Friday, January 10, 2025
Home Blog Page 74

అదానీ స్కామ్‌పై తగ్గేదేలె…

0

. పార్లమెంటు ఉభయ సభల్లో ‘ఇండియా’ ఎంపీల ఆందోళన
. చర్చించకుండా పారిపోతున్న మోదీసర్కార్‌
. వాయిదాల పర్వం కొనసాగింపు

న్యూదిల్లీ : అదానీ ముడుపుల వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. ఇతర అంశాలను పక్కనబెట్టి అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠను మంటగలుపుతున్న అదానీ అవినీతి స్కామ్‌తో పాటు మణిపూర్‌ అల్లర్లు, సంభల్‌లో హింసపై చర్చకు ఇండియా ఐక్యసంఘటన పక్షాలు తగ్గేదేలే అన్న రీతిలో పట్టుబడుతున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లో ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించక పోతుండటం… మోదీ సర్కారు ఈ అంశాలపై చర్చకు సిద్ధంగా లేదన్న వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. ఐదు రోజు శుక్రవారం ప్రారంభమైన గంటకే పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అదానీ అవినీతి అంశంతో పాటు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన, మణిపూర్‌ వివాదంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడిరది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ఉభయసభలు ప్రారంభం కాగా… రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. అదానీ స్కాం, మణిపూర్‌, సంభాల్‌ హింసాకాండ, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ పూజారి అరెస్టుపై చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన 17 నోటీసులను చైర్మన్‌ తిరస్కరించారు. చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో సభను డిసెంబర్‌ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ అవినీతి వ్యవహారంపై చర్చకు విపక్షాల డిమాండ్‌ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదానీ అవినీతి కుంభకోణంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ ఎంపి మాణికం ఠాగూర్‌ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్య ప్రజా ప్రాముఖ్యత, భారత పాలన, నియంత్రణ చట్టాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. దానిని తిరస్కరించిన స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12.00 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాజధాని పనులు షురూ

0

జనవరి నుంచి పరుగులు

. డిసెంబరు ఆఖరుకల్లా టవర్లు, ట్రంకురోడ్ల టెండర్లు పూర్తి
. భారీస్థాయిలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌, మెడికల్‌ కాలేజీ
. వివిధ సంస్థల నిర్మాణానికి భూకేటాయింపులు
. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయని మున్సిపల్‌ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబరు నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్‌ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయన్నారు. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ శుక్రవారం సచివాల యంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, దుర్గేశ్‌, సంధ్యారాణి జూమ్‌ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడిరచారు. గతంలో పనులు నిలిచిపోయిన వాటికి సంబంధించి టెండర్ల ఒప్పందాలు రెండు, మూడు రోజుల్లో రద్దు చేస్తామన్నారు. ఆ వెంటనే కొత్తగా టెండర్లు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదన్నారు. 2019కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా, వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాల ఏర్పాటు ప్రారంభించాయ న్నారు. భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా వివరాలు కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. 2019కి ముందే టీడీపీ ప్రభుత్వంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఆయా సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి కాల పరిమితి ముగియడంతో తిరిగి వారి నుంచి రాతపూర్వకంగా అంగీకారం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తాజాగా అమరావతిలో భారీస్థాయిలో ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో భూములు పొందిన సంస్థలకు పూర్తి అంగీకారం తెలుపుతూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఆయా సంస్థలకు భూములు కేటాయించినట్లు తెలిపారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ అండ్‌ డిజైన్‌కు ఐదు ఎకరాలు, ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో)కి 0.8 ఎకరాలు, బసవతారకం కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 15 ఎకరాలు, లార్సన్‌ అండ్‌ టర్బో స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ఐదు ఎకరాలు, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్‌ సొసైటీకి 10 ఎకరాలు, టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరిం చారు. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు. దీంతో పాటు ఆయా సంస్థలకు ఇతర రాష్ట్రాల్లో ఎంత భూమి కేటాయించారు. ప్రస్తుతం ఎంత అవసరం అనేదానిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుం టామన్నారు. కొత్తగా భూ కేటాయిం పులు చేసే సంస్థలకు ధరల అంశంలో పాలసీ తయారు చేస్తామన్నారు. రాజధానికి కొత్తగా వచ్చే సంస్థలకు డిసెంబరు నెలాఖరులోగా భూకేటాయిం పులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశిం చామన్నారు. గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పడానికి రాజధాని విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలే ఉదాహరణ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

అదానీ ముడుపులపై మౌనమేంటి?

