Sunday, January 12, 2025
Home Blog Page 35

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌కు సంబంధించి త‌ప్పుడు పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసుల వార్నింగ్‌ !

ఘ‌ట‌నకు సంబంధించి త‌ప్పుడు పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న పోలీసులు
ఈ ఘ‌ట‌న‌పై నిజాల‌ను వీడియో రూపంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల ముందు ఉంచామ‌ని వెల్ల‌డి
పోలీసు శాఖను అప్ర‌తిష్ట‌పాలు చేసేలా పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌ ఘ‌ట‌నకు సంబంధించి త‌ప్పుడు పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తాజాగా హైద‌రాబాద్‌ పోలీసులు హెచ్చ‌రించారు. సంధ్య థియేట‌ర్‌కు హీరో అల్లు అర్జున్ రాకముందే తొక్కిస‌లాట చోటుచేసుకున్న‌ట్టు కొంద‌రు వీడియోలు పోస్టు చేసిన విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై నిజాల‌ను వీడియో రూపంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల ముందు ఉంచామ‌ని తెలిపారు. విచార‌ణ స‌మ‌యంలో ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేసే వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. పోలీసు శాఖను అప్ర‌తిష్ట‌పాలు చేసేలా పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే పోస్టుల‌ను గుర్తించిన పోలీసులు ఈ హెచ్చ‌రిక‌లు చేశారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న తాలూకు ఆధారాలు, స‌మాచారం ఉంటే త‌మ‌కు అందించాల‌ని పోలీసులు కోరారు. అలాగే సామాజిక మాధ్య‌మ‌ల్లో జ‌రిగే త‌ప్పుడు ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాంః అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రేమ, శాంతి, సద్భావన అనేవి క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలని చెప్పారు. ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని జగన్ చెప్పారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని అన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

రేపిస్టులు, హంతకులకు మరణశిక్షే.. క్షమించే ప్రసక్తే లేదన్న ట్రంప్

అత్యంత క్రూరమైన నేరస్థులకు మరణశిక్ష అమలు చేయడంలో తప్పులేదని, తాను బాధ్యతలు చేపట్టాక అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రేపిస్టులు, హంతకులకు మరణ శిక్ష అమలు చేయాలని ఆదేశిస్తానని చెప్పారు. సమాజంలో శాంతిభద్రతల పునరుద్ధరణ, ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంటానని, ఈమేరకు న్యాయశాఖకు ఆదేశాలు జారీ చేస్తానని ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్ చేశారు. మరణ శిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీలలో 37 మందికి బైడెన్ ఇటీవల శిక్ష తగ్గించారు. ఈ చర్యను ట్రంప్ తప్పుబట్టారు. ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగానే ఉండాలని తేల్చిచెప్పారు. అమెరికాలోని 50 రాష్ట్రాలలో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరో ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగతా రాష్ట్రాల్లో మరణశిక్ష అమలవుతోంది. అయితే, తోటి ఖైదీలను హతమార్చిన వారికి, బ్యాంకు దోపిడీల సమయంలో హత్యలు చేసిన వారికి మరణ శిక్ష విధిస్తున్నాయి. అయితే, శిక్ష అమలు మాత్రం అరుదుగా జరుగుతోంది. 1988 నుంచి ఇప్పటి వరకు 79 మందికి న్యాయస్థానాలు మరణశిక్ష విధించగా.. కేవలం 16 మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు. అందులోనూ ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయ్యాక ఆరు నెలలలోనే 13 మందికి మరణ శిక్ష అమలు చేశారు. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఖైదీల సంఖ్య 40 ఉండగా.. వీరిలో 37 మందికి తాజాగా బైడెన్ క్షమాభిక్ష ప్రకటించి, శిక్ష తగ్గించారు.

అతిశీ త్వరలోనే ఫేక్ కేసులో అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్

సీఎం అతిశీని అరెస్ట్ చేయడానికి ముందు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయన్న మాజీ సీఎం
మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానన్న ఆప్ చీఫ్
ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే ఓ ఫేక్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారని పేర్కొన్నారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ాఎక్స్్ణ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆప్ ప్రభుత్వ ఎజెండాను పట్టాలు తప్పించేందుకు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు చెప్పేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం పెడుతున్నట్టు చెప్పారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలపై గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఫేక్ కేసులో ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు. దానికంటే ముందు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయి్ణ్ణ అని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ఆప్ ప్రకటించింది. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన ాలాడ్లీ బెహ్నా యోజన్ణ పథకాన్ని సవరించి ామహిళా సమ్మాన్ యోజన్ణ పేరుతో ఆప్ ఓ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళకు రూ. 1000 అందిస్తుండగా, తాము అధికారంలోకి వస్తే రూ. 2,100 అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక, సంజీవని యోజన పథకంలో భాగంగా 60 ఏళ్లు, ఆపై వయసు కలిగిన ఢిల్లీ వాసుల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ఖర్చును భరిస్తుంది.

పీవీ సింధు రిసెప్ష‌న్‌లో సంద‌డి చేసిన‌ సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు..

ఈ నెల 22న పెళ్లి చేసుకున్న‌ పీవీ సింధు, వెంక‌ట ద‌త్త‌సాయి
భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 22న రాత్రి 11.20 గంట‌ల‌కు సింధు మెడలో వెంక‌ట ద‌త్త‌సాయి మూడు ముళ్లు వేశారు. ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. రాజస్థాన్‌లోని ఉద‌య్‌సాగ‌ర్ స‌ర‌స్సులో ఉన్న ర‌ఫ‌ల్స్ హోట‌ల్ ఈ వివాహ వేడుక‌కు వేదిక‌గా నిలిచింది.ఇక తాజాగా వీరి పెళ్లి రిసెప్షన్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, త‌మిళ స్టార్ హీరో అజిత్‌, న‌టి రోజా, సింగ‌ర్ మంగ్లీ సహా పలువురు ప్రముఖులు సందడి చేశారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు..

ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లోని స్థానిక కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించగా, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ఆలోచనాత్మకమైన వ్యాసాలు రచించడమే కాకుండా, సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా పోస్టర్లను రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించడం, సామాజిక బాధ్యతను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం అత్యవసరం అని,ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థులలో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి,” అని తెలిపారు.
పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. కరెస్పాండెంట్ నిర్మలా జయచంద్ర రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ నిర్మల జయచంద్రారెడ్డి, వ్యవస్థాపకులు రామిరెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా పాటలను గానం చేసిన వైనం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు. క్రిస్మస్ పండుగ క్రైస్తవులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ అని తెలిపారు. ఏసుక్రీస్తు పుట్టుక వాటి తర్వాత జరిగిన పరిణామాలను ప్రదర్శిస్తూ చేసిన నాటిక అందరిని ఆకట్టుకోవడం నిజంగా సంతోషదాయకమని తెలిపారు. విద్యార్థులు తెల్లని దుస్తుల్లో దేవదూతల్లాగా చక్కగా నృత్య ప్రదర్శన చేయడం జరిగిందని తెలిపారు. శాంతా క్లాస్ వేషధారణ క్రిస్మస్ ట్రీ అలంకరణ మొదలైన విశేష అలంకరణలు అందరిని ఆకర్షించాయని తెలిపారు. క్రిస్మస్ అనేది మతపరమైన సాంస్కృతిక పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సూర్య ప్రకాశ్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన పద్మశాలియా నూతన కమిటి

విశాలాంధ్ర ధర్మవరం : ఇటీవల నూతనంగా ఎన్నికైన శ్రీ బహుత్తమ పద్మశాలియ సంఘం కమిటీ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ మంత్రిని భారీ గజమాలతో సత్కరించారు మంత్రి కూడా నూతన కమిటీని అభినందిస్తూ కమిటీ సభ్యులను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, పుత్త రుద్రయ్య,జింక నాగభూషణం, బాల కుళాయప్ప లను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మశాలియ కుల సంఘం యొక్క ప్రాశస్త్యాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం పలు అంశాలపై మంత్రితో చర్చించారు. పద్మశాలియ కుటుంబాల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ బహుత్తమ పద్మశాలియ కుల బాంధవులు దాదాపు 200 మంది దాకా పాల్గొన్నారు.

ఆకర్షణీయంగా జరిగిన జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఆకర్షినియంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతు వేషంలో పొలముకు వెళ్లే దృశ్యం,రైతు చేసే పనులపై అవగాహన ను విద్యార్థులు కల్పించారు. రైతు వేషధారణ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. రైతు యొక్క జీవనశైలి వారు అహర్నిశలు కష్టపడి దేశానికి చేస్తున్న సేవలను వారు పడే శ్రమను ఎంతో చక్కగా విద్యార్థులు వివరించారు. రైతే రాజు అనే నాటిక అందరిని ఆకర్షించింది. అనంతరం కరెస్పాండెంట్ నిర్మలాదేవి మాట్లాడుతూ రైతు యొక్క కష్టాలను మనమందరము తెలుసుకోవాలని, వారికి అండగా ఉన్నప్పుడే మనకు ఆహారం లభ్యమవుతుందని తెలిపారు. తదుపరి రైతు యొక్క ప్రాముఖ్యత గూర్చి వివరించారు. రైతు పంటలు పండిస్తేనే ప్రజలందరూ కూడా తినే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున రైతును చిన్నచూపు చూడరాదని తెలిపారు. రైతు లేనిదే సమాజం లేదని తెలిపారు. కావున ప్రభుత్వం రైతులను మరింత దిశలో ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నిర్మలాదేవి,సభ్యులు సూర్య ప్రకాష్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

12న ఏపీయూడబ్ల్యూజే మహాసభ

విశాలాంధ్ర ధర్మవరం; 2025 జనవరి 12వ తారీకున ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ పేర్కొంది. ఇటీవలే జిల్లా కమిటీ తో పాటు ధర్మవరం డివిజన్ స్థాయి కమిటీ సభ్యులు మంత్రి సత్య కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో శ్రీ సత్య సాయి జిల్లా విస్తృత మహాసభ నిర్వహించనున్నామని అందుకు మీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా,డివిజన్ కమిటీలు అభ్యర్థించారు. అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించి జనవరి 12న మీరు తలపెట్టే మహత్కార్యానికి తప్పకుండా హాజరవుతారని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. వీరుతో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రి సవితమ్మ, ఐ ఎన్ పి ఆర్ మంత్రి పార్థసారధి, వీరితోపాటు జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరయ్యేలా తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా పాత్రికేయుల సమస్యలపై సానుకూలంగా స్పందించడం పట్ల పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాసభకు సహాయ సహకారాలు కూడా తమ వంతు ఉంటాయని పాత్రికేయుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ మహాసభ ఏర్పాట్లపై తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ రావును పాత్రికేయులు అభినందించారు. మంత్రి సత్య కుమార్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుల్లయ్య, బాబు,జిల్లా ఉపాధ్యక్షులు జై నందన్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఉద్దండం చంద్రశేఖర్, ధర్మవరం రెవెన్యూ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జానపాటి మోహన్, అజయ్ చౌదరి తోపాటు డివిజన్లోని అన్ని మండలాల వివిధ పత్రికల పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.