ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టారని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బైడెన్ నిర్ణయం పూర్తిగా న్యాయ విరుద్ధమని ఆరోపించారు. క్రిమినల్ కేసుల నుంచి కొడుకును తప్పించేందుకు అమెరికా రాజ్యాంగం కల్పించిన అధికారాలను బైడెన్ దుర్వినియోగపరిచారని మండిపడ్డారు. హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే క్యాపిటల్ హిల్ దాడి కేసులో బందీలను విడుదల చేయలేదేమని నిలదీశారు. తుపాకీ అక్రమంగా కొన్నారని, ఆదాయపన్ను చెల్లింపు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని హంటర్ బైడెన్ పై పోలీసులు గతంలో కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత కోర్టు హంటర్ ను దోషిగా తేల్చింది. అయితే, శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. ఈ కేసులకు సంబంధించి తాను కల్పించుకోబోనని ప్రెసిడెంట్ బైడెన్ గతంలో పేర్కొన్నారు. అయితే, తాజాగా హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో హంటర్ కు శిక్ష పడే అవకాశం లేదు. అధ్యక్ష హోదాలో కొడుకుకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు.
నేడు సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్‌గా ఉన్న పవన్
కేబినెట్ భేటీకి ఒక రోజు ముందుగా సీఎం చంద్రబాబుతో సమావేశం
ప్రధానంగా కాకినాడ పోర్టు అంశాలపై చర్చించే చాన్స్
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమావేశం కానున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి భారీ ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. పోర్టు వద్ద తనకు ఎదురైన అనుభవాలను ఆయన మీడియా ముందు వ్యక్తం చేయడం తీవ్ర సంచలనం అయింది. అధికారుల తీరుపైనా మండిపడ్డారు. రేపు కేబినెట్ భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబుతో పవన్ భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ప్రధానంగా కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపైనా వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అంశంపై పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యాపారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నేతల ప్రమేయం కూడా ఉందని, పెద్ద పెద్ద వ్యక్తులు దీని వెనుక ఉన్నారని వార్తలు రావడంతో సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : మాలకొండలో శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయఅధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో సాగర్ బాబు తో ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఏర్పాట్లు, ఇతర అంశాలపై మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అన్నదాన సత్రం వద్ద భక్తులకు అందుతున్న భోజన సదుపాయాలను పరిశీలించి, కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో గుడ్లూరు సీఐ మంగారావు, ఎస్ ఐ మరిడి నాయుడు, పోలీస్ సిబ్బంది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
వృద్ధుల అంశములపై కవితా గోష్టి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పోలా ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో యువర్స్ ఫౌండేషన్ జిల్లా రచయితల సంఘం సోమలరాజు ఫౌండేషన్, ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో కవితా గోష్టి నువ్వు ఆదివారం నిర్వహిస్తున్నట్లు రచయిత సంఘం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివారం జరగబోయే ధర్మవరం కవిత ఉత్సవమునకు సంబంధిత ఆహ్వాన పత్రికలో ప్రశంస పత్రంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం
ధర్మవరం నియోజకవర్గ. రచయితలసంగం అధ్యక్షులు మాట్లాడుతూ చేనేత, వృద్ధుల అంశములపై కవిత గోష్టి నిర్వహించుచున్నామని తెలిపారు. సోములరాజు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సోమలరాజు శివరాజు నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.పలువురికి రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పోల ప్రభాకర్ చౌదరి మీదుగా పంపిణీ చేశారు. యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శీలా.నాగేంద్ర మాట్లాడుతూ భారతదేశంలో ఇటువంటి వైవిధ్య కార్యక్రమానికి ముందుకొచ్చిన జిల్లా రచయితల సంఘం వారికి కృతజ్ఞతలు తెలిపారు రోటరీ క్లబ్ , రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ ప్రతినిధి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మున్ముందు కూడా మా వంతు స్వచ్ఛంద సంస్థ సహకరించాలని తెలిపారు. మెహర్ బాబా వృద్ధుల వైద్య శిబిరముల కేంద్రం నిర్వాహకులు మెహర్ సుజాత మాట్లాడుతూ గత పది సంవత్సరాలు నుండి వృద్ధుల కోసం ఏర్పాటు చేయుచున్న వరుస వైద్య శిబిరాలు విజయవంతం కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని కవుల ద్వారా స్వచ్ఛంద సంస్థలు తెలియజేయడానికి ఇది వేదికగా పనిచేస్తుందని తెలిపారు. నిర్వాహకులు సత్య నిర్ధారణ మాట్లాడుతూ వృద్ధుల కోసంప్రతిజిల్లలో ప్రత్యేక వైద్యశాల ఏర్పాటుచేయడానికి ఎన్జీవోలతో ముఖాముఖి కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
అర్హులందరికీ ఎన్టీఆర్ ఇల్లు నిర్మించి ఇస్తాం
టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్
ఉఅట్టహాసంగా పింఛన్లు పంపిణీ