0

. చంద్రబాబుకు రామకృష్ణ సూటిప్రశ్న
. జగన్‌ను కాపాడటమే లక్ష్యమా?
. ఒప్పందాలన్నీ రద్దు చేయాలని డిమాండ్‌

విశాలాంధ్ర-విజయనగరం: వందల కోట్ల రూపాయల అదానీ కుంభకోణంపై ప్రజలంతా చర్చించుకుంటున్నా… తమకేమీ తెలియదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని, సమాచారం సేకరిస్తున్నామంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయనగరంలో శుక్రవారం రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదానీ కుంభకోణం న్యూయార్క్‌లో బయటపడిరదని, ఈ కేసుకు సంబంధించిన మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయని రామకృష్ణ చెప్పారు. అయినా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. అదానీ ముడుపుల విషయంలో చంద్రబాబు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2021లో సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడే… ప్రజలపై మోయలేని భారం పడుతుందని సీపీఐ హెచ్చరించిందని గుర్తుచేశారు. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరకు తాను దీనిపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా వేశానని చెప్పారు. ప్రస్తుత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ కూడా కోర్టులో పిల్‌ దాఖలు చేశారన్నారు. తాను కోర్టులో కేసు వేయడంతో అజిజ్‌ కంపెనీ విద్యుత్‌ సరఫరాలో వెనక్కి తగ్గిందన్నారు. కానీ అదానీ మాత్రం దాదాపు 7వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కోసం రాష్ట్ర ప్రజలపై లక్షా పదివేల కోట్ల భారం మోపినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో 1750 కోట్ల రూపాయల ముడుపులు నాటి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లు ఆధారాలు లభించినా ముఖ్యమంత్రి పునరాలోచనలో పడటం అనుమానాలకు తావిస్త్తోందన్నారు. కార్పొరేట్‌ పెద్దల ఆదేశాలతో దేశాన్ని పాలిస్తున్న మోదీ సర్కారు…. దానికి తొత్తులుగా ఉన్న కూటమి ప్రభుత్వాలు అదానీ విషయంలో కావాలనే తాత్సారం చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు సెకీకి సంబంధించిన కేసులో తనపేరు లేదని, తనకు సత్కారం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. చంద్రబాబుకు ఆధారాలు లేకపోతే తాము అందజేస్తామని, త్వరలోనే నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తామని రామకృష్ణ చెప్పారు. అదానీ చేతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నందున తనను ఏమీ చేయలేరనే ధీమాతో జగన్‌మోహనరెడ్డి ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందా లను వెంటనే రద్దు చేయాలని, కృష్ణపట్నం, గంగవరం పోర్టు లను అదానీ నుంచి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్‌, అలమండ ఆనందరావు పాల్గొన్నారు.

