులు, ఉపాధ్యా యులు అభినందించారు.

రేపు టీడీపీలో చేరనున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆళ్ల నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదని… ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. కానీ, హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. వైసీపీ కుటుంబానికి సన్నిహితులు, జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని బడేటి చంటి అన్నారు. రెండు నెలల క్రితం వైసీపీకి, పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని… ఆళ్ల నాని స్వచ్ఛందంగానే టీడీపీలో చేరుతున్నారని సమాచారం.

పోలవరం ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక ఇది: సీఎం చంద్రబాబు


పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రధానంగా ఇందులో పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడంపై లక్ష్యాలను నిర్దేశించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం .. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలవరం కార్యాచరణను అధికారులు ప్రకటించారని, ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశామని తెలిపారు.

జల వనరుల శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళిక వివరిస్తారని తెలిపారు. విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జలసంఘంతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటారని తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుందని సీఎం తెలిపారు.

ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్ ఉ 1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ ఉ 2 తో పాటు మిగతా పనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ .. జులై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఫిబ్రవరి 2027 నాటికి పూర్తి చేయగలమని అధికారులు షెడ్యుల్ పెట్టుకున్నప్పటికీ ..2026 జులై నాటికి పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. భూసేకరణ 16 వేల ఎకరాలకు పైగా ఉండగా, 2025 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

పోలవరం కుడి కాలువ పనులు ఏప్రిల్ 2026 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రం వాల్ 2025 జనవరి నుంచి ప్రారంభమై 2026 ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని అంచనాతో ఉన్నప్పటికీ 2025 డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని ఆదేశించారు. 2026 ఆగస్టు నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కొంత మేర పూర్తవుతుంది కాబట్టి కాపర్ డ్యాం వద్ద నీరు నిలువ చేసి గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు ఇచ్చే ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు.