Friday, January 10, 2025
Home Blog Page 75

నువ్వు తప్పు చేసి, ప్రజలు తప్పు చేశారంటున్నావ్..జగన్ పై బాలినేని ఫైర్


వైసీపీ అధినేత జగన్ తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పార్టీ ఇచ్చారని.. ఆ పార్టీకి వెళ్లినవారికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని చెప్పారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన గన్ మెన్లను సరెండర్ చేసి, ఃనాకు అది చేయలేదు ఇది చేయలేదుః అని చెప్పినా తనను వైసీపీ నుంచి తీసేయలేదని… తీసేసి ఉంటే వేరే పార్టీ తరపున పోటీ చేసి ఈరోజు మంత్రి అయ్యుండేవాడినని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో మాట్లాడానని… ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా మంత్రిని కూడా చేస్తానని చెప్పారని వెల్లడించారు. జగన్ కేసులు, బెయిల్ గురించి ఆయన మాట్లాడుతూ… తప్పు చేసి ఉంటే శిక్ష కచ్చితంగా అనుభవిస్తారని బాలినేని చెప్పారు. ప్రజలకు జగన్ కొన్ని పథకాలు ఇచ్చారని… ఆ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారని… అదే సమయంలో కార్యకర్తలను విస్మరించారని, వారిని పక్కన పెట్టేశారని… వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. అందుకే వైనాట్ 175, వైనాట్ కుప్పం నుంచి… చివరకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ లో రియలైజేషన్ రాలేదని… కార్యకర్తలను బాగా చూసుకుంటాననే ఒక్క మాట కూడా ఆయన నుంచి రాలేదని విమర్శించారు.

ప్రజలు తప్పు చేశారనే విధంగా జగన్ మాట్లాడుతున్నారని… ప్రజలు ఎందుకు తప్పు చేస్తారని బాలినేని ప్రశ్నించారు. నువ్వు తప్పు చేస్తే… ప్రజలు కూడా తప్పు చేస్తారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో నాలుగు సార్లు, ఐదు సార్లు సీఎంగా ఉన్నవారు ఉన్నారని… వాళ్లెందుకు అన్ని సార్లు సీఎం అయ్యారని ప్రశ్నించారు. నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిపోతావని వ్యాఖ్యానించారు.

విజయమ్మ, షర్మిలతో పాటు ఇతరులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తున్న అంశంపై జగన్ మాట్లాడుతూ… మా వాళ్లను అరెస్ట్ చేస్తారా? మళ్లీ నేనే సీఎం అవుతాను… మీ అందరి సంగతి చూస్తానంటూ పోలీసులను, అధికారులను బెదిరిస్తున్నారని… జగన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు బాలినేని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆయనను ప్రజలు నమ్మాలి కదా? అని అన్నారు. జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని… ఓటు ఎవరికి వేశారని సర్వేలు చేసేవారు అడిగినా ప్రజలు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీకి ఓటు వేయలేదని చెపితే తమను ఏం చేస్తారో అని భయపడే పరిస్థితి ఉండేదని అన్నారు.

అందరూ తనవల్లే గెలిచారని జగన్ చెప్పుకునేవారని… ఇప్పుడు అందరూ ఓడిపోయారని, వాళ్లంతా జగన్ వల్లే ఓడిపోయినట్టే కదా? అని బాలినేని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జగన్ ఒప్పుకోవాలి కదా? అని అన్నారు. ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ప్రజలు తప్పు చేశారని అంటున్నారని ఎద్దేవా చేశారు.

క్యాన్స‌ర్ చికిత్స‌పై వ్యాఖ్యలు.. రూ. 850 కోట్లు చెల్లించాలంటూ న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు లీగల్ నోటీసు!

