మత్తుపదార్థాల జోలికెళ్లి జీవితాలు నాశనం చేసుకోకండి
— జిల్లా ఎస్పీ పి. జగదీష్
విశాలాంధ్ర- అనంతపురం : మత్తుపదార్థాల జోలికెళ్లి జీవితాలు నాశనం చేసుకోకండి అని జిల్లా ఎస్పీ పి జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం గంజాయి అమ్ముతున్న ముఠాల దగ్గర్నుంచి 4,270 గ్రాముల గంజాయి, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో తెలియజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, తదితర మాదకద్రవ్యాలకు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని… క్షణకాలం ఆనందం కోసం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దని సూచించారు. అనంత, పుట్టపర్తి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న పదిమంది ముఠాలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. . జిల్లాలో మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని ఎవరైనా అమాయక ప్రజలు, యువకులు, విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బుక్కరాయ సముద్రం సి.ఐ కరుణాకర్, ఇన్ఛార్జీ సి.ఐ హేమంత్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్సై రాజశేఖర్ రెడ్డిలకు రాబడిన పక్కా సమాచారంతో ఈ ముఠాను అరెస్టు చేసి 4,270 గ్రాముల గంజాయి, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించినట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఈ ముఠా సరఫరా చేస్తున్న గంజాయితో పాటు సేవించేందుకు ఖాళీ ఓసిలుమరియు మౌత్ ఫ్రెషనర్స్ మరియు కళ్లు ఎర్రబడకుండా ఉండేందుకు ఐ డ్రాప్స్ ను సీజ్ చేశారు.ఈ ముఠాలోని మైనర్ ను సి డబ్ల్యూ సి ముందు తీసుకురావడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, ప్రజల్లో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. అక్రమ మాదకద్రవ్యాలు రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా గంజాయి మరియు మాదకద్రవ్యాలు పై సమాచారం ఉంటే వెంటనే ఈగల్ ట్రోల్ ప్రీ నెంబర్ 1972 కు లేదా స్ధానిక పోలీసులకు లేదా డయల్ 100/112 కు తెలియజేయాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు.
భారత దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ శరీరం విడిచిపెట్టడం చాలా బాధాకరమని దేశం చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ తెలియచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల ఆయన 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా కీర్తి గడించారని, దేశానికి ఎన్నో సేవలందించిన వ్యక్తి ఈరోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య కుమార్, మోటివేషనల్ స్పీకర్ బూరాడ శివకృష్ణ అన్నారు. జ్ఞానజ్యోతి విద్యాలయం కరెస్పాండెంట్ నడికుప్పల తారకేశ్వరరావు, కొత్త కోట కృష్ణమూర్తి, ఉరిటి శశి, రావాడ మధుబాబు, శ్రీకాంత్, ఉమ మరియు విద్యార్థులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.
సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కేసు శుక్రవారం నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ ధాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారంకు న్యాయస్థానం వాయిదా వేసింది. చిక్కడ పల్లి పోలీసులు సోమవారం కౌంటర్ ధాఖలు చేయనున్నారు. కాగా రిమాండ్ పొడిగింపుపై అల్లు అర్జున్ మరికొద్ది సేపటిలో వర్చ్యువల్ విధానంలో హాజరు కానున్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌శుక్రవారం నాంపల్లి కోర్టు కు వర్చువల్ లో విధానంలో హాజరవుతారు. అసలు అల్లు అర్జున్ ఈ రోజు స్వయంగా కోర్టు ముందు హాజరవుతారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ ఈరోజుతో పూర్తి కాగా.. వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలపాల్సి ఉంది. సెక్యూరిటీ సమస్య కారణంగా ఆయన వర్చువల్‌లో విధానంలో హాజరవుతారు..
రాజకీయాల్లోకి వచ్చి స్వేచ్చను కోల్పోవడం ఇష్టం లేదన్న సోనూ సూద్ పలువురు సినీ నటులు, నటీమణులు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి రాణించారు. రాణిస్తున్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి అగ్రనటులు ముఖ్యమంత్రులుగానూ బాధ్యతలు నిర్వహించారు. పలువురు నటీనటులు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికై కేంద్ర, రాష్ట్ర మంత్రులు గానూ పని చేశారు. దీంతో కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సాయం అందించి రియల్ హీరోగా గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్ నటుడు సోనూ సూద్ కూడా రాజకీయాల్లోకి రానున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఆయన తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు తనకు సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, ఆ అభ్యర్ధనలను తిరస్కరించినట్లు చెప్పారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని సోనూ సూద్ తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు నాడు సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శుక్రవారం నాడు సెలవదినంతో పాటు వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం . కాగా నేడు జరగాల్సిన వివిధ పరీక్షలను ఆయా విద్యా సంస్థ లు రద్దు చేసారు.