భూకబ్జాలపై విచారణ

0

. 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్‌లు
. రీసర్వేతో తలెత్తిన 2.29 లక్షల భూ సమస్యలు
. రెవెన్యూశాఖ సమూల ప్రక్షాళన
. సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీహోల్డ్‌ భూముల్లో 25,284 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ అవ్వగా, అందులో 7,827 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. వీటిలో జరిగిన అవకతవకల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహా ఎవరి పాత్ర ఉంది, కారకులు ఎవరు, తెరవెనుక ఉన్న వాళ్లు, బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని తేల్చాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో సమీక్ష చేశారు. సమీక్షకు మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలపై అన్ని శాఖలకు సంబంధించి 1,74,720 అర్జీలు రాగా… అందులో 67,928 అర్జీలు కేవలం రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయి. మొత్తం అర్జీలలో 1,32,572 పరిష్కరించగా, ఇందులో 49,784 రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 13,59,805 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేశారని, వీటిలో 4,21,433 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేసినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫ్రీహోల్డ్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరిగిన మొదటి 10 మండలాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి… కారకులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 4,21,433 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూముల్లో జరిగిన నిబంధన ఉల్లంఘనలను కూడా తేల్చాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై సత్వర, పూర్తిస్థాయి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సీిఎం అన్నారు. వినతులు, సమస్యలపై ప్రజలను అక్కడికి, ఇక్కడికి తిప్పే పరిస్థితి ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఒక దరఖాస్తు వస్తే దాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని, మొక్కుబడి తంతు కుదరదని స్పష్టం చేశారు. ప్రజలు సులభంగా రెవెన్యూ సేవలు పొందేందుకు అవసరమైన ప్రక్షాళన చేపట్టాలని సీిఎం అభిప్రాయపడ్డారు. ఏ తరహా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తున్నారు, ఎంత సమయం తీసుకుంటున్నారు, ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతుందా లేదా అనే అంశాలపై థర్డ్‌ పార్టీ ద్వారా ఆడిట్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్‌లైన్‌లో అన్ని సర్వీసులు అందుబాటులోకి తెచ్చేలా పూర్తిస్థాయిలో శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. పుట్టిన, చనిపోయిన, కుల, ఆదాయ సర్టిఫికెట్‌ వంటి సర్వీసుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా చేయాలన్నారు. రానున్న రోజుల్లో పీడీ యాక్ట్‌, యాంటీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను సమర్థవంతంగా ఉపయోగించి భూ మాఫియాకు అడ్డుకట్ట వేయాలన్నారు. సామాన్య ప్రజలను, పేదలను, బలహీనులను బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్లు హంతకులతో సమానమన్నారు. రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేసి… తద్వారా ప్రజల ఆస్తులు, భూములకు రక్షణ కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.
12న స్వర్ణాంధ్ర విజన్‌ విడుదల
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నంబర్‌ 1 గా నిలిపేందుకు ఉద్దేశించిన డాక్యుమెంట్‌ విజన్‌ను డిసెంబరు 12వ తేదీన ప్రజల సమక్షంలో విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అధికారులు సిద్ధం చేస్తున్న విజన్‌ డాక్యుమెంట్‌పై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది విజన్‌ డాక్యుమెంట్‌పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం విజన్‌ డాక్యుమెంట్‌ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ సమీక్షలో సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

ఇంత జాప్యమా?