డైట్ కంట్రోల్ వ‌ల్ల త‌న భార్య‌కు స్టేజ్‌-4 క్యాన్స‌ర్ న‌య‌మైందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
డైట్ కంట్రోల్ వ‌ల్ల త‌న భార్య నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్‌-4 క్యాన్స‌ర్ (రొమ్ము క్యాన్సర్) న‌య‌మైందన్న‌ భార‌త మాజీ క్రికెట‌ర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ లీగల్ నోటీసు పంపింది. ఏడు రోజుల్లోగా భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని నోటీసులో పేర్కొంది.సిద్ధూ వ్యాఖ్య‌లు క్యాన్స‌ర్ బాధితుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉన్నాయ‌ని, ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరింది. లేనిప‌క్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంద‌ని నోటీసులో పేర్కొంది. ఇక సిద్ధూ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇప్ప‌టికే ముంబ‌యిలోని టాటా మెమోరియల్ ఆసుప‌త్రికి చెందిన ఆంకాలజిస్టులు తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే.

ఇలాంటి నిరాధార‌మైన వ్యాఖ్య‌లు ఎవ‌రు చేసినా న‌మ్మొద్ద‌ని వైద్యులు అన్నారు. సిద్ధూ వ్యాఖ్య‌ల‌కు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుప‌త్రి త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కేవ‌లం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపింది.

కాగా, స్టేజ్‌-4 క్యాన్స‌ర్ నుంచి తన భార్య పూర్తిగా కోలుకోవడంపై విలేకరుల సమావేశంలో సిద్ధూ ఇటీవల కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. స్వదేశీ ఆహారం వల్లనే కేవలం 40 రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకున్నారని ఆయ‌న పేర్కొన్నారు. తన భార్య 4వ దశ క్యాన్సర్‌ను అధిగమించడంలో డైట్ కంట్రోలే ప్రధాన కారణమని సిద్ధూ తెలిపారు.

అందులోనూ పాల ఉత్పత్తులు, చక్కెర వంటివి తినకపోవడం.. హల్దీ (పసుపు), వేప, తుల‌సి వంటివి తినడం ద్వారా క్యాన్సర్‌ను జ‌యించవచ్చ‌ని సిద్ధూ చెప్పారు. అలా చేయ‌డం వ‌ల్లే త‌న భార్య స్టేజ్‌-4 క్యాన్స‌ర్ నుంచి పూర్తిగా కోలుకున్నార‌ని చెప్పుకొచ్చారు.

ట్రంప్ సెక్యూరిటీపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఆయన సేఫ్ గా లేరన్న రష్యా ప్రెసిడెంట్
ట్రంప్ తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసలు
ముప్పును గుర్తించి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నట్లు పుతిన్ వెల్లడి

అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏమాత్రం సేఫ్ గా లేరని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఒకటికి రెండుసార్లు ట్రంప్ పై హత్యాయత్నం జరగడం, మరోసారి ట్రంప్ సభకు ఓ అనుమానితుడు ఆయుధాలతో హాజరుకావడం తదితర సంఘటనలను పుతిన్ ప్రస్తావించారు. అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం అసాధారణమేమీ కాకున్నా వెంటవెంటనే జరగడం మాత్రం అసాధారణమేనని అభిప్రాయపడ్డారు. తన అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ డేంజర్ లోనే ఉన్నాడని చెప్పారు. అయితే, ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి, నాయకుడు అని ప్రశంసలు గుప్పించారు. తనకు పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న పుతిన్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రత్యర్థులు ఆయన పిల్లలను, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పుతిన్ పేర్కొన్నారు. ట్రంప్ ను ఎదుర్కొనేందుకు ఆయన ప్రత్యర్థులు అనాగరిక పద్ధతులు ఎంచుకున్నారని విమర్శించారు. మరోవైపు, ఉక్రెయిన్ విషయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీరు సరికాదని పుతిన్ మండిపడ్డారు. అమెరికా ఉక్రెయిన్ కు అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ ఇటీవల అనుమతించిన విషయాన్ని పుతిన్ గుర్తుచేశారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం ట్రంప్ ను మరింత ఇరకాటంలోకి నెడుతుందని, బహుశా అందుకోసమే బైడెన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు. అయితే, బాధ్యతలు చేపట్టాక దీనిపై ట్రంప్ సరిగ్గా స్పందిస్తాడని తాను భావిస్తున్నానని, ఏదేమైనా చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని పుతిన్ వివరించారు.

