అమరావతి: పెద్ద ఎత్తున పెట్టుబడులు, ప్రాజెక్టులు కీలక పరిశ్రమలకు ఉత్పాదక శక్తి కేంద్రంగా మారడంతో ఆంధ్ర ప్రదేశ్ గణనీయమైన మౌలిక సదుపాయాల వృద్ధిని సాధిస్తోంది. ఈ వేగవంతమైన విస్తరణ నిర్మాణం, మైనింగ్, లాజిస్టిక్స్ కార్యకలాపాలలో పెరుగుదల ద్వారా గుర్తించబడిరది. ఈ రంగాలు కార్గో, నిర్మాణ సామగ్రి మొదలైన వాటి తిరుగులేని మొబిలిటీకి మద్దతు ఇవ్వడానికి నమ్మకమైన హెవీ-డ్యూటీ ట్రక్కులను డిమాండ్ చేస్తాయి. భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారుగా టాటా మోటార్స్ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటునందించ డంలో హెవీ-డ్యూటీ టిప్పర్లు, ట్రక్కులు, ట్రాక్టర్‌ల సమగ్ర శ్రేణితో విభిన్న మొబిలిటీ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిరది. టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ప్రైమా ప్లాట్‌ఫామ్‌లో విస్తృత శ్రేణి పరిష్కారాలను అందిస్తుంది.
అపోలో మెడికల్ కాలేజీ స్నాతకోత్సవం
హైదరాబాద్: వైద్య వృత్తిలో నిరంతర అభ్యాసనం అవసరమని ముఖ్య అతిథి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్‌ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్, వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. అపోలో మెడికల్ కాలేజీ స్నాతకోత్సవం జూబ్లీహిల్స్‌లోని ఆర్‌ఎన్‌ఆర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చేతుల మీదుగా వైద్య విద్యార్థులకు పట్టాల పంపిణీ చేశారు. వంద మంది 2018 బ్యాచ్ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విద్యా సంస్థలలో ఒకటైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఉత్తీర్ణులు అవడం చాలా అదృష్టం అన్నారు. నలబై మూడు సంవత్సరాలుగా వైద్య రంగంలో ఉన్నానన్నారు. ఇప్పటికీ రోగుల నుంచి, విద్యార్థుల నుంచి, ఇంటర్నెట్, ఇతర వనరుల నుంచి నేర్చుకుంటున్నానని తెలిపారు. నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే, ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు.
ముస్లిం మత పెద్ద ఇలాహి అబ్దుల్ సలాం గుండెపోటుతో మృతి
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ముస్లిం మత పెద్ద అయినా ఇలాహి అబ్దుల్ సలాం (60) గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మృతుని ఇంటికి వెళ్లి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వీరి మరణం కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు సుధాకర్, నాయకులు అబ్దుల్ మునఫ్ , మహేష్ చౌదరి, నాగూర్ హుస్సేన్, నడిమి మషీద్, అస్లాం, రాళ్లపల్లి షరీఫ్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించండి.. ఆర్డిఓ మహేష్
విశాలాంధ్ర -ధర్మవరం: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను పగడ్బందీగా పటిష్టంగా నిర్వహించాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ఎన్నికల అధికారులకు,ఉప ఎన్నికల అధికారులకు, పోలింగ్ అధికారులు, సహాయక అధికారులు ఎన్నికల నిర్వహణపై ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులలో ఆర్డీవో తో పాటు ఇరిగేషన్ డియి. మహేశ్వర్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ. గురు ప్రసాద్ లు పాల్గొన్నారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని 46 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంసిద్ధం కావాలని తెలిపారు. ఒకే రోజు రెండు దఫాలుగా ఈ శిక్షణా తరగతులను నిర్వహించినట్లు వారు తెలిపారు. ఎన్నికలు జరుగు రోజున ఎటువంటి పొరపాట్లకు చోటు ఇవ్వరాదని, తప్పిదాలకు అవకాశం ఉండరాదని, ప్రభుత్వా నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విషయంలో పగడ్బందీగా అందరూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధి విధానాలను కూడా తెలియపరచడం జరిగిందని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆయా పోలింగ్ బూతుల వద్ద విధులను సక్రమంగా నిర్వహించాలని తెలుపుతూ సూచనలు, సలహాలు, మార్గదర్శకం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎన్నికల తేదీలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రచురించబడుతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీదారుడు ఆ ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ అయి ఉండాలని, 18 సంవత్సరాలు వయసు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదని, ఏదేని చట్టబద్ధమైన హోదా కలిగి ఉండకూడదని, క్రిమినల్ చట్టాల ప్రకారం దోసి అయి ఉండకూడదని, నీటి శిస్తూ ఎగవేత దారుడు అయి ఉండరాదని, దివాలా తీసి ఉండకూడదని తెలిపారు. ఆశావాహు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను పరిశీలన చేయాలని తెలిపారు. తదుపరి మరిన్ని వివరాలను తెలియపరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాల నుండి 600 మంది శిక్షార్తులు పాల్గొన్నారు.
