Sunday, January 12, 2025
Home Blog Page 36

ప్రజలు మెచ్చే విధంగా కూటమి పాలన సాగుతోంది.. శ్రీరామ్

పరిటాల శ్రీరామ్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

పార్టీలో అందరికీ తగిన ప్రాధాన్యం ఉంటుందన్న పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం ; కూటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పాలన సాగిస్తోందని.. అందుకే ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం మండల పరిధిలోని ఉప్పునేసినపల్లి పంచాయతీలోని గరుడంపల్లి గ్రామానికి పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన వార్డు మెంబర్ సాకే నాగరాజు, నరసింహులుతో పాటు 15కుటుంబాల వారు పరిటాల శ్రీరామ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో నాయకుల్ని శ్రీరామ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో ఉన్నన్ని రోజులు తమకు ఎలాంటి గుర్తింపు లేదని నాయకులన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి జరుగుతోందన్న కారణంతోనే పార్టీలో చేరామన్నారు. శ్రీరామ్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో కనీసం ఆ పార్టీ నాయకులకు కూడా స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. కేవలం ఎమ్మెల్యేలు వారి అనుచరులే బాగుపడ్డారన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఇక్కడ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తున్న గుర్తింపు చూసి ఇతర పార్టీల వారు టీడీపీలోకి వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రధాన్యత ఉంటుందని శ్రీరామ్ స్పష్టం చేశారు.

మంత్రిని కలిసిన పద్మశాలియా నూతన కమిటి

విశాలాంధ్ర -ధర్మవరం : ఇటీవల నూతనంగా ఎన్నికైన శ్రీ బహుత్తమ పద్మశాలియ సంఘం కమిటీ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ మంత్రిని భారీ గజమాలతో సత్కరించారు మంత్రి కూడా నూతన కమిటీని అభినందిస్తూ కమిటీ సభ్యులను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, పుత్త రుద్రయ్య,జింక నాగభూషణం, బాల కుళాయప్ప లను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మశాలియ కుల సంఘం యొక్క ప్రాశస్త్యాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం పలు అంశాలపై మంత్రితో చర్చించారు. పద్మశాలియ కుటుంబాల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ బహుత్తమ పద్మశాలియ కుల బాంధవులు దాదాపు 200 మంది దాకా పాల్గొన్నారు.

క్రికెట్లో ప్రతిభ చాటిన బాలికలు. కోచ్ రాజశేఖర్

విశాలాంధ్ర ధర్మవరం;; క్రికెట్లో బాలికలు చక్కటి ప్రతిభ చాటడం జరిగిందని రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ డి టి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా అనంతపురంలో ధర్మవరం అండర్-16 అమ్మాయిలు జట్టు, నార్పల అండర్-16 అమ్మాయిలు జట్టు తలపడ్డ గా ,ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 23.1 ఓవర్లలో 101 పరుగులకి అల్లౌట్ అయింది అన్నారు. ధర్మవరం జట్టు లోని హస్మిత 3 వికెట్లు, తేజు దీపిక 2 వికెట్లు పద్మతికి 2 వికెట్లు దక్కాయి అన్నారు.తదుపరి బ్యాటింగ్ చేసిన 102 పరుగుల లక్ష్యాన్ని ధర్మవరం జట్టు ఎలాంటి వికెట్లు కోల్పోకుండా ఛేదించింది అని తెలిపారు. ధర్మవరం జట్టులోని హస్మిత 44 పరుగులు, తేజు దీపిక 42 పరుగులు చేశారు. ధర్మవరం జట్టు10 వికెట్లు తేడాతో విజయం సాధించారు. గ్రామీణ బాలికల క్రికెట్ లీగ్ 2024 ఫైనల్స్‌కు చేరుకున్నదన్నారు..రేపు ఫైనల్స్ ధర్మవరం-16 బాలికల జట్టు ఏ ఎస్ ఏ-ఏ డి సి ఏ అండర్ -16 బాలికల జట్టు మధ్య జరుగుతాయి అని తెలిపారు. ప్రతిభ చాటిన బాలికలను వారు అభినందించారు. తదుపరి బాలుర విభాగంలో నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ధర్మవరంలో టి సి ఎ అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తలపడ్డగా ,ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టి సి ఎజట్టు 34.5ఓవర్లలో 120/10 చేసింది అన్నారు.ధర్మవరం జట్టులోని రాజా 3 వికెట్లు , కుందన్ 3 వికెట్లు సాధించడం జరిగిందన్నారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన ధర్మవరం జట్టు 31 ఓవర్లలో 121/7 పరుగులు చేయడంతో ధర్మవరం జట్టు 3 వికెట్లు తేడతో విజయం సాధించి రూరల్ బాయ్స్ క్రికెట్ లీగ్ 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించిందన్నారు.. తదుపరి మరుసటి రోజు అనంతపురంలోని ధర్మవరం-నార్పల మధ్య ఫైనల్స్ జరగనున్నాయి అని కోచ్ రాజశేఖర్ తెలియజేసారు. క్రికెట్లో సత్తా చాటిన బాలురులను కోచ్ రాజశేఖర్ అభినందించారు.

