Sunday, January 12, 2025
Home Blog Page 33

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ నేప‌థ్యంలో సంధ్య థియేట‌ర్‌లో మ‌ర‌మ్మ‌తులు

పాత సీసీ కెమెరాల‌ స్థానంలో అధునాత‌న‌మైన కొత్త సీసీ కెమెరాలు
గేట్ల‌కు బోర్డులు, మెట‌ల్ డిటెక్ట‌ర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటు

హైద‌రాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేట‌ర్‌లో ఈ నెల 4న ఃపుష్ప‌-2: ది రూల్ః ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ చ‌నిపోగా, తీవ్ర గాయాల‌తో ఆమె తొమ్మిదేళ్ల‌ కుమారుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సదరు థియేట‌ర్ య‌జ‌మానులు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. థియేట‌ర్ లోప‌ల‌, బ‌య‌ట పూర్తిగా మ‌ర‌మ్మ‌తులు చేయిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. దీనిలో భాగంగా పాత సీసీ కెమెరాల‌ను తొల‌గించి, వాటి స్థానంలో అధునాత‌న‌మైన కొత్త సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రెండు థియేట‌ర్ల (సంధ్య 70ఎంఎం, సంధ్య 35ఎంఎం) గేట్ల‌కు బోర్డులు, కొత్త గ్రిల్స్, మెట‌ల్ డిటెక్ట‌ర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా య‌జ‌మానులు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

జగన్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత

క్రిస్మస్ వేడుకల కోసం పులివెందులకు వెళ్లిన జగన్ వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజల నుంచి ప్రస్తుతం జగన్ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వినతుల స్వీకరణ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పులివెందుల నుంచి జగన్ రేపు బెంగళూరుకు తిరుగుపయనం కానున్నారు.
జీaస్త్రaఅ ్‌ూRజూ

వాజ్ పాయ్ శత జయంతి సందర్భంగా ఘన నివాళులు

భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్పేయి శత జయంతి సందర్భంగా అనంతపురం బిజెపి జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ రత్నమయ్య, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ గౌడ్, పార్లమెంటు కన్వీనర్ లలిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, సీనియర్ నాయకులు అల్లాడి రామచంద్రయ్య, కుళ్లాయప్ప,కొనకొండ్ల రాజేష్, గొంది అశోక్, శాంత కుమార్, చంద్రకళ, కొట్టం జయలక్ష్మి, సాకే శివశంకర్,ఇలియాజ్, రంజిత్, నాగరాజు, రాజేష్, మల్లోబులు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు

ఓబుల్ కొండ మృతిపై మంత్రి నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబు, బీజేపీ నాయకుడు డోలు రాజా రెడ్డి స్పందన..

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని 27వ వార్డులో ఓబుల్ కొండ (60) మృతిచెందిన విషాదకరమైన సమాచారం తెలుసుకున్న మంత్రి నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబు, మంత్రి కార్యాలయ సిబ్బంది, బీజేపీ నాయకుడు డోలు రాజా రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హరీష్ బాబు బాధిత కుటుంబాన్ని ఓబుల్ కొండ కుమారుడు వంశీ యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వంశీకి మెరుగైన వైద్యం చికిత్సలు పొందేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని అందుకు మా సహాయ సహకారాలను తప్పక అందిస్తామని తెలిపారు. అలాగే హరీష్ బాబు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులతో మాట్లాడి, బాధిత కుటుంబానికి పూర్తి సహకారం అందించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో డోలు రాజా రెడ్డి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించండి

– యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం; రక్తదానం సులువైనది, విలువైనది, మరువలేనిది. స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించండి, రక్తదాతలుగా సంసిద్ధులు కండి, రక్తదానం మనుషుల ప్రాణాలతో పాటు మానవతా విలువలను కాపాడుతుందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) ధర్మవరం జోన్ , ఆత్మీయ ట్రస్ట్, ధర్మవరం సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదానం ఆవశ్యకత గురించి ప్రజలందరికీ తెలియపరచే ఉద్దేశంతో ముద్రించిన కరపత్రాలను స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో స్థానిక నాయకులు, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులతో కలసి బుధవారం రోజున UTF జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, , సకల చంద్రశేఖర్, సాయి గణేష్, గడ్డం రామ్మోహన్, హరిశంకర్, వెంకట కిషోర్ మరియు ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు జశ్వంత్ , ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 27న విద్యుత్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా..