భీమా పథకం కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రబీ సీజన్లో పంటలు వేసిన రైతులు భీమా పథకం కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక రైతు సేవా కేంద్రం నందు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్ నుండి పంటల భీమా కొరకు రైతులు ప్రీమియం చెల్లించాలని కోరారు. పంటల భీమా పథకం కింద అర్హత పొందడానికి శనగకు ఎకరానికి రూ 420, వరికి 630,జొన్నకు 297, వేరుశనగకు 480, ఉల్లికి 1350 రూపాయలు చొప్పున చెల్లిస్తే ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకం వర్తిస్తుందని, అలాగే టమోటాకు ఎకరానికి 1500 రూపాయలు చెల్లిస్తే వాతావరణ ఆధారిత భీమా కింద అర్హులు అవుతారని, రబీ సీజన్లో రుణాలు తీసుకునే రైతులకు బ్యాంకులే ప్రీమియం చెల్లిస్తాయని తెలిపారు. స్వచ్ఛందంగా నమోదు చేయదలుచుకున్న వారు బ్యాంకు లేదా కామన్ సర్వీసు కేంద్రాల్లో ప్రీమియం చెల్లించవచ్చునని, వరి పంటకు మాత్రం డిసెంబర్ 31లోగా ప్రీమియం చెల్లించాలని, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 15 లోపు ప్రీమియం చెల్లించి పంటల భీమా పథకంలో అర్హత సాధించాలని కోరారు. అలాగే గంజాయి లాంటి మాదక ద్రవ్యాల సాగుపై రైతులు మరియు రైతు సేవా కేంద్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, కొంత మంది మిరప పంటలో గంజాయి మొక్కలు నాటే అవకాశం ఉందని, గంజాయి సాగు చట్ట విరుద్ధమని సాగు చేసిన రైతులు శిక్షార్హులని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఏఏ ఇందు, ఎంపీఈఓ శ్వేత, రైతులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు (ఎల్ ఓ సీ ) లబ్ధిదారునికి అందజేసిన ఎమ్మెల్యే ఇంటూరి
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన మన్నం పుల్లయ్య కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 350000 రూపాయల ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు*లబ్ధిదారునికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం నిధులు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కందుకూరు నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గత వైసిపి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం వహించారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు మన్నం పుల్లయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
ప్రతిభను వైకల్యం అడ్డుకోలేదు…
ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ప్రతిభ గల వారికి వైకల్యం ఏమాత్రం అడ్డు కాదని, ప్రతిభావంతులైన వారిని గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ మస్తాన్ వలి, ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త రామాంజనేయులు, ఎంఈఓ-2 తిరుమలరావు, వెలుగు ఏపీఎం జనార్ధన్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సేక్రెడ్ సంస్థ, ఆదర్శ వికలాంగుల మండల సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సేక్రెడ్ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్, బస్టాండ్ మీదుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వీరేంద్ర, ఎల్లప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వికలాంగులను అడ్డు పేర్లుతో పిలిచిన దూషించిన నేరమని 2016 హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 91,92 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, సంఘాలుగా ఏర్పడిన గ్రూపులకు బ్యాంకు లింకేజెస్ మరియు శ్రీనిధిలో రుణాలు మంజూరు చేస్తామన్నారు. విభిన్నప్రతిభావంతులను ప్రోత్సహించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేక్రెడ్ సంస్థ సిబ్బంది వీరశేఖర్, ఆదర్శ వికలాంగుల సమైక్య సభ్యులు వీరేష్, లక్ష్మన్న, నాగలక్ష్మి, రంగస్వామి, చిన్నస్వామి, విజయమ్మ, ఎర్రమ్మ, హనుమంతు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
జిల్లా ఎస్పీ పి. జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-44పై బ్లాక్ స్పాట్స్ ను జిల్లా ఎస్పీపి.జగదీష్ ఎన్ హెచ్ ఏ ఐ , ఆర్టీఏ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. బ్లాక్ స్పాట్ ప్రాంతాలైన రాప్తాడు జంక్షన్, అయ్యవారిపల్లి క్రాస్, కక్కలపల్లి క్రాస్, తపోవనం కూడళి, శిల్పారామం సమీపంలోని బ్రిడ్జి, నారాయణ కళాశాల కూడళ్లలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో అప్పుడప్పుడు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను సమీక్షించారు. అంతేకాకుండా… జాతీయ రహదారిపై డ్రోన్లు ఆపరేట్ చేసి ప్రమాదాలకు కారణాలపై జిల్లా ఎస్పీ చూపించారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలంటే ఎలాంటి పరిష్కారాలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో పలు సూచనలు చేశారు. అయ్యవారిపల్లి క్రాస్ వద్ద సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని… అయ్యవారిపల్లి క్రాస్ నుండీ రాప్తాడు వరకు హైవేపై ఉన్న మీడియన్స్ క్లోజ్ చేసి వాటి స్థానాన ఐరన్ బ్యారికేడింగ్ చేయాలని సూచించారు. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు హైవేపై రోడ్డు దాటకుండా వీలుంటుందన్నారు. తపోవనం కూడళి వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, క్యాట్ ఐ స్, లైటింగ్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ గారితో పాటు డి.టి.సి వీరరాజు, అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశులు, సి.ఐ లు వెంకటేష్ నాయక్, శ్రీహర్ష, శేఖర్, రఘుప్రసాద్, తదితరులు వెళ్లారు.
తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని కాకుటూరు, బొంతవారిపాలెం మరియు పోకూరు గ్రామాలలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం వలన దెబ్బతిన్న పంటలను మంగళవారం మండల వ్యవసాయాధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి అనసూయ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈ వెంకటేష్ రైతులతో కలిసి పంటలను సందర్శించి పరిశీలించారు. శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం మినుము పంట పూత, పిందె దశలో ఉందని వర్షాల కారణంగా నీరు నిలబడకుండా కాలువలు తీసుకొని బయటకు పంపాలని కోరారు. చల్లని వాతావరణం వలన బూడిద తెగులు రాకుండా మైక్రో బుటానిల్ 1.0 గ్రామ్ ఒక లీటర్ నీటికి లేదా అమిస్టర్ టాప్ 0.5 మి. లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని, పల్లాకు తెగులు నివారణకు తెల్ల దోమ మందు అసెటమి ప్రైడ్ లేదా థయో మేథోజైమ్ 0.2 గ్రామ్ మరియు వేప నూనె 5 మి. లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని , ఆకు మచ్చ తెగులు నివారణకు మాన్కోజెబ్ 2.5గ్రామ్ మరియు సాఫ్ 2.5 గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. అలాగే అగ్రోమిన్ మాక్స 2.5 గ్రామ్ మరియు 19:19:19 లేదా 13:0:45 పొడి ఎరువు 5గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు, పొగాకు పొలం నాటు నుండి ఎదుగుదల దశలో ఉంది కావున పల్లపు ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని, తెలియజేసారు.వడలిపోయి వేరు తెగులు ఆశించిన పొలాల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 2.0గ్రాములు లీటర్ నీటికి మరియు ప్లాంటోమైసిన్ 1గ్రామ్ లీటర్ నీటికి కలిపి మొక్కల వేరు భాగంలో పోయాలని,తోటలు పాలిపోయినట్లు అయితే 13:0:45 ఒక కేజి ఎకరానికి పిచికారి చేయాలి అని,వర్షాలు ఆగిన తర్వాత పొటాషియం సల్ఫేటు 1కేజి ఎకరానికి చొప్పున రెండు సార్లు పిచికారి చేయాలి అని తెలియజేసారు. వరి పంట లో నీరు నిలబడకుండా కాలువలు తీసుకొని బయటకు పంపాలని తెలిపారు. కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి అనసూయ మాట్లాడుతూ రైతులందరూ కూడా మినుము పంటకు పంటల భీమా తప్పనిసరిగా చేసుకోవలసినదిగా తెలిపారు రైతు కట్టవలసినది ఎకరానికి 38 రూపాయలు మరియు శనగ పంటకు ఎకరానికి 56 రూపాయలు కట్టినట్లయితే అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గినట్లయితే భీమ వర్తిస్తుందని తెలిపారు బీమా కట్టుకోవలసిన వారు మీ గ్రామ రైతు సేవ కేంద్రం నందు సహాయ మరియు ఉద్యానవన సహాయకులను సంప్రదించి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నగదు చెల్లించి పంటలకు బీమా చేసుకోవలసినదిగా తెలపటమైనది ఈనెల డిసెంబర్ 15వ తేదీ చివరి రోజు కావున రైతులందరూ కూడా త్వరపడి సాగు చేసి ఉన్న మినుము మరియు శనగ పంటలకు భీమ చేసుకోవలసిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యానవన సహాయకులు వి. ఖాదర్బాషా మరియు బద్దిపూడి శికామణి, ఇంటూరి కోటేశ్వరరావు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, బొల్లి లేని లక్ష్మీనరసింహం, మక్కేనా వెంకటేశ్వర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ కార్పొరేషన్ నిధులపై ఈడీ సుబ్రహ్మణ్యం ని కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : బీసీ కార్పొరేషన్ నిధులు పై ఈడీ సుబ్రహ్మణ్యం ని మంగళవారం బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ కలిశారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ… అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి వెనకబడిన వర్గాలకు చేతివృత్తిదారులకు ఈ పేద కుటుంబాలకు నిధులు నిధులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీని అడగడం జరిగిందన్నారు. ఈడి మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతున్నాయి అని వస్తే మీకు వెంటనే తెలియజేస్తామన్నారు. నిధులు వచ్చిన వెంటనే రజక నాయి బ్రాహ్మ గొర్లు మేకల పెంపకదారులకు మేదర్లకు కుమ్మర్లకు చేనేత కార్మికులకు వడ్డెర్లకు స్వర్ణకారులకు గీత కార్మికులకు అణగారిన వర్గాలకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని డి జగదీష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య పాల్గొన్నారు.