Tuesday, January 14, 2025
Home Blog Page 43

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియామ‌కం

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా, ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ నీట్ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ప్రొఫెస‌ర్ మ‌ధుమూర్తి ఉన్నారు.గుంటూరు జిల్లా తెనాలి మండ‌లం జాగ‌ర్ల‌మూడికి చెందిన మ‌ధుమూర్తి విశాఖ‌ప‌ట్నంలో విద్య‌న‌భ్య‌సించారు. ప్ర‌స్తుతం హ‌నుమ‌కొండ‌లో ఉంటున్నారు. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజే అప్ప‌టి ఛైర్మ‌న్ హేమ‌చంద్రారెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. వైస్ ఛైర్మ‌న్ రామమోహ‌న్‌రావు ఇన్‌ఛార్జిగా కొన‌సాగుతున్నారు.

చాగంటికి మరో బాధ్యతను అప్పగించిన ఏపీ ప్రభుత్వం

విద్యార్థులు – నైతిక విలువల సలహాదారుగా చాగంటి నియామకం
ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన చాగంటి

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు పుస్తకాలు తయారు చేసే బాధ్యతను అప్పగించిన ప్రభుత్వం
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు – నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. కేబినెట్ హోదా కలిగిన ఈ బాధ్యతలను ఆయనకు ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలను స్వీకరించారు. తాజాగా చాగంటికి ఏపీ ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగించింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు చాగంటితో ప్రభుత్వం ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించి, విద్యార్థులకు పంపీణీ చేయనుంది. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు చాగంటికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు చాగంటి తెలిపారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నానని చెప్పారు. పదవుల కోసం తాను ఒప్పుకోలేదని… తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలని అన్నారు.

వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్.. ఆసక్తికర ట్వీట్

ఇవాళ (డిసెంబర్ 21) పుట్టిన రోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ధీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా సోషల్ మీడియాలో జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.ాావైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నాను్ణ్ణ అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. కాగా, జగన్ బర్త్‌డే వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. అభిమానులు కేక్‌ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఏపీలో మరోసారి భూకంపం.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు నమోదయాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్ల భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెప్పారు. ముండ్లమూరు ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసుల నుంచి జనాలు బయటకు పరిగెత్తారు. కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాలను భూకంపం భయపెట్టిన విషయం తెలిసిందే. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రత కలిగిన భూకంపం భయపెట్టిన విషయం తెలిసిందే. గోదావరి పరిసర ప్రాంతాలతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మెరుగుపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్యం

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కొడుకు శ్రీతేజ్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్న శ్రీతేజ కళ్లు తెరుస్తున్నాడట. డాక్టర్లకు స్పందిస్తున్నాడట. ట్యూబ్ ద్వారా చిన్నారికి ఆహారం అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు.

జెస్సీరాజ్ ఏపీకి గర్వకారణం: చంద్రబాబు

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ను ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ – 2025ః వరించింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. 14 ఏళ్ల జెస్సీరాజ్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపికైన జెస్సీరాజ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైన స్కేటర్ జెస్సీరాజ్ కు అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయాలు ఏపీకి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోబోతున్నారని తెలిపారు. 9 ఏళ్ల వయసులో ఆమె స్కేటింగ్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిందని… ఆమె పట్టుదల, అంకితభావం ఆమెను ఈరోజు గొప్ప గౌరవాన్ని అందుకునే స్థాయికి తీసుకొచ్చిందని కొనియాడారు. ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆమె ఒక స్ఫూర్తి అని చెప్పారు. ఇటీవల జరిగిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్స్ లో సోలో డ్యాన్స్ లో ఆమె సిల్వర్ మెడల్ సాధించారు.

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు

అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని… వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని చెప్పారు. అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఆదేశించారు.

శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాలుర హాకీ జట్ల ఎంపిక పోటీలు..

హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, హాకీ శ్రీ సత్యసాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాలుర హాకీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఏపీ హాకీ ఉపాధ్యక్షులు, హాకీ శ్రీ సత్య సాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ క్రీడా మైదానంలో ఎంపికైన సబ్ జూనియర్ బాలుర జట్టు హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జనవరి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు మదనపల్లిలో జరుగు సబ్ జూనియర్ హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జూనియర్ పోటీల వేదిక త్వరలో ప్రకటిస్తామని ఈ ఎంపిక పోటీలలో పాల్గొనుబోవు సబ్ జూనియర్ క్రీడాకారులు01-01-2009తర్వాత జన్మించి ఉండాలని, జూనియర్ క్రీడాకారులు 01-01-2006 తర్వాత జన్మించి ఉండాలని, క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ వెంట తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశమును ఆసక్తిగల హాకీ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సీతంలో బోధనేతరసిబ్బంది కోసం స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : బోధనేతర సిబ్బంది కోసం స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్‌షాప్ గురువారం సీతం సెమినార్ హాల్లో ప్రారంభించారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం, స్పోకెన్ ఇంగ్లీషుపై విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వృత్తిపరమైన, వ్యక్తిగత ఎదుగుదలలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను ప్రిన్సిపాల్ డా.డి.వి.రామమూర్తి తెలియజేస్తూ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కమ్యూనికేషన్ అంతరాలను తగ్గించడానికి, వారి పాత్రలలో ఎక్కువ సామర్థ్యాన్ని సాధించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉద్యోగులను ఎలా శక్తివంతం చేయగలవని తెలియజేశారు. మొదటిరోజు పరిచయ సెషన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఇందులో పాల్గొనేవారు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తమ ఆకాంక్షలు, సవాళ్లనుపంచుకున్నారు. ఫెసిలిటేటర్, ఎన్. సతీష్‌కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ &సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, రోల్-ప్లేలు, గ్రూప్ డిస్కషన్‌లు, పదజాలం-నిర్మాణ వ్యాయామాలతో సహా ఆకర్షణీయమైన కార్యకలాపాలను నిర్వహించారు. ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలు, ఉచ్చారణ మరియు కార్యాలయ దృశ్యాలలో సాధారణ పదబంధాలను ఉపయోగించడంపై దృష్టి కేంద్రీకరించబడింది.
బోధనేతర సిబ్బంది కోసం స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్‌షాప్ సందర్భంగా, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. శశిభూషణరావు నేటి వృత్తిపరమైన వాతావరణంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌లో ఇంగ్లీషు ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల వారి విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా సంస్థలో సున్నితమైన పరస్పర చర్యలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.పాల్గొనేవారు భాషా అభ్యాసానికి ఆచరణాత్మక విధానాన్ని అభినందిస్తూ ఇంటరాక్టివ్ ఫార్మాట్ గురించి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్త్ రఫ్ చేయాలి

సిపిఐ వందేళ్ళ వేడుకలు అన్ని శాఖల్లో సిపిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ
విశాలాంధ్ర విజయనగరం టౌన్ : రాజ్యసభ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే బర్త్ రఫ్ చేసి, జాతికి బేషరతుగా మోడీ, అమిత్షాలు క్షమాపణ చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్.
శుక్రవారం డి. ఎన్. ఆర్ అమర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒమ్మి రమణ మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టి, సంపదను అంబానీ ఆదానిలకు దోచిపెడుతూ ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో తినే తిండి పైన, కట్టుకునే బట్టపై ఆంక్షలు విదేస్తూ ప్రజల మధ్య వైశ్యామ్యాలు రెచ్చగొట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నదన్నారు. స్వతంత్ర సంస్థలైన సిబిఐ , ఈడి, ఎన్నికల కమిషన్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చలాయిస్తూ ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. నిన్నటి వరకు రాజ్యాంగం కంటే సనాతన ధర్మమే గొప్పది అనే దుష్ప్రచారానికి సంఘ పరివార్ ను మోడీ ప్రభుత్వం ఉసిగొల్పుతోందన్నారు. ఒకవైపు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ అధికారాన్ని చలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ భారత జాతి ముద్దుబిడ్డ, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను తలుచుకుంటే ఏమొస్తుంది అంటూ అవాకులు చెవాకులు పేల్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాటల వెనుక ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండా దాగి ఉన్నదన్నారు. మనసు నిండా మనువాదాన్ని నింపుకొని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించే బిజెపి నేతలకు రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. దేవుడు దైవం కలవారల సృష్టినని మనుషులంతా ఒకటేనని మను ధర్మ శాస్త్రాన్ని మంటల్లో తగలబెట్టి బుద్ధిజాన్ని స్వీకరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలను అమిత్ షా లాంటి ఆర్థిక నేరగాళ్లు ఆపలేరన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆదాని గ్రూపు కంపెనీల అవినీతి తప్పిదాల అశ్రిత పక్షపాత ధోరణిని, అవినీతి తప్పిదాలు క్రోనీ కాపీట లిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ హామీలు అమలు చేయాలని, ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ల సాధన కోసం సిపిఐ నిర్వహించే పోరాటాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు.
భారతగడ్డ పై భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) డిసెంబర్ 26 నాటికి వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న తరుణంలో జిల్లా వ్యాపితంగా అన్ని శాఖల్లో సిపిఐ జెండాలు ఎగుర వేసి సభలు, ర్యాలీలు నిర్వహించి ఘనంగా నిర్వహించాలనీ పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు ఉన్నారు.