Monday, May 12, 2025
Home Blog Page 302

రోడ్లపై నిల్వ ఉన్న నీటితో ఇబ్బంది పడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని చుండి పంచాయతీ లోని కాకర్లపాలెం గ్రామంలో చుండి నుండి అమ్మపాలెం, గాంధీనగర్, లింగసముద్రం పోవు రోడ్డు లో చిన్నపాటి వర్షం పడితే రోడ్డు పై నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు బాధతో అల్లాడుతున్నట్లు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు సీసీ రోడ్డు వేసినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడ ప్రజలు పేర్కొన్నారు. అధికారులు గ్రామాన్ని సందర్శిస్తే విషయాలు తెలుస్తాయని ప్రజలు కోరుకుంటున్నారు.ఎక్కువ వర్షం పడితే మా బాధలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలతో ఎక్కువగా రోగాలు వస్తున్నాయని అంటున్నారు.పోయిన నెలలో మా గ్రామం లోజ్వరాలు ఎక్కువగా ఉన్నందున వలేటివారిపాలెం ప్రాథమిక ఆరోగ్యఉపకేంద్రం వారు రొండు రోజులు ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారని అన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెపండుగలోనైనా రోడ్డు బాగుచేస్తారని స్థానికులు ఎదురు చూస్తున్నారు.సంబందిత మండలఅధికారులు మా కాకర్లపాలెం గ్రామంలో పర్యటిస్తే విషయం తెలుసుకోవచ్చునని ప్రజలు కోరుకుంటున్నారు.

పిల్లల యొక్క దృష్టి లోపాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి

కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: పిల్లలు యొక్క దృష్టి లోపాల్ని తల్లిదండ్రులు గుర్తించినప్పుడే కంటి వెలుగు సంపూర్ణంగా ఉంటుందని కంటి వైద్య నిపుణులు, రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమిష్టిగా విద్యార్థులలోని దృష్టిలోపాన్ని గుర్తించి కంటి డాక్టర్ సలహాతో సరియైన కంటి అర్థాలను ఉపయోగిస్తే వారిలోని దృష్టిలోపాలను పరిష్కరించవచ్చునని తెలిపారు. కంటి రక్షణపై నిర్లక్ష్యం ఉండరాదని తెలిపారు. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే చక్కటి కంటిచూపు ఎంతైనా అవసరమని తెలిపారు. చాలామంది కుటుంబంలోని పిల్లలు తమ కంటి చూపును సమస్యను చెప్పకుండా బాధపడుతుంటారని, తల్లిదండ్రులు కంటి విషయంపై జాగ్రత్త వహిస్తే సమస్యలు ఉండవని తెలిపారు. పిల్లలను టీవీ తో పాటు సెల్ఫోన్ కు దూరంగా ఉంచాలని తెలిపారు. ఎందుకంటే పరోక్షంగా చదువులో కూడా వెనుకబడే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పాఠశాలలో కంటిచూపు పట్టికను ఏర్పాటు చేస్తే విద్యార్థులే స్వయంగా దృష్టిలోపాలను కనుగొంటారని తెలిపారు. ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతైనా ఉంది అని తెలిపారు. కంటి చూపు పట్టికను బాగా వెలుతురు ఉన్న గదిలో సమాన ఎత్తులో తగిలించాలి, తదుపరి విద్యార్థులకు ఆరు మీటర్ల దూరంలో కూర్చొని అక్షరాలను చదివించే ప్రయత్నం చేసినప్పుడు లోపములను సులభతరిలో నిర్ణయించవచ్చునని తెలిపారు. కావున విద్యార్థుల యొక్క కంటి చూపు విషయంలో పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేసినప్పుడే ప్రతి విద్యార్థికి కంటి చూపు లభిస్తుందని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కావున తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు గమనించాలని తెలిపారు.

పురుషులకు కూడా నెలసరి వస్తే అప్పుడు తెలిసేది.. మధ్యప్రదేశ్ హైకోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆశించిన స్థాయిలో పనితీరు లేదన్న కారణంతో గతేడాది ఆరుగురు మహిళా సివిల్ జడ్జ్‌లను మధ్యప్రదేశ్ హైకోర్టు విధుల నుంచి తొలగించింది. వారిలో నలుగురిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం నిర్ణయించగా, మిగతా ఇద్దరికి మాత్రం నిరాశే ఎదురైంది. ఇద్దరిలో ఒక న్యాయమూర్తి తనకు గర్భస్రావం అయిందని, తన సోదరుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని చెబుతూ వివరణ ఇచ్చినప్పటికీ హైకోర్టులో ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. గర్భస్రావం కారణంగా మహిళా న్యాయమూర్తి అనుభవించిన మానసిక, శారీరక క్షోభను హైకోర్టు విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు కూడా నెలసరి వస్తే అప్పుడు వారి బాధ తెలిసేదని వ్యాఖ్యానించింది. ఆమెకు గర్భవిచ్ఛిత్తి జరగడంతో ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉందని, పురుషులకు కూడా రుతుక్రమం వస్తే సమస్య ఏంటనేది తెలిసేదని పేర్కొంది.

ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ బీవీ నాగరత్న తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలే పురుష న్యాయమూర్తులకూ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సివిల్ జడ్జ్‌ల తొలగింపు విధివిధానాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.

హ‌రీశ్ రావుకు ఊర‌ట.. అరెస్ట్ చేయ‌వ‌ద్దంటూ హైకోర్టు ఆదేశం

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అరెస్టు మినహా తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని హరీశ్‌రావుకు సూచించింది. హరీశ్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీసింది. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న హరీశ్‌ రావును అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారంటూ సిద్దిపేట కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చక్రధర్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో హరీశ్‌రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో హ‌రీశ్‌రావు పిటిష‌న్‌ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్‌లో త‌న‌పై త‌ప్పుడు కేసు న‌మోదు చేశార‌ని అందులో పేర్కొన్నారు. రాజ‌కీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేశార‌ని ఆయ‌న తెలిపారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాల‌ని కోర్టును కోరారు. ఈనేపథ్యంలో హరీశ్‌ రావును అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.

