Monday, May 12, 2025
Home Blog Page 5

అప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుక.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని అప్ప స్వామి నగర్ సంగమేశ్వరం రోడ్డు ధర్మవరం నందు వెలసిన అప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా అర్చకులు యంత్ర ప్రతిష్టాపన, బింబ ప్రతిష్ట హోమాలు, కామధేను, దర్పణ దర్శనం మహా కుంభాభిషేకం తదితర కార్యక్రమాలను వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకలకు విజయవంతం చేసిన వారందరికీ కూడా పేరుపేరునా ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల అప్ప స్వామి గురు పరంపర మందిర దేవస్థానం ఆలయ కమిటీ, భక్తాదులు, అప్ప స్వామి నగర్ ప్రజలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వేడుక.. శ్రీ షిరిడి సాయిబాబా సేవాసమితి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో వెలసిన సాయిబాబా ఆలయంలో జూన్ 5వ తేదీ గురువారం త్రిపుర సుందరీ సమేత చంద్రమౌలేశ్వర విగ్రహ ప్రతిష్ట, షిరిడి సాయిబాబా కు మహా కుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ నిర్వాహకులు తెలిపారు. జూన్ మూడవ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు మూడు రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రాణ ప్రతిష్టకు, ఆలయ నిర్మాణానికి మా కమిటీతో పాటు, పలువురు దాతలు విరాళాలు ఇచ్చి సహకరించినందుకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ట జరిగి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాయిబాబా వారికి మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమ వేడుకలను విజయవంతం చేయాలని వారు తెలిపారు.

పాకిస్తాన్ దాడుల్లో కాశ్మీర్లో మృతి చెందిన వారికి నివాళులు

మురళి నాయక్ వీర జవాన్ కి ఘన నివాళులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల కాశ్మీర్లోని భారతీయులపై పాకిస్తాన్ దాడుల్లో పదుల సంఖ్యలో మృతి చెందడం చాలా బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కౌన్సిలర్లు గజ్జల శివ, పెనుజూరు నాగరాజు, జిలాన్ భాష తదితరులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి ఉగ్రవాద దాడులు మరోసారి భారతదేశ పై జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని వారు ప్రధానమంత్రిని కోరారు. అంతేకాకుండా భారతదేశ వీర జవాన్లు కూడా పాకిస్తానికి తమదైన శైలిలో ఎదురుదెబ్బ తీస్తారని కూడా వారు స్పష్టం చేశారు. వీర సైనికులు దేశ సేవ కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని, అలాంటి వీరులను మనం ఎవ్వరు కూడా మరవకుండా స్మరించుకోవాలని వారు తెలిపారు.

వీధి నాటకం ద్వారా హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన

విశాలాంధ్ర- ధర్మవరం; ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ , నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సరోజమ్మ కళా బృందం తో వీధి నాటకముల ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగముగ పట్టణంలోని ప్రధాన మార్కెట్ సర్కిల్ నందు వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి,ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు , చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017 గూర్చి ప్రజలలో సరోజమ్మ కళా బృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో ధర్మవరం వైద్యాధికారి డా.నజీర్ ,ఐసిటిసి కౌన్సెలర్ వనమాల ల్యాబ్ టెక్నీషియన్ .భార్గవి , శక్తి మైత్రి మహిళా సంఘం పి.యూ ధర్మవరం ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్,ఓ.ఆర్.డబ్ల్యూ త్రివేణి, లక్ష్మీ, కవిత, సరస్వతి, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పోస్టుల మంజూరు పట్ల హర్షం.. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) రాష్ట్ర శాఖ నిరంతర ప్రాతినిథ్యాలు, కృషి వల్ల నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ లో సుమారు 1800 పోస్టులు హై స్కూల్ హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్స్ గా అప్గ్రేడ్ చేయడం జరిగిందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్ర రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ధర్మవరం మున్సిపల్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, వారందరితో కలిసి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు రామకృష్ణ నాయక్, జిల్లా మునిసిపల్ సబ్ కమిటీ కన్వీనర్ బిల్లె రామాంజినేయులు, స్థానిక నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్ నారాయణరెడ్డి, సాయి గణేష్, రామాంజనేయులు, ఆదిశేషూ, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో కూడిన విద్య మంచి భవిష్యత్తుకు పునాది అవుతుంది..

గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి
విశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడిన విద్య మంచి భవిష్యత్తుకు పునాది అవుతుందని శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి, రిటైర్డ్ టీచర్ జయసింహ, రాఘవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల వేడుకల్లో సందర్భంగా గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, నాట్య ప్రదర్శనలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన విద్యార్థులను అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో టీచర్ కిషోర్ కుమార్తె ఎంబి భవ్య ఇంటర్మీడియట్ లో 928 మార్కులతో మంచి ప్రతిభ కనపరచడం జరిగింది. ఇందులో భాగంగానే పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో శ్రీ లలితా నాట్య కళానికేతన్ వ్యవస్థాపకులు బాబు బాలాజీ కుమార్తె రామలాలిత్య హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం లో 4,000 మందితో సామూహిక నాట్య ప్రదర్శన చేసినందుకుగాను వారు గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా భవ్య, రామ లాలిత్యను వేదిక యందు సత్కరిస్తూ జ్ఞాపిక ను గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు అందజేశారు. ఈ సందర్భంగా గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంచిపట్టు, శ్రద్ధ, అకుంఠిత దీక్ష ఉన్నప్పుడే చదువులో సాధ్యపడుతుందని తెలిపారు. బ్రాహ్మణ విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణుల తల్లిదండ్రులు కూడా చదువు పట్ల మంచి ఆసక్తిని తమ పిల్లల పట్ల చూపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీబిఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారుతీ రావు, ప్రసాద్, శివ, రామారావు, ప్రణవ సాయి స్కూల్ కిషోర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప దేవాలయమునకు రథము అందవేత.. ఓంకార్ సిల్క్స్