అసాధారణ ప్రతిభావంతుడు, నిజాయతీపరుడని కొనియాడిన ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించారు. ాఏ ప్రామిస్డ్ ల్యాండ్్ణ పేరుతో ఒబామా తన జ్ఞాపకాలను పుస్తకరూపంలో తీసుకురాగా.. అందులో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తావనా ఉంది. మన్మోహన్ ను అత్యంత అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా ఒబామా పేర్కొన్నారు. ఆలోచనాపరుడు, నిజాయతీ కలిగిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు.
నిరంతరం భారతీయుల సంక్షేమం కోసమే ఆలోచించారని, పాటుపడ్డారని ఒబామా పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన ఆర్థికవేత్తగా, ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలతో భారత్ లో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొనియాడారు. తెలివైన, ఆలోచనాత్మకమైన, కపటం లేని నిజాయతీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్ సింగ్ సొంతమని ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు.
నిన్న సాయంత్రం కన్నుమూసిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం మన్మోహన్ నివాసం వద్ద పార్థివదేహం ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం మన దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన మాజీ ప్రధాని మన్హోహన్ సింగ్ అస్తమయం చెందిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆయన కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని నివాసం వద్ద ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం. మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించారు. ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అప్పటి అవిభక్త భారతదేశంలో (ఇప్పటి పాకిస్థాన్ పంజాబ్)లోని గాహ్ లో జన్మించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందారు. ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ గా, ఎకనామిక్ అడ్వైజర్ గా భారత ప్రభుత్వంలో పని చేశారు. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పని చేశారు.
విశాలాంధ్ర-విజయవాడ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 99 ఏళ్లు పూర్తిచేసుకుని వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రక క్షణాన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనడంతోపాటు ఒకింత ఉద్వేగభరితులయ్యారు. విజయవాడ హనుమాన్‌పేటలోని సీపీఐ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద అరుణపతాకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆవిష్కరించారు. రెడ్‌షర్ట్ వలంటీర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న పార్టీ సీనియర్ నాయకులు చండ్ర రాజేశ్వరరావు విగ్రహం వద్ద జెండా ఎగురవేశారు. చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శత వార్షికోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ది విజయవాడ టాక్సీ వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల నాగేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయంత్రం సీపీఐ విజయవాడ నగర సమితి అధ్వర్యంలో లెనిన్ పార్కులో జరిగిన భారీ బహిరంగ సభలో రామకృష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ 1925 డిసెంబరు 26వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారత దేశంలోని మేధావులు, విద్యావేత్తలు, లెనిన్, మార్క్స్ సిద్ధాంతాలపై విశ్వాసం ఉన్న వారు భారత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీని మొగ్గలోనే తుంచేయాలనే కుట్రతో బ్రిటీష్ పాలకులు అక్రమకేసులు బనాయించి జైళ్లలో పెట్టారన్నారు. అయినా కోట్లాది కష్టజీవుల కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనం కోసం పోరాటాలు చేసినట్లు చెప్పారు. తెలంగాణ సాయుధపోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టు నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని తద్వారా వేలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ చేపట్టిన పోరాటంలో భాగంగా 32 మంది ప్రాణాలు అమరులయ్యారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావటమనే దాంతో నిమిత్తం లేకుండా కష్టజీవుల రాజ్య స్థాపన లక్ష్యంగా ఎన్నేళ్లయినా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఏ వర్గం వారైన పోరాటంలోకి వస్తే వారికి అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని నొక్కి చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పార్టీగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందువల్ల వారికి మహాత్మాగాంధీ, జవర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ … అయన రాసిన రాజ్యాంగం అంటే గౌరవం లేదన్నారు. దిల్లీ సరిహద్దులో రైతులు ఉద్యమాలు చేస్తుంటే సమస్యను పరిష్కరించకుండా పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తు పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారని చెప్పారు. అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల 30న వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు మర్చిపోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.15,486 కోట్లు భారం ప్రజలపై వేశారని