నేడు నింగిలోకి పిఎస్ఎల్వీ సి-59 రాకెట్ ప్ర‌యోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం రోజు చివరి నిమిషంలో వాయిదా ప‌డిన పిఎస్ఎల్వీ సి-59 రాకెట్‌ ప్రయోగాన్ని ఇవాళ‌ ప్ర‌యోగించ‌నున్నారు.. కాగా, కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని బుధవారం రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ దావన్‌ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది ఇస్త్రో.. శాటిలైట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ వెంటనే కౌంట్‌ డౌన్‌ ప్రక్రియను నిలిపివేశారు. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి ముందు అన్ని విభాగాలను కంప్యూటర్ తో పరీక్షలు నిర్వహించారు.. అయితే, ఉపగ్రహంలో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించింది.. దీనిపై శాస్త్రవేత్తల సమీక్షించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఆ తర్వాత కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిలిపివేసి.. ప్రయోగాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు..దీంతో.. ఈరోజు సాయంత్రం 4.12 గంటలకు పిఎస్ఎల్వీ సి-59 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్త్రో.. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.. శాస్త్రవేత్తలతో సమీక్షిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. కాగా, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైన వేళ.. పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాక్షింస్తూ.. సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ బుధవారం రోజు పూజలు నిర్వహించిన విషయం విదితమే..ఈ సందర్భంగా ఇస్రో తదుపరి ప్రాజెక్టులపై మాట్లాడుతూ.. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక,ఈ రాకెట్‌ను కూడా ఈ నెలలోనే ప్రయోగిస్తామని.. చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని.. గగన్‌యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో మొదలవుతాయని ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ ప్రకటించారు.

ఏపిలో కొత్తగా 53 కళాశాలలు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీలో కొత్తగా 53 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 37 మండలాల్లో 47 కళాశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కళాశాలలు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన విధులకు భంగం క‌లిగించార‌ని బంజారాహిల్స్‌ సీఐ ఫిర్యాదు మేర‌కు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్‌ రెడ్డిని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్‌ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, రాకేశ్‌ రెడ్డి సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయ‌న‌ను కూడా గచ్చిబౌలి పీఎస్‌ తరలిస్తున్నారు. కాగా, బుధ‌వారం త‌న ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివ‌ధ‌ర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. అయితే, ఆయ‌న వెళ్లేస‌రికి ఏసీపీ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డంతో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు కావ‌డం జ‌రిగింది. ఇవాళ ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్‌

వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్ జారీ అయింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3600 కోట్ల విలువైన వాటాల‌ను క‌ర్నాటి వెంకటేశ్వ‌ర‌రావు (కేవీ రావు) నుంచి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బ‌ల‌వంతంగా లాక్కోవ‌డంపై ఆయ‌న‌ ఫిర్యాదు మేర‌కు సీఐడీ కేసు న‌మోదు చేసింది. దీంతో విజ‌య‌సాయితో పాటు ఆయ‌న అల్లుడు శ‌ర‌త్ చంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యూల‌ర్ జారీ చేశారు. భ‌య‌పెట్టి అత్య‌ధిక శాతం షేర్ల‌ను అర‌బిందో సంస్థ ప‌రం చేశార‌నేది వీరిపై ప్ర‌ధాన అభియోగం.

నేడు ముంబయికి ఏపీ సీఎం చంద్రబాబు

మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు బయలుదేరి వెళుతున్నారు. ముంబయిలోని అజాద్ గ్రౌండ్‌లో మహా ముఖ్యమంత్రిగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ నేతలు హజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ముంబయి చేరుకోనున్నారు.

ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు ముంబయి నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రి విశాఖలో బస చేయనున్నారు. విశాఖలో రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ఆయన హజరుకానున్నారు. ఈ సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

0

. కైకలూరులో శ్రీసంతాన నాగేంద్ర విగ్రహ ప్రతిష్ట….
. భారీ అన్న సమారాధన…
. పోటెత్తిన భక్తజనం…

విశాలాంధ్ర – కైకలూరు : స్థానిక శ్రీసంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఎంత వైభవపీతంగా జరిగింది.స్వాంప్ డ్రెయిన్ కాలువ గట్టుపై వెలసిన శ్రీస్వామివారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం ప్రారంభమైన విషయం విధితమే.దీనిలో భాగంగా బుధవారం
శ్రీగణపతి,శ్రీనాగబంద,శ్రీమయూర వాహన సహిత శ్రీసంతాన నాగేంద్ర,శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి భోగేశ్వర శర్మ శిష్య బృందం గణపతి శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ముందుగా నిర్వహించిన వివిధ హోమాల పూర్ణాహుతి అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య శాంతి కల్యాణం జరుగగా తదుపరి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వాహకులు చావలి శంకర్ శాస్త్రి ఆధ్వర్యంలో చేపట్టారు.పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ,స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఎం. శివకిరణ్,ఎంపీపీ అడవి కృష్ణ, న్యాయవాదులు గురజాడ ఉదయ శంకర్, వడ్లాని శ్రీరామచంద్రమూర్తి,పి.పవన్ కాంత్, శ్రీరామలింగేశ్వర స్వామి ధర్మకర్త ఉప్పులూరి ముత్తం రాజు శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పశీడ్రంగి కనకదుర్గ ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.