తన ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మరోసారి స్పందించారు. తాను ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని అన్నారు. తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఁనాకు న్యాయం జరగడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను రక్షణ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ అందరినీ కలుస్తా. నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయడం సరికాదు. నా భార్యాపిల్లలకు రక్షణ కరవైంది. నా భార్యాపిల్లల రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నేను డబ్బు, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానుఁ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత..
మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచి మనోజ్ బౌన్సనర్లు మరో వైపు విష్ణు బౌన్సర్లు మధ్య గొడవ జరిగింది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లుని బయటకు తోసేశారు. మోహన్ బాబు ఫామ్‌హౌస్‌కు పహడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మంచు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తండ్రి మోహన్‌బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు.
విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయరెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తాను, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని.. బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు. కాగా మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. సోమవారం అది ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్ లీగల్ సర్టిఫికెట్) చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి (జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం) వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తన దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మనోజ్, మౌనికపై సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్‌బాబు
ఇదిలా ఉంటే తన కొడుకు మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సీపీకి మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీకి రాసిన లేఖను మోహన్‌బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని వెల్లడించారు. తను 78 ఏళ్ల సీనియర్ సిటిజన్‌ననీ, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు. తన తండ్రి, అన్న విష్ణు అనుచరులు తనపై దాడిచేశారని మనోజ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, మనోజ్ దంపతులు వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు సీపీకి లేఖ రాయడం.. వంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్‌కు చేరింది. అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
వచ్చే సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణం ..
వివరాలు వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ
కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు ట్విట్టర్ లో కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి నుంచే ఫ్రీ జర్నీ అమలు చేస్తామని, దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని ట్వీట్ చేశారు. పథకం అమలు వల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా పథకం విధివిధానాలు రూపొందిస్తున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు.
రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో టిడిపి,జనసేన నేతలపై ఆయన పోస్ట్ లు పెట్టడంపై ఎపిలో వివిధ పోలీస్ స్టేషన్ లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.. దీనిపై ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మొత్తం మూడు కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పుడు పిలిస్తే అప్పడు పోలీసుల విచారణకు హాజరుకావాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కండిషన్ విధించింది కోర్టు. ఇది ఇలా ఉంటే 2022 సంవత్సరంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీడీపీ, జనసేన అధినేతలతో పాటు నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్జీవీ ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకు గైర్హాజరైన ఆర్జీవి తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
భారత్‌లో గోల్ఫ్ ఆదరణకు కృషి చేస్తా: కపిల్ దేవ్