0

. ఆలస్యంగా బి.ఫార్మసీ షెడ్యూలు
. పక్క రాష్ట్రాలకు విద్యార్థుల పరుగు
. అధికారుల తీరుపై విమర్శలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఫలితాలు వచ్చిన ఆర్నెళ్లకు బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. ఈ జాప్యానికి కారకులె వరనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. నెలల తరబడి కౌన్సెలింగ్‌కు షెడ్యూలు విడుదల కాకపోవడంతో రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. కేవలం బి.ఫార్మసీనే కాదు. ప్రతి విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లోనూ అదే తంతు కొనసా గుతోంది. బి.ఫార్మసీ కన్నా ఇంజినీరింగ్‌ ప్రవేశాలు కొంతమేరకు ముందు ముగిశాయి. ఏపీ ఈఏపీసెట్‌2024లో భాగంగా ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.ఫార్మసీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ప్రవేశాలు పూర్తయినప్పటికీ, బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌కు షెడ్యూలు ఆలస్యంగా విడుదలైంది. విద్యా సంవత్సరం నష్టపోకుండా సకాలంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు పదేపదే విన్నవించినప్పటికీ స్పందించలేదు. రాష్ట్రంలో మొత్తం 177 కళాశాలలు ఫార్మా కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో 39 ప్రభుత్వ కళాశాలల్లో బి.ఫార్మాకు 1520 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మే 23న ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు జరగ్గా… జూన్‌ 11న ఫలితాలు ప్రకటించారు. వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశపరీక్షలకు 80,766 హాజరుకాగా… 70,352 మంది అర్హత సాధించారు. దాదాపు ఆరు నెలల తర్వాత బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించ డంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగింది. మిగిలిన రాష్ట్రాల్లో ముందస్తుగా కౌన్సెలింగ్‌ ప్రారంభం కావడంతో వేలాదిమంది ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. కౌన్సెలింగ్‌ ఆలస్యానికి గల కారణాలను మంత్రి నారా లోకేశ్‌ గుర్తించి… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫీజు చెల్లింపునకు రెండు రోజుల గడువు
బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ జాప్యాన్ని ప్రభుత్వ యంత్రాంగం విద్యార్థులపై నెట్టడానికి చూస్తోంది. కౌన్సెలింగ్‌ షెడ్యూలు జారీజేసిన వెంటనే ఎంపీసీ విద్యార్థులకు ఈనెల 29, 30 తేదీల్లో రెండు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఆప్షన్ల నమోదుకు కేవలం మూడు రోజులే సమయం ఇచ్చారు. బైపీసీ విద్యార్థుల ఫీజు చెల్లింపునకు మాత్రం డిసెంబరు 30 నుంచి 5 వరకు గడువు విధించారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. ఫీజు చెల్లింపునకు మరింత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. జూన్‌ 11వ తేదీన ఏపీఈఏపీసెట్‌ ఫలితాలు వెల్లడికాగా, బి.ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ డిసెంబరు 12వ తేదీతో ముగియనుంది. దీంతో విద్యార్థులు దాదాపు సగం విద్యా సంవత్సరం కోల్పోనున్నారు. ఏడాదికి రెండు సెమిష్టర్ల విధానంతో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే ఈఏపీసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందిన వారికి డిసెంబరు నుంచి జనవరి వరకు మొదటి సెమిష్టర్‌ పరీక్షలకు ప్రణాళిక రూపొందించారు. బి.ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యే నాటికే డిసెంబరు కానుంది. ఈ క్రమంలో వారికి మొదటి, రెండు సెమిష్టర్‌ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ ఇలా…
ఎంపీసీ విద్యార్థులకు శుక్రవారం నుంచి 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఈనెల 29 నుంచి డిసెంబరు 1వరకు పరిశీలిస్తారు. ఆప్షన్ల నమోదుకుగాను ఈనెల 29 నుంచి 1 వరకు ఇస్తారు. ఆప్షన్ల మార్పునకు డిసెంబరు 2వ తేదీన అవకాశం కల్పించి… 4వ తేదీన సీట్లు ఖరారు చేస్తారు. 46 తేదీల మధ్య వ్యక్తిగత నివేదికకు షెడ్యూలు విధించారు. 5 నుంచి తరగతుల ప్రారంభమవుతాయి. బైపీసీ విభాగంలో ఈనెల 30 నుంచి డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. డిసెంబరు 2 నుంచి 6 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 3 నుంచి 7వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు ఉంటుంది. 8వ తేదీన ఆప్షన్ల మార్పు, 11న సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. విద్యార్థులు వ్యక్తిగత నివేదికను 1114 తేదీల మధ్య ఆయా కళాశాలల్లో చేయాలి. 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

కాకినాడ పోర్ట్‌ స్మగ్లింగ్‌ అడ్డానా?

0

. అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు
. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం
. పీడీఎస్‌ బియ్యంతో ఉన్న షిప్‌ సీజ్‌ చేయాలని ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో`కాకినాడ: కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చేశారు… ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు…భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్ధాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్‌ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా?’ అని అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. శుక్రవారం ఆయన కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకు వచ్చారు. రేషన్‌ బియ్యంతో పట్టుబడిన స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ…‘‘కాకినాడ పోర్టు అంటే స్మగ్లర్లకు స్వర్గధామంగా మారిపోయింది. బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలి అని చెబుతున్నా క్షేత్ర స్థాయి అధికారులకి ఇంకా మెతగ్గా ఉంటున్నారు. స్మగ్లింగ్‌ చేసేవాడు ఒక్క బియ్యంతో ఆగడు. మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలను కూడా స్మగ్లింగ్‌ చేస్తాడు. రాజకీయ ఒత్తిళ్లు అని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అది దేశ భద్రతకే పెనుముప్పుగా మారుతుంది’’ అన్నారు.
ప్రతిసారీ ప్రజా ప్రతినిధులు వచ్చి ఆపాలా..?
కాకినాడ చుట్టు పక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉగ్రవాదులను రెడ్‌ కార్పెట్‌ వేసి పిలిచినట్లేనన్నారు. ప్రతిసారీ ప్రజాప్రతినిధులు వస్తేనే బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటారా..? రేషన్‌ బియ్యం మాఫియా వెనుక ఉన్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న శక్తులపై కేసులు నమోదు చేయండి. దీని వెనుక ఉన్నది ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని కొంత మంది అక్రమార్కులు స్మగ్లింగ్‌ చేస్తూ కోట్లు కూడబెడుతున్నారు. రేషన్‌ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌ డౌన్‌ చేస్తామని హెచ్చరించారు. రేషన్‌ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలని, ప్రైవేట్‌ పోర్టు అయితే ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారేమో? కూటమి పాలనలో అటువంటివి కుదరవన్నారు. నేను వస్తున్నా అని తెలిసి ఎస్పీ సెలవు మీద వెళ్లిపోయారన్నారు. ‘రేషన్‌ బియ్యం ఒక్కటే ఇక్కడ స్మగ్లింగ్‌ జరుగుతుందో…ఇంకేదైనా జరుగుతున్నాయో ఎవరికి తెలుసు? ఇక్కడ నుంచి ఎంత గంజాయ్‌ బయటకు వెళ్తుందో ఎవరికి తెలుసు? అక్రమార్కులపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించాలి. షిప్‌ సీజ్‌ చేసి..దీని వెనుక ఉన్నదెవరు నివేదిక ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు. పవన్‌ వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్‌, రాష్ట్ర సివిల్‌ సప్లై కార్పోరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌, స్థానిక శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి, పోర్టు ఆఫీసర్‌ ధర్మశాస్త్ర, సివిల్‌ సప్లై, పోలీస్‌, రెవెన్యూ తదితర అధికారులు ఉన్నారు.