రైతు సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమైన చర్య

శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం: నూతన వ్యవసాయ మార్కెట్ చట్టమును తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను దగ్ధం చేసే కార్యక్రమాన్ని ధర్మవరం పోలీసులు అడ్డుకోవడం దారుణమైన చర్యాని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు రైతు సంఘం నాయకులు నిరసన తెలిపేందుకు వస్తే, ముందస్తు చర్యగా రైతు సంఘం నాయకులను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పులు చేస్తున్నా కూడా, మిన్నకుండా ఉండడం ఎలా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ రైతులను కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, అటువంటి రైతుల సమస్యలను పట్టించుకోవాలన్న తపన ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఏది ఏమైనా నూతన వ్యవసాయ చట్టాన్ని తొలగించేంతవరకు పోరాటాలు ఆపమని, జిల్లా తరఫున ఎల్లప్పుడూ పోరాటాలు సలుపుతూనే ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.

రైతు సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమైన చర్య

శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:; నూతన వ్యవసాయ మార్కెట్ చట్టమును తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను దగ్ధం చేసే కార్యక్రమాన్ని ధర్మవరం పోలీసులు అడ్డుకోవడం దారుణమైన చర్యాని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు రైతు సంఘం నాయకులు నిరసన తెలిపేందుకు వస్తే, ముందస్తు చర్యగా రైతు సంఘం నాయకులను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పులు చేస్తున్నా కూడా, మిన్నకుండా ఉండడం ఎలా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ రైతులను కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, అటువంటి రైతుల సమస్యలను పట్టించుకోవాలన్న తపన ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఏది ఏమైనా నూతన వ్యవసాయ చట్టాన్ని తొలగించేంతవరకు పోరాటాలు ఆపమని, జిల్లా తరఫున ఎల్లప్పుడూ పోరాటాలు సలుపుతూనే ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.

స్వచ్ఛ ధర్మవరమే”లక్ష్యం….

మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం మున్సిపాలిటీ ప్రాంతాన్నిఅతి సుందరంగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యం అని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ధర్మవరం మండలంలోని తుమ్మలపల్లి – గ్రామంలో సుమారు రూ . 2 కోట్ల 23 లక్షలతో నూతన నూతనంగా డంప్ యార్డ్ నిర్మాణానికి సంబంధించి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ధర్మవరం పురపాలక సంఘం సంబంధించిన వర్మి కంపోస్టు గత 8 సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉందని ప్రస్తుతం మరమ్మత్తుల పనులు పూర్తిచేసి నేడు పునః ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. తద్వారా పురపాలక సంఘానికి ఒక సంవత్సర కాలంలో 90 రోజులకు 40 టన్నుల దాకా సేంద్రియ ఎరువు తయారుతోపాటు ఒక సంవత్సర కాలానికి రూ.14 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ధర్మవరం పట్టణంలో ఒక రోజుకు 73 టన్నులు చెత్త ఉత్పత్తి జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. అలాగే వ్యక్తపదార్థాల సేకరణ కేంద్రం (ఎంఆర్ఎఫ్) ద్వారా తడి , పొడి చెత్తలను వేరు చేయడం జరుగుతుందన్నారు. ధర్మవరం ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమని స్వచ్ఛ ధర్మవరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలు విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉదార భావం కలిగిన వారందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. సమిష్టి కృషితో ధర్మవరం పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. చెత్త నుండి సంపద సృష్టించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు పురపాలక సంఘం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశుద్ధ నీటి కారణంగా, దోమల వల్ల డేంగి డయోరియా, మలేరియా తదితర విష జ్వరాల బారిన పడకుండా ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం నీటి ట్యాంకులను శుభ్రం కూడా చేయలేకపోయిందని 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిందని వారు విమర్శించారు. రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువులు అందించే క్రమంలో ఆ చెత్త నుంచే సంపద సృష్టించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర ,రాష్ట్ర పథకాల ప్రజలు అవగాహన కలిగి అర్హులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జన వికాస్ యోజన, అమృత్ తదితర పథకాల అమలు అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగ ,సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పురపాలక సంఘం అధికారులు కాలువల్లో మురికి నీరు , రోడ్లపై చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు
ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, రాష్ట్ర జనసేన నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ర్ ప్రమోద్ కుమార్ , తదితరులు పాల్గొని ప్రసంగించారు.

మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి.

ధర్మవరం పురపాలక సంఘం కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కా చర్ల శ్రీలక్ష్మి తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజెండా మేరకు ధర్మవరం పురపాలక సంఘం 20 24-25 సంవత్సరంలకు సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలు , 2025-26 సంవత్సరమునకు తయారు చేయబడిన బడ్జెట్ అంచనాలు మంత్రి మరియు కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో ఆమోదించారు.
20 24 – 25 సవరణ బడ్జెట్ రూ. 4, 98, 27, 6 0 6 కాగా
20 25 – 26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూ. 41,00000 మిగులు బడ్జెట్ కాగా, 2025 – 26 సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ రాబడి వసూళ్లు రూ. 49, 32, 55, 287 అలాగే మూలధన వసూళ్లు రూ. 26, 60, 00000 లు, రాబడి ఖర్చు రూ. 45, 15, 92, 410 లు, మూలధన ఖర్చులు రూ. 30, 35, 62, 8 7 7 లను సమావేశంలో ఆమోదించారు.
పలువురు వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ , మేనేజర్ రాజేశ్వరి బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

కమ్యూనిజం వందేళ్ళ పోరాటాల త్యాగాలు ప్రత్యేక సంచికను విడుదల చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, శత వార్షికోత్సవాల సందర్భంగా కమ్యూనిజం వందేళ్ళ పోరాటాల త్యాగాలు ప్రత్యేక సంచికను సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ విడుదల చేశారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో సింగనమల నియోజకవర్గం,బుక్కరాయసముద్రం మండల కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి చిన్న తిరుపతయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి జాఫర్ మాట్లాడుతూ… డిసెంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అందులో భాగంగా కార్యచరణ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం రావాలని పిలుపునిచ్చినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. దేశవ్యాప్తంగా కష్టజీవులు, శ్రమజీవులు తరపున నిలబడినటువంటి పార్టీ అని తెలిపారు. 26వ తేదీన అన్ని శాఖల వారీగా ప్రతి నియోజకవర్గ, మండల స్థాయిలో సిపిఐ జెండా పతావిష్కరణ చేసి ర్యాలీ, సభలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు గత ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వలేకపోయారని గత ఎన్నికల్లో టిడిపి పార్టీ పట్టణాల్లో రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణానికి గాను ఐదు లక్షల ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కరెంటు చార్జీలు 15 వేల 484 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేస్తోందన్నారు. ట్రూ అప్ చార్జీల పేరుతో 6 వేల 72 కోట్లు , సర్ చార్జీల పేరుతో 9 వేల 412 కోట్లు ప్రజలపై పన్ను భారం మోపుతున్నారు అన్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని ఉపసంహరించుకునేంతవరకు కమ్యూనిస్టు పార్టీ జనవరి మాసంలో ఉదృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రజలపై భారం పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు నిరసన కార్యక్రమాలలో మేధావులు, కార్మిక, రైతులు, వ్యాపార వాణిజ్య వ్యాపారస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగనమల్ల మండల నియోజకవర్గం కార్యదర్శి టి. నారాయణస్వామి, బుక్కరాయసముద్రం, మండల సిపిఐ కార్యదర్శి, ఎర్రి స్వామి, శాఖా కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