భారతదేశంలో గోల్ఫ్ క్రీడకు ఆదరణ తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ కపిల్ దేవ్ చెప్పారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) అధ్యక్షుడిగా తన సహకారం అందిస్తానని పేర్కొన్నారు. విశ్వ సముద్ర గోల్ఫ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్్ణ ట్రోఫీ ఆవిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ వేదికగా రూ.2 కోట్ల భారీ ప్రైజ్‌మనీతో మంగళవారం ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ట్రోఫీ ఆవిష్కరణలో పలువురు ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ ఏడాది మొత్తం ప్రైజ్‌మనీ రూ.24.58గా పీజీటీఐ నిర్ణయించిందని, వచ్చే మూడేళ్లలో రూ.50 కోట్లు అవుతుందన్న నమ్మకం ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. భారతీయ గోల్ఫ్ త్వరలోనే మరో స్థాయికి చేరుతుందని అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ాానేను ముందుగానే గోల్ఫ్ ఆడడం మొదలుపెట్టి ఉండాల్సిందని భావిస్తుంటాను. క్రికెట్‌లో కనీసం మరో 2000 పరుగులు చేసి ఉండేవాడిని. బంతిపై ఏకాగ్రత ఎలా ఉండాలో ఈ గేమ్ చాలా నేర్పిస్తుంది. నేను గోల్ఫ్ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారతీయ క్రికెటర్లలో ఒక్క రోజర్ బిన్నీ మాత్రమే ఆడేవారు. అంతర్జాతీయంగా చాలా మంది క్రికెటర్లు గోల్ఫ్ ఆడుతుంటారు్ణ్ణ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. రాబోయే కొన్నేళ్లలోనే గోల్ఫ్ చాలా జనాదరణ పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ావిశ్వ సముద్ర ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్్ణ కంపెనీ ఈ ఛాంపియన్‌షిప్‌ని నిర్వహిస్తోంది. ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. గోల్ఫ్‌కు ఆదరణ తీసుకొచ్చేందుకు తమ కంపెనీ గత కొన్నేళ్లుగా కృషి చేస్తోందని ప్రస్తావించారు. పీజీటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషకరమని అన్నారు. కాగా గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఓం ప్రకాష్ చౌహాన్, ఉదయన్ మానే, వీర్ అహ్లావత్, కరణ్‌దీప్ కొచ్చర్, రాహిల్, గౌరవ్. రషీద్ ఖాన్, ఖలీన్ జోషి, చిక్కరంగప్ప, యువరాజ్ సంధు, ఇతర ప్రముఖ ఆటగాళ్లు పాల్గొంటారు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్ల విషయానికి వస్తే చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్టెపాన్ డానెక్, కెనడా ప్లేయర్ సుఖ్‌రాజ్ సింగ్ గిల్, జపాన్ గోల్ఫ్ ప్లేయర్ మకోటో ఇవాసాకి, అమెరికా ప్లేయర్లతో మొత్తం 126 మంది ప్లేయర్లు ఆడనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌కు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
హంద్రీనీవా కాలువను వెడెల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున జిల్లా కలెక్టర్ కు వినతులు
విశాలాంధ్ర- అనంతపురం: హంద్రీనీవా లైనింగ్ కాదు 10 వేల క్యూసెక్కులకు కాలువ ను వెడెల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున సోమవారం జిల్లా
గ్రీవెన్స్ లో కలెక్టర్ వి. వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిరు తుల మల్లికార్జున మాట్లాడుతూ… హంద్రీనీవా కాలువను 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఎన్నికల హామీని అమలు పరచకుండా జీడిపల్లి నుండి లైనింగ్ చేయడం అంటే జిల్లా ప్రజానీకానికి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసినట్లు ఆరోపించారు. ఈరోజు లైనింగ్ పనులు ఆపాలని ఎన్నికల హామీ మేరకు కాలువను పదివేల క్యూసెక్కులకు పెంచాలని ఆయకట్టుకు నీరు ఇవ్వాలని అనంతపురం జిల్లాకు హంద్రీనీవా ప్రాజెక్టు జిల్లాకు ఒకవరం లాంటిదని నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న జిల్లాకు హంద్రీ నీవ ద్వారా త్రాగునీరు సాగునీరు అందించాలని డిజైన్ చేసినారన్నారు. ప్రస్తుతం వస్తున్న నీరు వల్ల త్రాగునీరుతోపాటు భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల క్రింద ఆయకట్టుకు నీరు వస్తుందన్నారు. ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీ లకు ఉన్న కాలువను కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో పదివేల క్యూసెక్కులకు కాలువను పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీని అమలుపరచకుండా ప్రస్తుతం జీడిపల్లి నుండి కాలువను లైనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా రైతాంగము ప్రజలలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఇప్పటికింకా ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా కేవలం కాలువకు మాత్రమే నీరు ఇస్తున్నారు అన్నారు. పిల్ల కాలువలు కూడా ఏర్పాటుc చేయలేదు కానీ ఈ నీరును ముందుకు తీసుకుపోవడం అంటే జిల్లా ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు. ఎక్కువగా రాప్తాడు నియోజకవర్గం లో 75 వేల ఎకరాలకు ఆయకట్టు ఉన్న ఉపయోగము లేకపోవడమే గాక కాలువ కింద భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. జిల్లా ప్రయోజనాలు పూర్తి అయిన తర్వాతనే లైనింగ్ కానీ కాలువ ముందుకు నీరు పంపితే బాగుంటుందని పేర్కొన్నారు. అందుకోసమే ముందుగా కాలువను 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆయకట్టు నీరు ఇవ్వాలని ఇచ్చిన తరువాత నీరు ముందుకు తీసుకొని పోయి జిల్లాకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. వరుస కరువలతో ఇబ్బందులు పడుతున్న రైతులు పంటలు పండక అప్పుల భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను రైతులను కలుపుకొని ఉద్యమాలకు శ్రీకారం చుడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి రామకృష్ణ, సహాయ కార్యదర్శి జి శ్రీకాంత్, రైతు సంఘం నాయకులు బుల నగేష్, నియోజకవర్గ కార్యదర్శి ఏ ధనుంజయ, సిపిఐ నాయకులు దుర్గాప్రసాద్, రైతు సంఘం నాయకులు వెంకట్రాముడు, ఆంజనేయులు, పి వెంకట్ రాముడు తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం లో జరుగు ఏఐవైఎఫ్ 20వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపు
