Monday, January 13, 2025
Home Blog Page 37

సంధ్య థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు

చిక్కడపల్లి పీఎస్ లో అల్లు అర్జున్ ను విచారిస్తున్న పోలీసులు
బన్నీ ముందు పోలీసులు 50 ప్రశ్నలు ఉంచినట్టు సమాచారం
న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసుల విచారణకు సీనీ నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ రాజశేఖర్ రెడ్డి సినీ నిర్మాత బన్నీ వాసు కూడా పీఎస్ కు వచ్చారు. అల్లు అర్జున్ ను డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, సెంట్రల్ జోన్ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. బన్నీ ముందు 50 ప్రశ్నలను ఉంచినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరుగుతోంది. చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. రాత్రి 9.30 గంటల నుంచి అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందనే సమాచారాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా పోలీసులు రాబట్టాలనుకుంటున్నారు.
Aశ్రీశ్రీబ Aతీjబఅ ుశీశ్రీశ్రీవషశీశీస

విచార‌ణ‌కు హాజ‌రైన అల్లు అర్జున్…

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణకు హీరో అర్జన్ నేడు హాజరయ్యారు.. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం నుంచి న్యాయవాదిలో కలసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.. టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి.. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. పుష్ప మూవీ హీరో అల్లుఅర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరుకావాలంటూ నోటీస్ పంపారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు.

హనియేను మేమే హతమార్చాం.. వారి తలలు కూడా తెగ్గోస్తాం: హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్

హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యపై ఇజ్రాయెల్ తొలిసారి పెదవి విప్పింది. అతడిని చంపింది తామేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తొలిసారి బహిరంగ ప్రకటన చేశారు. ఇరాన్‌లో ఈ ఏడాది జులైలో హనియే హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్‌పై ఇటీవలి కాలంలో హౌతీ ఉగ్రవాద సంస్థలు క్షిపణులు ప్రయోగిస్తున్నాయని పేర్కొన్న మంత్రి.. తాము హమాస్‌ను, హిజ్బుల్లాను ఓడించామని, ఇరాన్ రక్షణ వ్యవస్థ, దాని ఉత్పత్తి వ్యవస్థను దెబ్బతీశామని చెప్పారు.సిరియాలో అసద్ పాలనను పడగొట్టామని కట్జ్ పేర్కొన్నారు. యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల ఆట కట్టించామని కట్జ్ చెప్పుకొచ్చారు. వారి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని, హనియా, సిన్వర్, నస్రల్లా మాదిరిగానే హొడీడా, సానాలోని వారి నేతల తలలు తెగ్గోస్తామని కట్జ్ హెచ్చరికలు జారీచేశారు.

బిల్ క్లింటన్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వాషింగ్టన్ లోని జార్జ్ టౌన్ యూనివర్శిటీ మెడికల్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైట్ హౌస్ నుంచి నిష్క్రమించిన తర్వాత బిల్ క్లింటన్ అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 2004లో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. దీని కారణంగా ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. 2005లో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. 2010లో కరోనరీ ఆర్టరీలో స్టెంట్ అమర్చుకున్నారు. ఆ తర్వాత బిల్ క్లింటన్ ఎక్కువగా శాకాహారాన్ని తీసుకుంటున్నారు. దీని కారణంగా బరువు తగ్గడంతో, ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. తాజాగా ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.

ప్రజల సౌకర్యార్థం రవాణా సేవలు .. మంత్రి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం; ప్రజలకు రవాణా శాఖ ద్వారా సేవలన్నీ సులభతరంగా అందించాలన్న ధ్యేయంతో ధర్మవరం మార్కెట్ యార్డ్ ప్రాంతంలో రవాణా శాఖ విభాగం ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖల మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం మార్కెట్ యార్డులో రవాణా శాఖ ఏర్పాటుచేసిన ఆన్లైన్ సేవలను మంత్రి ప్రారంభించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కరుణాసాగర్, కదిరి ఎం .వి.ఐ వరప్రసాద్ , ధర్మవరం ఎం.వి.ఐ రాణి, ఆర్డీవో మహేష్ ధర్మవరం తెలుగుదేశం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ , రాష్ట్ర జనసేన నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి , ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాహనాల కు సంబంధించి లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఎల్ ఎల్ ఆర్, ఫిట్నెస్, పర్మిట్లు మంజూరు తదితర సర్టిఫికెట్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ప్రజలు రవాణా శాఖ ద్వారా సేవలు పొందాలంటే హిందూపురం ,అనంతపురం, కదిరి ప్రాంతాలకు వెళ్లే వారిని ప్రస్తుతం 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించే శ్రమను తగ్గించి ప్రస్తుతం తాత్కాలికంగా రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి , రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు అవసరమైన మేరకు రవాణా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలో అనేక పరిపాలన నిర్మాణాత్మకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శాశ్వత రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేయుటకు ఆర్డిఓ ,రవాణా శాఖ అధికారి ద్వారా భూసేకరణకు సంబంధించి ప్రతిపాదన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల కాలంగా రవాణా శాఖ కార్యాలయం లేని కారణంగా ప్రజల సమస్యలను గుర్తించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి ధర్మవరం పట్టణంతోపాటు రాప్తాడు నియోజకవర్గం లోని రామగిరి, సి.కే.పల్లి, కనుగానపల్లి మండల ప్రజానీకానికి కూడా ప్రమాణ శాఖ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అందువల్ల ఈ ఆరు మండలాలకు సంబంధించిన ప్రజలు ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతేగాక చెరువులకు నీరు పటలకు సాగునీరు జలజీవన్ మిషన్ పనులు తదితర కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మరి ముఖ్యంగా పట్టణ గ్రామాలలో గుంతలు లేకుండా రహదారుల నిర్మాణం కోసం సుమారు రూ.26 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని సుమారు రూ. 70 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పెట్రోల్ ,డీజిల్ ఆదా చేసే క్రమంలో ఎలక్ట్రానిక్ వాహనాలు కూడా ప్రభుత్వం ద్వారా వాడుకలో రానున్నాయని మంత్రి తెలిపారు.