వైయస్సార్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచిన ఎన్డీఏ ప్రభుత్వానికి నిరసనగా విద్యుత్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల కేతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్సీపి నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాంరెడ్డి, చేనేత నాయకుడు కాచర్ల అంజి, తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు నడుమ ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ ఏర్పడి ఏడాది తిరగకుండానే, విద్యుత్ ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరచడం జరిగిందని వారు మండిపడ్డారు. ఇందుకు నిరసనగా పట్టణంలోని కాయగూర గల మార్కెట్ వద్ద గల విద్యుత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని వారు దుయ్య బట్టారు. విద్యుత్ ఛార్జీలను 15 వేల కోట్లు భారాన్ని పేద ప్రజలపై మోపడం అతి దారుణమని, దుర్మార్గమని వారు తెలిపారు. పెద్ద ఎత్తున పోరాటాలు సలిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, కే తా లోకేష్, మేడాపురం వెంకటేష్ ,బోయ రమాదేవి, గజ్జల శివ, బలం ఓబులమ్మ, వైయస్సార్ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు పురుషోత్తం, అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వార్డు ఇన్చార్జులు కత్తి కత్తి పెద్దన్న, కేశవరెడ్డి చౌడప్ప తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శతజయంతి వేడుకలు

ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శ్రద్ధ జయంతి వేడుకలను ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ బాబుతో పాటు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేష్, జింక చంద్రశేఖర్, తదితర సీనియర్ జూనియర్ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టిడిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రేమ కరుణ సేవకు ప్రతీక ఈ క్రిస్మస్ పండుగ అని నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జి మహేష్ చౌదరి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని గాంధీనగర్ లో టిడిపి పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు తాను నమ్మిన వారి కోసం బలిదానాలకు సైతం వెనుకాడని గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్ని అనుసరించి,ప్రేమ తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈర్ష ద్వేషాలను పూర్తిగా పక్కన పెట్టాలని పాపాలకు దూరంగా ఉండాలని క్రీస్తు సూచించిన మార్గాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి విజయ్ సారథి, పూల రామకృష్ణ,భాస్కర్ చౌదరి, ఏగినాటి రమణ, రాఘవ రెడ్డి మల్లెని పల్లి చంద్ర, అమర సుధాకర్, వాల్మీకి అశోక్, నారా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా ను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి – యం.యం.డి.ఏ.

విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల నరేష్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం చేపట్టిన కార్యక్రమానికి ధర్మవరం ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ (యం.యం.డి.ఏ) ద్వారా నాయకులు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అమిత్ షా ఫోటోల ప్రతులను కాల్చి పార్లమెంట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం వర్ధిల్లాలి, జోహార్ అంబేద్కర్ అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షాను భర్త రఫ్ చేసేంతవరకు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలను సలుపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సయ్యద్ రోషన్ జమీర్, ధర్మవరం నియోజక వర్గం అధ్యక్షుడు సయ్యద్ దాదా పిర్, ఖాదర్ వలీ, నబీ రసూల్, తపాల్ దాదాపీర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు ఇస్తున్నాం: అల్లు అరవింద్

దిల్ రాజుకు అంద‌జేసిన అల్లు అర‌వింద్, మైత్రి టీమ్
కిమ్స్ హాస్ప‌ట‌ల్ లో నేడు శ్రీతేజ్ కు ప‌రామ‌ర్శ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ాపుష్ప 2్ణ టీమ్ భారీగా సాయం అంద‌జేసింది.. ఈ ఘటనలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూసేందుకు బుధవారం అల్లు అరవింద్, సుకుమార్, నిర్మాత దిల్ రాజు హాస్పిటల్‌కు చేరుకున్నారు. శ్రీతేజ్‌ని పరామర్శించిన అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ అమౌంట్‌ని శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..ాాశ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు. అతనికి వెంటిలేటర్ తీసేశారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వనున్నాం. అల్లు అర్జున్ నుంచి రూ. కోటి రూపాయలు, ాపుష్ప 2్ణ నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ రూ. 50 లక్షల రూపాయలను మొత్తంగా రూ. 2 కోట్ల రూపాయలను ఎఫ్ డి సి చైర్మెన్ దిల్ రాజుకు అందచేయడం జరిగింది్ణ్ణ అని తెలిపారు.