విశాలాంధ్ర అనంతపురం : అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 20జిల్లా మహాసభలు జనవరి 7 తేదీన రాయదుర్గం పట్టణం నిర్వహించడం జరుగుతుందని.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఐవైఎఫ్ నాయకత్వం నిరుద్యోగులు రావాలని తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పిలుపునిచ్చారు. స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నందు18 వ ఏఐవైఎఫ్ నగర మహాసభలు నిర్వహించారు. నగర మహాసభలకు ఏ ఐ వై ఎఫ్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీరాములు, రమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ అధ్యక్షులు ఆనంద్ జిల్లా ఉప్ప అధ్యక్షుడు మోహన్ కృష్ణ, దేవ పాల్గొన్నారు. ముందుగా జాఫర్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న తప్పుడు వాగ్దానాలతో బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. కులం, మతం పేరుతో విద్యార్థులు, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. “దేశంలో ఇరవై ఎనిమిది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయినీ పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ లక్షణం నిరుద్యోగం అన్నారు ఒకవైపు కొందరి దగ్గర సంపద పోగుబడడం పెరిగేకొద్దీ అత్యధిక మంది కొనుగోలు తగ్గుతోందన్నారు. ఇది మరింతగా నిరుద్యోగాన్ని పెంచుతుందనీ, దేశ ప్రజలు తమ కోసమే అనుకున్నా మంచి రోజులు ఎవరి కోసం వచ్చిందని రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులు, వనరులను కూడబెట్టిన ‘అచ్ఛే దిన్’ బీజేపీకి వచ్చిందన్నారు. కోట్లు సంపాదించడం ప్రారంభించిన చేతినిండా పెట్టుబడిదారులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రతి రోజు 1000 కోట్లు కరోనా విపత్తు మధ్య ఒక సంవత్సరంలో 30 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన 142 మంది పెద్ద ధనవంతుల కోసం అని పేర్కొన్నారు. కోట్ల విలువైన బ్యాంకు మోసాలకు పాల్పడిన బ్యాంకు దొంగల (మెహుల్ భాయ్, నీరవ్ భాయ్, విజయ్ భాయ్, సందేశరా భాయ్ తదితరులకు) ‘ వచ్చిదాని 5,40, వేల కోట్లు. కరోనా, ద్రవ్యోల్బణం మధ్య లక్షల కోట్లు సంపాదించిన హోర్డర్లు, బ్లాక్ మార్కెటర్లకు దక్కిందన్నారు. ప్రస్తుతం మనకు కూడా మంచి రోజులు వచ్చాయి అన్న పేరుతో దేశ ప్రజలకు ఏం వచ్చిందని దుయ్యబెట్టారు. వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చిన తీవ్ర అన్యాయం జరుగుతుందని చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారని. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలు వలసలకు పోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని. రాష్ట్రంలో మంచినీళ్లు కొరత ఉందేమో గాని మందు కొరత లేదని యువత గంజాయి డ్రగ్స్ వాడకం నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందారని.యువతను సన్మార్గంలో నడిచే విధంగా అఖిలభారత యువజన సమాఖ్య రాబోయే రోజుల్లో పని చేయాలని కోరారు యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. యువతకు ఉపాధి దొరకకపోవడంతో దేశంలో ప్రతి రోజు 40 నుంచి 45మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి అని తెలిపారు. విద్య ,వైద్యం, ఉపాధి ,భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు గా గుర్తించినా విద్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారంగా మారిందని వైద్యం మాఫియా వల్ల అందరికీ అందడంలేదని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు. నూతన పరిశ్రమలలో యువతకు ఉపాధి, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ… రాయదుర్గంలో నిర్వహించబడుతున్న ఏఐవైఫ్ 20 జిల్లా మహాసభల్లో రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని , ప్రభుత్వా శాఖల్లో ఖాళీ ఉన్నా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ అన్నారు. ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటికరణ కు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులకు ,వివిధ సామాజిక ,ఆర్థిక రాజకీయ, నూతన పరిశ్రమలు నెలకొల్పాలని, కియా పరిశ్రమల్లో 70 శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనిఅంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం అనంతపురం ఏఐవైఎఫ్ నగర నూతన కమిటీ అధ్యక్షులు ఆనంద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సురేంద్ర, గణేశ్,నగేష్ సహాయ కార్యదర్శులు రాంబాబు ముజీర్ కోశాధికారిగా అశోక్ తో 31 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి అలిపిర ఏఐవైఎఫ్ మాజీ నగర అధ్యక్ష కార్యదర్శులు గాదిలింగప్ప, చాంద్బాషా, జమీర్ తదితరులు పాల్గొన్నారు..
మున్సిపల్ కార్మికులందరికీ ఒకటే వేతనం 21వేలు ఇవ్వాలి…..