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కేశవ నగర్ లో ఈనెల 14వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయమునకు అయ్యప్ప పండుగలలో పలు కార్యక్రమాలకు రథము అవసరముంటుంది అన్న సంకల్పంతో పట్టణంలోని ఓంకార్ సిల్క్స్ కు చెందిన అయ్యప్ప భక్తాదులు ఆలయంలో రథమును అందజేశారు. తదుపరి దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు గురుస్వామి విజయ్ కుమార్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండపల్లి వెంకట జయప్రకాష్ ఓంకార్ సిల్క్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతూ, వారు ఆశీస్సులను అందజేశారు.

వృద్ధులకు దుస్తులతో పాటు భోజనం పంపిణీ

విశాలాంధ్ర- తనకల్లు : మండల కేంద్రంలోని శ్రీ సాయి సేవా ట్రస్ట్ ద్వారా వృద్ధ అనాధాశ్రమం లో కదిరికి చెందిన కొత్తపల్లి ముద్దిరెడ్డి,లలితమ్మల మనవరాలు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా వస్త్రాలతో పాటు ఒకరోజు భోజనం ఏర్పాటు చేశారు. వృద్ధులకు ముత్తిరెడ్డి చేతుల మీదుగా వస్త్రాలు పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని ప్రతి ఒక్కరూ పేదలకు వృద్ధులకు తమ వంతు సహాయం అందించాలన్నారు. ఈ వృద్ధ అనాధాశ్రమం ప్రశాంత వాతావరణంలో చాలా బాగుందని ఏ అండ లేనివారికిఈ మండలంలో ఇలాంటి వృద్ధాశ్రమం ఉండడం శుభ పరిణామం అన్నారు. వృద్ధ అనాధాశ్రమం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు తులసమ్మ శివరామిరెడ్డి, హరి,శారదమ్మ అనసూయమ్మ పర్వీన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

11న ఎమ్మెల్యేచేత ఆసుపత్రిలో పలు అభివృద్ధి నిర్మాణాల ప్రారంభోత్సవం

విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్మించిన నూతన గణపతి దేవాలయం, వాటర్ ట్యాంక్, ఫార్మసీ షెడ్డులను ఆదివారం గుంతకల్ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు చిలకల రాజగోపాల్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. అభివృద్ధి కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆశీస్సులు చేయూత తోడ్పాటు ఉండటం చేత ఆయన ఆదేశాల మేరకు ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీర్చడం పరికరాలు వైద్య పరికరాలు సమకూర్చుట, శుభ్రత పరిశుభ్రత పట్ల సక్రమంగా నిర్వహించుట, జిల్లాస్థాయిలో మాదిరిగా శస్త్ర చికిత్సలు చేయుట ఇలా అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని ఆయన తెలిపారు.

పాకిస్తాన్.. టెర్రరిస్టులకు హబ్…

రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులతో పాటు పిల్ల కాలువలకు ప్రాధాన్యత కల్పించాలి …

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర -అనంతపురం : పాకిస్తాన్ వివిధ పేర్లతో ఉన్న టెర్రరిస్టులకు ఒక హబ్ మారిందని దీనిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అతి చిన్న వయసులోనే యుద్ధభూమిలో మొదటి వీరమరణం చెందిన మురళి నాయక్ పార్థివ దేహానికి అర్పించడానికి అనంత జిల్లాకు రావడం జరిగిందన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అన్నారు. అక్కడ ముస్లింలు పాకిస్తాన్ పై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై ఆచితూచి యుద్ధం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులపై తీసుకుంటున్న చర్యలను ముక్తకంఠంతో ఆశించడం జరిగిందన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం పై మీడియా సమన్వయం పాటించాలన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనీవా కాల్వ విస్తీర్ణ పనులను పరిశీలించడం సంతోషకరమన్నారు. దీనితోపాటు సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ చేపడతామని దీనికి రూ. 81 వేల కోట్లు అవసరం అయినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నామని చెప్పడం జరిగిందన్నారు. ప్రాజెక్టులు కట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేక అప్పు తీసుకొని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడుకు పెద్ద ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ రిజర్వాయర్ల ద్వారా పిల్ల కాలువల ద్వారా ఆరు లక్షల ఎకరాలకు నీటిని సాగునీరు, తాగునీరు అందించే దిశగా దృష్టి పెట్టాలన్నారు. అనంత జిల్లాలోని ఆర్ డి టి నిధులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రానికి వివరిస్తానని తెలియజేశారన్నారు. ఆర్డిటి విషయంపై ఈనెల 13న విజయవాడ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాసరి భవన్ సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశ అనంతరం స్వయంగా కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, మంత్రులు ఉరవకొండలో పర్యటిస్తూ హంద్రీనీవా ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పడం జరిగిందన్నారు. హంద్రీనీవా రెండో దఫా కాంక్రీట్ పనులు వేసిన తర్వాత ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి పిల్ల కాలువ ద్వారా ఏ విధంగా ఇవ్వగలుగుతారన్నారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంపై శ్రద్ధ చూపాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి వేమయ్య, అనంతపురం జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె. రాజారెడ్డి, ఏపీ కాలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాటమయ్య, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.