యూజర్‌ ఫ్రెండ్లీ ట్రేడిరగ్‌ యాప్‌ ‘అగ్నిక్‌’

0

హైదరాబాద్‌: వినియోగదారులు సులభంగా ట్రేడిరగ్‌ చేసుకునేందుకు వీలుగా యూజర్‌ ఫ్రెండ్లీ ట్రేడిరగ్‌ యాప్‌ ‘అగ్నిక్‌’ను ప్రవేశ పెట్టినట్లు మాస్టర్‌ ట్రస్ట్‌ గ్రూప్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ సీఏ జషన్‌ అరోరా తెలిపారు. ఈ యాప్‌ ట్రేడిరగ్‌, ఇన్వెస్టింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు. భారతదేశ రిటైల్‌ ఇన్వెస్టర్‌ బేస్‌ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం.. టైర్‌ 2, టైర్‌ 3 నగరాల నుంచి రిటైల్‌ ఇన్వెస్టర్లలో 52 శాతం వృద్ధి నమోదైందన్నారు. అగ్నిక్‌ ఈ డిమాండ్‌కు సంపూర్ణంగా ఉపయోగపడుతుందని తెలిపారు. టెక్‌ అవగాహన ఉన్న పెట్టుబడిదారులు, వ్యాపారుల కోసం రూపొందించబడిరదని పేర్కొన్నారు. అగ్నిక్‌లో అధునాతన మార్కెట్‌ స్క్రీనర్‌లు, వాచ్‌లిస్ట్‌లు, పెట్టుబడి కోసం స్క్రిప్‌ సమాచారం ఉంటుందన్నారు. నయా పెట్టుబడిదారుల కోసం అగ్నిక్‌ ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఐపీఓలు, స్టాక్‌ సీప్లలో వివిధ రకాల పెట్టుబడి కోసం పేపర్‌లెస్‌ ఈకేవైసీ ప్రక్రియ ద్వారా ఉచిత డీమ్యాట్‌ ఖాతాను తెరిచే సౌలభ్యం కలదన్నారు.

కాలిఫోర్నియా ఆల్మండ్స్‌తో రోగనిరోధక శక్తి బలోపేతం

0

ముంబయి: రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా మెరుగుపరుచుకోవటానికి పోషకాహార నిపుణులు రితికా సమద్దర్‌ మీ దినచర్యలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అటువంటి సూపర్‌ఫుడ్‌లలో ఒకటి కాలిఫోర్నియా బాదం. ఇందులో 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. బాదం పోషకాహార పవర్‌హౌస్‌గా నిలుస్తుంది. ఏదైనా భోజనం, చిరుతిండి లేదా డైట్‌ ప్లాన్‌లో చక్కగా సరిపోతుంది. కాలిఫోర్నియా బాదంలో ప్రోటీన్‌, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి సమతుల్య రోజువారీ ఆహారానికి అద్భుతమైన తోడ్పాటును అందిస్తాయి. వాటి ఆరోగ్య ప్రయోజనాలు విస్తృతంగా గుర్తించబడ్డాయి, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా బాదంపప్పును సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒక ముఖ్యమైన ఆహారంగా గుర్తించింది. ఇంకా, ఇటీవల ప్రచురించిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలు బాదంపప్పును మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తినగలిగే పోషకమైన గింజగా గుర్తించాయని రితికా సమద్దర్‌ అన్నారు. ఆమె న్యూదిల్లీ మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ రీజనల్‌ హెడ్‌-డైటెటిక్స్‌గా ఉన్నారు.