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజారెడ్డి
విశాలాంధ్ర అనంతపురం : మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు రూ. 21వేలు వేతనం ఇవ్వాలిని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. రాజారెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అనంతపురం నగరంలోని సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే రాజారెడ్డి మాట్లాడుతూ… అనేక సమస్యల నడుమ మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. మున్సిపల్ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని వారి సమస్యలు పట్టించుకోని పాపన పోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అనేక హామీలు ఇస్తూ సమ్మె నాటికి అనేక హామీల నెరవేరుస్తానని చెప్పినప్పటికీ ఐదు సంవత్సరాలలో కార్మికులకు ఏం చేయలేదన్నారు. కార్మికులందరూ తమ ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి అధికారమిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి సుమారు 6 నెలలవుతున్న సమ్మె కాలంలో ఇచ్చినటువంటి మినిట్స్ లో ఉన్న ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదన్నారు. వైసిపి ప్రభుత్వం కార్మికులను విభజించు పాలించు పద్ధతిలో పరిశుద్య కార్మికులకు 21 వేలు ఒక వేతనం,ఇంజనీర్ కార్మికులకు 15వేలు వేతనం అమలు చేశారన్నారు. పనిచేసే కార్మికులందరికి ఒకటే వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు . ఒక మనిషి భూమ్మీద జీవించడానికి రూ. 26వేలు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ. 26జీతం కార్మికుడికి ఇవ్వాలి అని తెలియజేసిందన్నారు . అనంతపురం నగర జనాభా దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంఖ్య ను పెంచాలని, కార్మికులకు పని భారం తగ్గించాలని. ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తించాలని, పారిశుద్య కార్మికులకు పనిచేసేందుకు అవసరమైన పనిముట్లు అందజేయాలన్నారు. ఈ ఎస్ ఐ,,పిఎఫ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. స్కూల్ స్వీపర్లు వాచ్మెన్ లను ఫుల్ టైం కంటెంట్ వర్కర్స్ గా తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న 7 నెలలో వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నామన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జి చిరంజీవి,ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి వేణుగోపాల్, నగర కోశాధికారి శివకృష్ణ, జిల్లా నాయకులు నాగేంద్రబాబు, రామాంజనేయులు,ప్రసాద్, దేవమ్మ,రఫీ,సరస్వతి లక్ష్మీదేవి,సుజాత,రవి, హాసెన్,మాధవ,రాముడు రామాంజనేయులు,వరలక్ష్మి,సమీర్ భాష, వెంకట్ రాముడు తదితరులు పాల్గొనడం జరిగింది.
అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు చర్యలు గైకొనండి..
వైయస్సార్ ఎస్సి, ఎస్టి సెల్ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు చర్యలు గైకొనాలని వైఎస్ఆర్సిపి ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు చౌడప్ప, దేవరకొండ రమేష్ కునుతురు గోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డిఏఓ కతిజున్ కుప్రకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత దేశంలోనే మొట్టమొదటి న్యాయశాఖ మాత్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ భవనం ఏర్పాటు ప్రభుత్వమే చేయాలని, వీలైతే ప్రభుత్వ స్థలమును కేటాయించి భవన నిర్మాణమును ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. దీనివలన ఎస్సీ ఎస్టీలకు వివాహాది శుభకార్యాల కోసం తదితర కార్యక్రమాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత భవనానికి అంబేద్కర్ భవన్ అని నామకరణం చేస్తామని, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. లేనియెడల వైయస్సార్సీపి పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలందరూ ఏకమై ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జల బోమ్మన్న ,సాకే వెంకటేష్, రామాంజనేయులు, మల్లెల పెద్దన్న, పోతల కుల్లాయప్ప, ఆంజనేయులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం.. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
పేద విద్యార్థినికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని రామిరెడ్డి అందజేశారు. మండలంలో పొంగుటూరు గ్రామానికి చెందిన నక్క మమత స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి విద్యను అభ్యర్థిస్తుంది. మమతకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన విద్యార్థిని తల్లి పదవ తరగతి చదివిన తర్వాత చదువును నిలిపివేస్తామని తెలపడంతో, విషయం తెలుసుకున్న ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకు కొండలరావు, విద్యార్థి ని స్థితి తెలుసుకొని ఆయన మిత్రుడు ఆస్ట్రేలియా లో ఉంటున్న శ్రీ రామిరెడ్డికి విషయం తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి విద్యార్థిని చదువు నిమిత్తం ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని విద్యార్థిని తల్లికి అందజేశారు. విద్యార్థిని మమత చదువులలో ముందుంటుందని, అత్యధిక మార్కులు కూడా పాఠశాలలో నిర్వహించే పరీక్షలలో సంపాదించుకుంటుందని కొండలరావు తెలిపారు. విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామరాజు పాల్గొన్నారు.