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : అర్హులందరికి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పేర్కొన్నారు. మండల పరిధిలోనే కారుమంచి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీని ఓ పండుగలా.. శని వారం అట్టహాసంగా నిర్వహించారు.ముందుగా స్థానిక టిడిపి నాయకులు వీరభద్ర గౌడు కు ఘనస్వాగతం పలికి, చాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అధికారులు, కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను వీరభద్ర గౌడ్ చేతుల మీదుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇంటిస్థలం ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారందరికి ఇళ్లు కట్టిస్తామని అన్నారు. సొంత ఇంటి స్థలంతో పాటు రేషనకార్డు కలిగి ఉండి, అర్హులైతే ఇళ్లు నిర్మించుకోవచ్చన్నారు. దీని కోసం గ్రామ, వార్డు స్థాయిల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతావాణి, సర్పంచ్ లక్ష్మి, టిడిపి మండల కన్వీనర్ పరమారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేషాద్రి నాయుడు, మాజీ కన్వీనర్ శ్రీనివాస గౌడ్, సాగునీటి సంఘం మాజీ చైర్మన్లు మల్లికార్జున్ రెడ్డి, బసవరాజు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాలీ సాహెబ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, టిడిపి మండల నాయకులు రాజ్ కుమార్, సతీష్, హనుమంతురెడ్డి, మల్లికార్జున రెడ్డి, అంగడి వీరేష్, గ్రామ నాయకులు రవి రెడ్డి, మాణిక్య ప్రభు, లక్ష్మీదేవి, దర్గయ్య, చంద్ర, నాగరాజు, వెంకటేష్, జయకృష్ణ, రంగస్వామి, పంచాయితీ కార్యదర్శి కృష్ణ, వీఆర్వో ఎర్రిస్వామి, సచివాలయ సిబ్బంది, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఆర్ బి ఐ డిజిటల్ కరెన్సీ వ్యవస్థ
విశాలాంధ్ర అనంతపురం : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.ఎ.కోరి జాతీయ సెమినార్‌ను ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీలో అకడమిక్ డెవలప్‌మెంట్‌లను ప్రదర్శనల జాతీయ సెమినార్‌ను శనివారం ప్రారంభించారు.
హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ దేబాశిష్ ఆచార్య భారతదేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆర్ బి ఐ ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ ఎకోసిస్టమ్‌పై సంప్రదాయ నగదు చెల్లింపుల కంటే డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాల గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సులోని కీలకోపన్యాసంలో ప్రస్తావించారు. ఈ సదస్సులో
ప్రొఫెసర్. జి. రామ్ రెడ్డి, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్, ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ వైస్ ఛాన్సలర్, ఎస్.వి యూనివర్సిటీ, డాక్టర్ ఎన్ శ్రీ దేవి, మాజీ రిజిస్ట్రార్, సి ఈ ఎస్ ఎస్ , హైదరాబాదు తదితర ప్రముఖులు జాతీయ సెమినార్‌కు హాజరయ్యారు.
ఈ రెండు రోజుల జాతీయ సెమినార్‌కు డాక్టర్ వై.కేశవరెడ్డి కన్వీనర్ గా వ్యవహరించి పాల్గొనే వారందరికీ ఆహ్వానం పలకగా జాతీయ సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బ్రజరాజా మిశ్రా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఘనంగా గ్రీన్ డే
విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామంలో గల
రూపా రాజా పీసిఎంఆర్ పాఠశాలలో ఘనంగా గ్రీన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆకుపచ్చ రంగు దుస్తులతో అలరించిన వైనం అందరిని ఆకట్టుకుంది. పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.సకల జీవరాశులు మానవ జాతి సుఖంగా బ్రతకాలంటే, ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం మానవజాతికి ఎంతైనా ఉందని తెలిపారు.పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ఇప్పటికైనా ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి చేసే చెట్లను ప్రతి ఒక్కరూ విరివిగా పెంచి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు.లేకపోతే మానవజాతి మనగుడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా జరిగిన గురజాడ అప్పారావు వర్ధంతి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రముఖ తెలుగు రచయిత గురజాడ వర్ధంతి వేడుకలను పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ముఖ్య అతిథులుగా గల ఐద్వా జిల్లా కార్యదర్శి నాగమణి, కళాశాల ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. తదుపరి విద్యార్థులతో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని,గురజాడ ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో కన్యాశుల్కం పూర్ణమ్మ ,దిద్దుబాటు ఇలా అనేక రచనలు చేశారన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని తన రచనల ద్వారా మహాద్భుతంగా రాసిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, జిల్లా ఉపాధ్యక్షులు కనుమ దామోదర్, హరి కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:బీ రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు ఆసుపత్రి వైద్యులు, నర్సులు చేతుల మీదుగా 360 మంది రోగులకు, సహాయకులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి సేవాదాత (విరాళాధాత) గా శ్రీ సత్య సాయి సేవా సమితి వారే నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మానవసేవే మాధవసేవ అన్న పుట్టపర్తి బాబా వారి ఆదేశాను, ఆశీస్సులు ప్రకారం ఈ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తుండడం మాకెంతో సంతృప్తిరి ఇస్తోందని తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 9966047044 గాని 9030444065కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, సహాయకులకు ,గర్భిణీ స్త్రీలకు ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని, ఇది స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. తదుపరి ఆసుపత్రి తరఫున శ్రీ సత్య సాయి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబుకు మెమెంటోను అందజేసిన జెసి అష్మిత్ రెడ్డి
విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబును తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి శనివారం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా ఫించన్ కానుక పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి మెమెంటోను అందజేశారు. అనంతరం నియోజకవర్గం లోని పలు సమస్యలు, అభివృద్ధి పనుల గూర్చి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.