కంచల మేజర్ కాలమును పరిశీలించిన డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్…

విశాలాంధ్ర నందిగామ:-సాగర కాలవలు అభివృద్ధి చేసి రైతులకు అండదండగా నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖరరావు అన్నారు సోమవారం నందిగామ డిసి టు పరిధిలో గల కంచల మేజర్ ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమని అన్నారు స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య సహకారంతో నందిగామ కంచల మేజర్ రైతులకు పూర్తిస్థాయిలో అండదండగా ఉంటామని అన్నారు త్వరలోనే కంచల మేజర్ కంచ తొలగించే పనులను ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు గత ప్రభుత్వం అప్పులు తెచ్చి కుప్పలుగా అప్పులు మిగిల్చి అరకొర పేద ప్రజలకు ఆశ చూపి అభివృద్ధిని అటకెక్కించారని దానికి ప్రత్యేక నిదర్శనమే సాగర్ కాలవలని అన్నారు సాగర్ కాలువలతో పాటు పిల్ల కాలవల్లో సైతం ఒక్క తట్ట మట్టి తీసిన పాపాన ఎక్కడా పోలేదని అన్నారు కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ నాగరాజు, చందాపురం మైనర్ డబ్ల్యూ ఏ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, టీ సి నెంబర్లు వేజెండ్ల నరసింహారావు,రాటకొండ వెంకటేశ్వర్లు రైతులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు…

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోండి

తహశీల్దార్ బి. సుదర్శన రావు
విశాలాంధ్ర – నెల్లిమర్ల : ప్రజలకు, రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బి. సుదర్శనరావు పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని వల్లూరు, పెదతరిమి గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని. అవి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతోంద న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐపి.వేణుగోపాల్
ఎం ఎస్ దివ్య మానస, ఆర్ ఎస్ డి టి సత్యనారాయణ, వి ఆర్ ఓ గోవిందరావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు .

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోండి

తహశీల్దార్ బి. సుదర్శన రావు
విశాలాంధ్ర – నెల్లిమర్ల : ప్రజలకు, రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బి. సుదర్శనరావు పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని వల్లూరు, పెదతరిమి గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని. అవి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతోంద న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐపి.వేణుగోపాల్
ఎం ఎస్ దివ్య మానస, ఆర్ ఎస్ డి టి సత్యనారాయణ, వి ఆర్ ఓ గోవిందరావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు .

పొలం బాట పట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

0

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా): మండల కేంద్రంలోని స్థానిక నారాయణ ప్రైమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సోమవారం పొలం బాట పట్టారు. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా చొక్కనహళ్లి గ్రామం సమీపంలోనే రైతు ఈరన్న తోటలో విద్యార్థులు రైతుల వేషాదారణలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతులతో వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, వివిధ పంటల గురించి, పంటల మార్పిడి గురించి, ఎరువుల వాడకం, తదితర అంశాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం నారాయణ పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆచారి మాట్లాడుతూ భారతదేశం యొక్క ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి జ్ఞాపకార్థం ఈ రోజును జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని తెలిపారు. రైతులేనిదే రాజ్యంలేదని, ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలే అందరికి ఆహారంగా వస్తున్నాయని, దేశానికి రైతు వెన్నుముఖ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్, అకాడమిక్ డీన్ నిజం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఏపీ ఆటో వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఏ మల్లికార్జున

అనంతపురం విశాలాంధ్ర : ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఏ మల్లికార్జున సోమవారం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో ఫైన్లను పెంచుతూ విడుదల చేసిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని, డ్రైవర్ల సాధికారత సంస్థ ఏర్పాటు చేసి సంవత్సరానికి రూ.15 వేలు పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రస్తుతం పోలీసు ఆర్టిఏ దాడులు ఎక్కువయ్యాయని దాడులు తగ్గించాలని ఎమ్మెల్యే ని కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్, నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, ఆటో యూనియన్ అధ్యక్ష ఉప ప్రధాన కార్యదర్శిలు రాజు, కృష్ణా నాయక్,రహంతుల్లా, భాష తదితరులు పాల్గొన్నారు.