ధ్వజమెత్తారు. సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం అదాని వైపు ఉంటారా? ప్రజల వైపు ఉంటారా? తేల్చుకోవాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి నోరెత్తని చంద్రబాబు మిట్టల్ ఉక్కు గురించి మోదీతో మాట్లాడారని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు తగిన న్యాయం చేయటానికి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించే అభ్యుదయ వాదులందరూ వెలుగులోకి వచ్చి కమ్యూనిస్టు పార్టీని స్థాపించటం ద్వారా దేశంలో సాంస్కృతిక మార్పు వచ్చిందన్నారు. పేదలు గౌరవప్రదంగా జీవించటానికి అవకాశం వచ్చిందన్నారు. నాటి పోరాట ఘట్టాలను వివరిస్తూ రావి నారాయణరెడ్డి పోరాటాన్ని గుర్తు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికవర్గం హక్కుల కోసం చేస్తున్న ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు, తద్వారా జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్.కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్, సీనియర్ నాయకులు వై.చెంచయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అఫ్సర్, ప్రొఫెసర్ సి.నరసింహారావు, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ సదానందం, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, వీధి విక్రయదారుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావుతో పాటు సీపీఐ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, కోశాధికారి ఆర్.పిచ్చయ్య, రాష్ట్ర నాయకులు ఎస్‌కే.నజీర్ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
లోకేశ్ చొరవతో ఏపీకి దిగ్గజ కంపెనీలు క్యూ ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రగతిశీల ఆలోచనలతో ఆరు నెలలుగా రాష్ట్రంలో ఐటీి, ఎలక్ట్రానిక్స్ రంగాలను పరుగులు తీయిస్తున్నారు మంత్రి నారా లోకేశ్. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా లోకేశ్… రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు విశేషంగా కృషి జరుపుతున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా డీప్ టెక్‌ను అభివృద్ధి చేసి తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇన్నొవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలాతో ఎంఓయు కుదుర్చుకున్నారు. లోకేశ్ కృషి ఫలితంగా గూగుల్ క్లౌడ్, టీసీిఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఐదువేల మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్‌సీఎల్… మరో 15వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకు వచ్చింది. లోకేశ్‌తో చర్చల అనంతరం ఫాక్స్‌కాన్ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అక్టోబరు 25 నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. సిలికాన్ వ్యాలీ, సీటెల్, న్యూయార్క్‌తో సహా ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఏపీిలో పెట్టుబడి అవకాశాలపై ప్రపంచస్థాయి టెక్నాలజీ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చలు జరిపారు. టెస్లా, గూగుల్, యాపిల్, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఫాల్కొన్ ఎక్స్, సేల్స్ ఫోర్స్, జడ్ స్కాలర్ వంటి 100 ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించారు. ఐటీి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఐదేళ్లలో ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రకటించారు. అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 2024-29లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీలను ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసం విధానాల రూపకల్పన చేశారు. దిల్లీలో పారిశ్రామిక పెట్టుబడిదారులతో సమావేశాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రోత్సహ కాలతో కూడిన సులభతర విధానాలను వివరించారు. చర్చలు ఫలవంతమయ్యాయి. కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలపైనే గాకుండా ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులకు టాటా గ్రూప్ సిద్ధమైంది. రాష్ట్రంలో 65 వేల కోట్లతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆదిత్యమిట్టల్‌తో మంత్రి లోకేశ్ జరిపిన వీడియోకాల్ చర్చలు ఫలించాయి. రెండు దశలుగా రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ముందుకు వచ్చింది. జనవరిలో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అనకాపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. ముంబైలో లోకేశ్ జరిపిన చర్చలతో వేదాంత అనుబంధ సంస్థ అయిన సెరెంటికీ గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.60 వేల కోట్లతో 10వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు ఆ సంస్థ రంగం సిద్ధం చేసుకుంటోంది. అయిదేళ్ల తర్వాత విశాఖలో తొలిసారిగా ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్… ఐటీ రంగ సమస్యలను తెలుసుకుని, సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల సులభంగా అనుమతులు, ప్రోత్సహకాలు ఇచ్చేందుకు ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డును పునరుద్దరించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో సైతం కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.