తగ్గిన నిఫ్టీ లక్ష్యం: పీఎల్‌ క్యాపిటల్‌- ప్రభుదాస్‌ లిల్లాధర్‌

0

ముంబై: పీఎల్‌ క్యాపిటల్‌ – ప్రభుదాస్‌ లిల్లాధర్‌, భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటి, తన తాజా ఇండియా స్ట్రాటజీ రిపోర్ట్‌లో భారతీయ మార్కెట్లు గమనంలో ఉన్నాయని, అయితే ఎదురుగాలులు ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని పేర్కొంది. ఎఫ్‌వై25/26/27 కోసం 0.5/2.0/1.5 తగ్గించిన నిఫ్టీ ఈపీఎస్‌పై సంస్థ తన బేస్‌ కేస్‌ నిఫ్టీ లక్ష్యాన్ని 27,381 (27,867 అంతకుముందు)కి తగ్గించింది. దీర్ఘకాలిక లాభాల కోసం డిప్స్‌పై ఎంపిక చేసిన కొనుగోలును సిఫార్సు చేసింది. నివేదిక ప్రకారం, తక్కువ బేస్‌, సాధారణ రుతుపవనాల కారణంగా గ్రామీణ డిమాండ్‌లో స్థిరమైన పెరుగుదలతో డిమాండ్‌ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం పట్టణ డిమాండ్‌ను తగ్గిస్తుంది. ముఖ్యంగా మెట్రోలు, ప్రధాన నగరాల్లో, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం డిమాండ్‌లో సుమారు 35% దోహదం చేస్తుంది. చాలా ఆశావాదం ఇప్పుడు రాబోయే పండుగ, వివాహ సీజన్లలో సంభావ్య డిమాండ్‌ బూస్ట్‌పై ఆధారపడి ఉంటుంది.

అమేజాన్‌ ఇండియా మొదటి బ్లాక్‌ ఫ్రైడే కార్యక్రమం లైవ్‌

0

బెంగళూరు: అమేజాన్‌ ఇండియా తమ ప్రారంభోత్సవపు బ్లాక్‌ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రకటించింది. నవంబర్‌ 29 నుండి డిసెంబర్‌ 2 వరకు ఇది కొనసాగుతుంది. అంతర్జాతీయంగా భారీగా సంబరం చేసుకోబడే, అమేజాన్‌ ఇండియా వారి మొదటి బ్లాక్‌ ఫ్రై కార్యక్రమం యాపిల్‌, శామ్‌సంగ్‌, సోనీ, నైక్‌, కాల్విన్‌ క్లీన్‌, ఆడిడాస్‌, టమ్మీ హిల్‌ ఫిగర్‌, పనసోనిక్‌, జీన్‌ పాల్‌, డాబర్‌, ఎల్జీ, అల్డో, స్వరోవ్‌స్కి సహా బ్రాండ్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఉపకరణాలు, ఫ్యాషన్‌, బ్యూటీ శ్రేణులపై డీల్స్‌ను అందిస్తోంది. అమేజాన్‌ వారి ప్రసిద్ధి చెందిన షాపింగ్‌ కార్యక్రమం బ్లాక్‌ ఫ్రైడేని మొదటిసారిగా అమెజాన్‌.ఇన్‌పై భారతదేశంలోకి తీసుకువస్తున్నామని, ఎలక్ట్రానిక్స్‌, బ్యూటీ, గృహోపకరణాలు, దేశ, విదేశీ బ్రాండ్స్‌కు చెందిన డెకార్‌లో ఆదాలు అందచేస్తున్నామని అమేజాన్‌ ఇండియా కాటగిరీస్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ సౌరభ్‌ శ్రీవాత్సవ అన్నారు. కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్‌ ఇండ్‌, బిఓబి కార్డ్‌, హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్‌, క్రెడిట్‌ ఈఎంఐతో 10% తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు.