Monday, January 13, 2025
Home Blog Page 40

సహనం కోల్పోయా.. క్షమించండి: సీవీ ఆనంద్

సంధ్య థియేటర్ ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను సహనం కోల్పోయానని చెప్పారు. ఈ ఘటనపై జాతీయ మీడియాకు క్షమాపణ చెబుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనకు జాతీయ మీడియా మద్దతిస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకుంటున్నట్లు చెప్పారు. రేవతి మరణం, థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి నిజానిజాలు వెల్లడించేందుకు ఆదివారం పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. నేషనల్‌ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తోందని అన్నారు. దీనిపై అక్కడ ఉన్న జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడంతో సీవీ ఆనంద్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. ారెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశాను. నేను కాస్త సంయమనం పాటించాల్సింది. నేను చేసిన పొరపాటు గుర్తించి నేషనల్ మీడియాకు సారీ చెబుతున్నా్ణ అంటూ ట్వీట్ చేశారు.

ఘ‌నంగా పీవీ సింధు వివాహం

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉద‌య్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు ఘ‌నంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె ఏడ‌డుగులు వేసింది. ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉద‌య్‌సాగ‌ర్ స‌ర‌స్సులో ఉన్న ర‌ఫ‌ల్స్ హోట‌ల్ ఈ వివాహ వేడుక‌కు వేదిక‌గా నిలిచింది. పెళ్లి ఫొటోల‌ను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుద‌ల చేయ‌లేదు. రేపు హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

పేదల పెన్నిధి వైయస్ జగన్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, ప్రతి రైతుకు లబ్ధి చేకూరిందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. జగన్ పరిపాలన పేదల పక్షాన నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, వైసీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రవిచంద్రా రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, గ్రామ సర్పంచులు చంద్రశేఖర్, ఇస్మాయిల్, నాయకులు శివరామిరెడ్డి, ముక్కరన్న, అర్లప్ప, గాదిరెడ్డి, మూకిరెడ్డి రెడ్డి, హనుమంతు,ఈరన్న, కామయ్య, భీమన్న, మహాదేవ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

నకిలీ మహిళా సంఘాల పేరిటన 80 లక్షల స్వాహా…

ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ జ్యోష్ణ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో కొంతమంది నకిలీ (బోగస్) మహిళా సంఘాలను నిర్వహిస్తూ, ఓవర్సీస్ బ్యాంకులో 80 లక్షలకు పైగా రుణాలను తీసుకొని మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగానే బ్యాంకు మేనేజర్ జోష్నా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో టౌన్ మిషన్ కోఆర్డినేటర్ బండి వెంకటేష్, రిసోర్స్ పర్సన్స్ శోభారాణి, కొండమ్మ పై ఫిర్యాదు చేశారు. 80 లక్షల వరకు రుణం తీసుకోవడం జరిగిందని పై తెలిపిన వారిపై వెంటనే కేసు నమోదు చేసుకుని న్యాయం జరగాలని ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారు. అనంతరం వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నకిలీ మహిళా సంఘాలను సృష్టించి, రుణాలు ఇప్పించిన వ్యక్తులపై త్వరితగతిన విచారణ చేపట్టి న్యాయం జరిగేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి

అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర అనంతపురం : ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని ఫస్ట్ రోడ్, శివాలయంలోని ధ్యాన మందిరంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారత దేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, ధ్యానం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నారు. ధ్యాన విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, చిన్నతనం నుంచే పిల్లలకు కూడా అలవాటు చేయాలని, మనసును, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు 1 గంటైనా ధ్యానం కోసం కేటాయించాలని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనశ్శాంతి కనిపించడం లేదని, ధ్యానం వలన అనేక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యం బాగుంటుందని, సర్వరోగ నివారణగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ సమస్త డాక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉండి, మనిషి ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, వివేకానంద యోగా కేంద్రాల గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మ విశ్వకుమారి సమస్త ప్రతినిధులు శారద, వివేకానంద యోగా కేంద్రం అర్ట్స్ కళాశాల సెంటర్ ఆంజనేయులు, హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, పతంజలి యోగ సమితి, సత్యసాయి ధ్యాన మండలి, శ్రీ రామ కృష్ణ సేవా సమితి, ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, ఆర్ట్ ఆప్ లివింగ్ ఈషా ఫౌండేషన్, ధ్యాన సంస్థ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ ప్రాణాయామ మరియు ధ్యానం చేయించారు. దివాకర్, ఆంజనేయులు, పుల్లయ్య, తారక్, శ్రీనివాసులు శెట్టి, చెన్నకేశవులు, రవి, శ్రీధర మూర్తి, ఇషా రవి మొదలగు అనేకమంది కార్యక్రమంలో పాల్గొని యోగ విశిష్టతను, నేటి సమాజ అవసరమని అనేక విషయాలను తెలియజేశారు.

నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ..

శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం:; ప్రస్తుతం పట్టణంలో చలి అధికంగా ఉండటం వల్ల ఎంతోమంది నిరాశ్రయులు చలికి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ, దాతల కోసం ఎదురుచూస్తున్న రు. అటువంటి తరుణంలో ఈ విషయాన్ని గమనించిన పట్టణంలోని గాంధీ నగర్ లో గల శ్రీ సత్య సాయి సేవ సమితి శుక్రవారం రాత్రి దాదాపు 30 మంది నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పలు ప్రాంతాలలో ఉన్న అనాధలకు, యాచకులకు దగ్గరుండి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారాలతో చేయడం మాకెంతో సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నలుగురు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం, డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం

విశాలాంధ్ర -అనంతపురం : డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం, డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ పలు తీర్మానాలు చేయడం జరిగినది.
ముఖ్యంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం , జిల్లాలో పగడ్బందీగా అమలుపరిచే విధంగా యంత్రాంగం పలు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ఈ చట్టంపై ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతను తెలియపరచాలని రైల్వే స్టేషన్లో ,బస్టాండ్ లో మొదలగు జన సంచార ప్రదేశాలలో ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ లు ఏర్పాటు చేయాలని అలాగే సచివాలయం ,అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తీర్మానించారు.ఇంటర్ స్టేట్ కర్ణాటక సరిహద్దు జిల్లాల అధికారులతో, కోఆర్డినేషన్ మీటింగ్ జరపాలని తద్ ద్వారా అన్ని ప్రాంతాలలో లింగ నిర్ధారణ జరగ కుండ తగు చర్యలు చెప్పట్టాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ,మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఈ చట్టం ఫై అవగాహన కోసం బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జూనియర్ కళాశాలలో పాఠశాలలో కూడా వైద్య సిబ్బంది ఈ చట్టం పై అవగాహన కల్పించాలని అన్నారు.
స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి యాజమాన్యం. డాక్టర్స్ ఎట్టి పరిస్థితులలోనూ లింగ నిర్ధారణ పరీక్షలు జరపకూడదని చట్టం అతిక్రమించినచో చర్యలు తీసుకుంటామన్నారు. లింగ నిర్ధారణ కోసం ప్రయత్నించిన, లేదా ప్రోత్సహించిన అట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశం లోcప్రోగ్రాం అధికారులు డా సుజాత, డా యుగంధర్, డా అనుపమ, డా రవిశంకర్, సర్వజన ఆస్పత్రి చిన్నపిల్లల నిపుణులు డా రవికుమార్, స్త్రీ విభాగం నిపుణులు డా నిస్సార్ బేగం,,, డా ప్రసన్న భారతి, పేతాలజిస్ట్, డా లక్ష్మి ,డిపిఆర్ఓ గురుమూర్తి, డెమో, త్యాగరాజ్, డిప్యూటీ హెఛ్ ఈ ఓ గంగాధర్, ఐసిడిఎస్, సి డి పి ఓ వెంకట కుమారి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , ఆర్డిటి డాక్టర్ దుర్గేష్, రెడ్స్ అనిత, హెడ్స్ రామ్మోహన్, ఆరోగ్య బోధకులు వేణు, వెంకటేష్, శ్రీకాంత్, లీగల్ అడ్వైజర్ , ఆషారాణి, తదితరులు పాల్గొన్నారు,

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన ధర్మవరం జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినిలు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల కదిరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి సెలక్షన్స్ లో జీవనజ్యోతి పాఠశాలకు చెందిన సీ.షర్మిల డి.సాహితి ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్టర్స్ సిస్టర్ సుజాత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులు ఈనెల 22 వ తేది నుంచి 23 వ తేది వరకు నెల్లూరులో జరిగే 53 వ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకుప్రాతినిధ్యం వహిస్తారు అని తెలిపారు. ఎంపికైన విద్యార్థినిలను పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత, ఉపాధ్యాయ ఉపాధ్యాని బృందం, బోధ నేతల బృందం, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఐ పి ఎస్ జి ఎం–24 నందు ధర్మవరం పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ

ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం ; ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ రీజనల్ మీట్-24 నందు ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతిభను చాటారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 20 వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురం , సత్యసాయి అనంతపురం జిల్లాలోని 17 పాలిటెక్నిక్ విద్యార్టిని విద్యార్థుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించబడినది అని తెలిపారు.ఇందులో ధర్మవరం విద్యార్థులు వాలీబాల్, బాట్ మింటన్, చెస్ మహిళలు, 100 మీటర్ల, 200 మీటర్ల పరుగు పందెం లలో బంగారు పతకాలను సాధించారు అని తెలిపారు.జనవరి 28, 29, 30 తెదీలలొ విశాఖపట్నం లో జరిగే రాష్ట్రస్తాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.ఈ విద్యార్థులను ఆటలలో తర్ఫీదు ఇచ్చిన ఇంగ్లిష్ ఉపాధ్యాయులు రాజేష్ను, అలాగే అన్ని విధాల సహకరించిన అధ్యాపకులు హరిబాబు, జానకి, ఉమమహేశ్వరి, సుశీల, రాకేష్ లను ప్రిన్సిపాల్ , ఇతర అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. మండలంలో గవరవరం గ్రామ శివారులో ఉన్న మేఘాదేవినగర్లో ఆమె పర్యటించారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, సిసి రహదారులు, మంచినీటి సౌకర్యాలు సరిగా లేవని కాలనీవాసులు మేఘలాదేవికి తెలిపారు. మేఘలాదేవి సంబంధిత అధికారులకు చర్వాణి ద్వారా తెలియచేయుగా అధికారులు సానుకూలంగా స్పందిస్తూ కాలనీవాసుల సమస్యలను పరిష్కరించడానికి ఉన్నత అధికారులకు తెలియచేసి, సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. టిడిపి సభ్యత్వల నమోదును ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు చుక్కల శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.