హోలీ స్పిరిట్ ఒలీవా మినిస్ట్రీస్ ప్రార్ధన మందిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

సింగమనేనిపల్లె గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం ముట్లూరి నతానియేలు ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన హోలీ స్పిరిట్ ఒలీవా మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరావు పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా క్యాండిల్స్ వెలిగించి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. శాంతికి చిహ్నమైన క్రిస్మస్ పండుగను క్రిస్టియన్ సోదరులందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తోట వెంకటేశ్వర్లు, బత్తిన మాల్యాద్రి, గోచిపాతల మోషే, కసుకుర్తి నవరత్నం, దువ్వూరి రమేష్, గౌడపేరు ప్రసాదరావు గౌడపేరు అనిల్ బాబు, కట్ట శ్రీనివాసులు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సెమినార్ రూమ్‌లో అత్యాచారం, హత్య జరిగినట్టుగా ఆధారాలు దొరకలేదన్న సీఎఫ్ఎస్ఎల్ నివేదిక..

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో సంచలన నివేదిక
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం కేసులో నమ్మశక్యంకాని విషయాలు వెలుగుచూశాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన నాలుగవ అంతస్తులోని సెమినార్ రూమ్‌లో అత్యాచారం, హత్య జరిగినట్టుగా ఆధారాలు దొరకలేదని సీఎఫ్‌ఎస్ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ లేబోరేటరీ) నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చునని సందేహాలు వ్యక్తం చేసింది. సెమినార్ గదిలోని నీలి రంగు పరుపుపై వైద్యురాలు, దాడికి పాల్పడ్డ వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగినట్లు ఆధారాలు కనిపించలేదని నివేదిక విశ్లేషించింది. రూమ్ లోపల మరెక్కడా ఆనవాళ్లు లేవని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ సీబీఐకి ‌సీఎఫ్ఎస్ఎల్ ఇటీవలే నివేదికను సమర్పించింది. కాగా, ఈ ఏడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్‌ డాక్టర్‌‌ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం తొలుత విచారణ చేపట్టింది. ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది.

కేసీఆర్‌, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊర‌ట‌

మేడిగ‌డ్డ బ్యారేజీ పిల్ల‌ర్‌ కుంగుబాటు కేసు
మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగుబాటు విష‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు భూపాల‌ప‌ల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైకోర్టు స‌స్పెండ్ చేసింది. జిల్లా సెష‌న్స్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలు స‌రిగా లేవ‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హ‌రీశ్‌రావు కార‌ణ‌మంటూ జిల్లా కోర్టులో పిటిష‌న్ వేసిన రాజ‌లింగ‌మూర్తికి న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది.

ఈ అంశంలో జిల్లా కోర్టుకు విచార‌ణ ప‌రిధి లేద‌ని కేసీఆర్‌, హ‌రీశ్‌రావు త‌రఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇంత‌కుముందు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల‌ను న్యాయ‌వాది గుర్తు చేశారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు భూపాల‌ప‌ల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. తదుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 7వ తేదీకి వాయిదా వేసింది.