రఘురామ కృష్ణరాజుపై చిత్ర హింసల కేసు .. విజయపాల్ కస్టడీకి పోలీసుల పిటిషన్

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజుపై చిత్రహింసల కేసులో సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బయిల్ మంజూరుకు నిరాకరించిన నేపథ్యంలో ఇటీవల పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గురువారం గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జి.స్పందన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. ఈ కేసులో విజయపాల్ కీలకపాత్ర పోషించారని, విచారణకు సహకరించలేదని, కీలక సమాచారాన్ని ఇవ్వకుండా విచారణను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పోలీసులు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఆయనను మరింత విచారించి ఈ కేసులో కుట్రకోణంలో పాటు హత్యాయత్నం చేసిన విధానాన్ని కనుగొనాల్సి ఉందని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. విజయపాల్ తరపున న్యాయవాది దీనిపై తాము కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు.

డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ ‘షీట్స్‌’ను ప్రవేశపెట్టిన షేర్‌.మార్కెట్‌

0

ముంబయి: మార్కెట్‌ కార్యకలాపాలలో పాలుపంచుకునే వారికి శక్తినిచ్చి, వారి ట్రేడిరగ్‌ అనుభవాన్ని మెరుగుపరిచేలా డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ రంగంలోనే మొదటిసారిగా షీట్స్‌ను ఆవిష్కరిస్తున్నామని ఫోన్‌పే ప్రోడక్ట్‌ అయిన షేర్‌.మార్కెట్‌ ప్రకటించింది. వెబ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ట్రేడ్‌.షేర్‌.మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ షీట్లు మార్కెట్‌ డేటాను నేరుగా ఒక స్ప్రెడ్‌ షీట్‌లోకి దిగుమతి చేసుకుని, తమ సొంత ట్రేడిరగ్‌ నమూనాలు, వ్యూహాలను క్రియేట్‌ చేసుకురావడం ద్వారా ట్రేడర్లకు సహాయపడుతాయి. షీట్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకురావడమే కాక, దేశంలోనే ఇలాంటి వినూత్నమైన ఫీచర్‌ అందించే ఏకైక డిస్కౌంట్‌ బ్రోకర్‌గా షేర్‌.మార్కెట్‌ అవతరించింది. ఈ అత్యాధునిక టూల్‌ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న వారు తమ తెలివి తేటలకు పదను పెట్టుకుని, మార్కెట్‌ కార్యకలాపాల్లో చేపట్టాల్సిన చర్యలను తెలుసుకోవడంలో సహాయపడుతుంది.

స్నాప్‌ డ్రాగన్‌ ఎల్కెట్‌ ఫ్లాగ్‌షిప్‌తో రియల్‌మీ జి టి 7 ప్రొ విడుదల

0

హైదరాబాద్‌: రియల్‌మీ అనేది అత్యంత యువతలో అత్యంత పేరుగాంచిన బ్రాండ్‌. అది తాజాగా చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న రియల్‌మీ జి టి 7ప్రొని భారత దేశపు మొట్టమొదటి స్నాప్‌ డ్రాగన్‌ 8 ఎల్కెట్‌ ఫ్లాగ్‌షిప్‌ చిప్‌సెట్‌తో పరిచయం చేసింది. ‘‘పుట్టిందే అధిగమించడానికి’’ అనే గమ్యంతో ప్రతి తరం జి టి డిజ్కెన్‌ చేయబడినది. అది ఎక్కడా చూడని పనితీరుని అందిస్తుంది. అది సాధ్యమైనంతవరకు పరుధులను వెనక్కి నెడుతూ ఎక్కడా చూడని పనితీరుని అందించడానికి సహాయపడుతుంది. రియల్‌మీ జి టి 7 భారత దేశంలో స్నాప్‌ డ్రాగన్‌ 8 ఎల్కెట్‌ ఫ్లాగ్‌ షిప్‌ చిప్సెట్‌ ఫీచర్‌ని అందించే మొదటి పరికరం. అది పనితీరుకి కొత్త ప్రమాణాలను సెట్‌ చేస్తుంది. అది ఆన్‌ టు టు స్కోర్‌ తో 3 మిలియన్ల మందికి మెరుగైన పనితీరుతో నిలుస్తుంది. ఫోటోలు తీసుకోవాలి అనుకునే వారికి రియల్‌ మీ జి టి 7ప్రొ సోనీ ఐఏంఎక్స్‌ 882 పెరిస్కోప్‌ కెమెరాతో వస్తుంది. రియల్‌మీ జి టి 7 మార్స్‌ ఆరెంజ్‌, గెలాక్సీ గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. అది 56,999 రూపాయలకు 12జీబీG256జీబీ, 62,999 రూపాయలకు 16జీబీG512జీబీతో రెండు స్టోరేజ్‌ రకాలలో కూడా అందుబాటులో ఉంటుంది.

భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌తో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ భాగస్వామ్యం

0


ముంబై: ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఏయూ ఎస్‌ఎఫ్‌బీ), భారతదేశంలో అతిపెద్ద స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఒకటి. భారతీ లైఫ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (భారతి గ్రూప్‌) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, వ్యూహాత్మక బ్యాంక్‌ అస్యూరెన్స్‌ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారం ఏయూ ఎస్‌ఎఫ్‌బీ వినియోగదారులకు విస్తృతమైన జీవిత బీమా, ఆర్థిక భద్రతా పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో, ఎఏయూ ఎస్‌ఎఫ్‌బీ డిప్యూటీ సీఈవో గ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ తిబ్రేవాల్‌, భారతి ఆక్సా లైఫ్‌ ఎండీ, సీఈవో పరాగ్‌ రాజా ఈ ఇన్సూరెన్స్‌ ఒప్పందంపై సంతకం చేసి, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు.

అపోలో హాస్పిటల్స్‌ అరుదైన రికార్డు

0

హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ అరుదైన రికార్డు సృష్టించింది. 24 రోజుల్లో 25 క్లిష్టమైన స్లీప్‌ డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ శస్త్రచికిత్సలు చేసింది. ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు చేయడం ప్రపంచంలోనే అరుదైన ఘనతగా చెప్పవచ్చు. అది కూడా 24 గంటలలో డిశ్చార్జితో. డాక్టర్‌ ధనుంజయరావు గింజుపల్లి ఆధ్వర్యంలో ఈ రికార్డు స్థాయి శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని అపోలో మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ ధనుంజయరావు మాట్లాడుతూ మూమెంట్‌ డిసార్డర్స్‌ వంటి పార్కిన్సన్స్‌ వ్యాధి, ఎసెంషియల్‌ ట్రెమర్స్‌, డిస్టోనియా లాంటి వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో ఈ వ్యాధుల సంఖ్య అధికంగా ఉన్నాయన్నారు. పార్కిన్సన్స్‌ వ్యాధి దేశంలో పది లక్షల మందికి పైగా ప్రభావితం చేస్తుందన్నారు. ఇది భారతదేశాన్ని న్యూరాలజికల్‌ వ్యాధుల ప్రధాన కేంద్రంగా మార్చుతుందని చెప్పారు. దీనిని నివారించేందుకు అపోలో హాస్పిటల్స్‌ హైదరాబాద్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) శస్త్రచికిత్సను ప్రవేశపెట్టిందని తెలిపారు.

డిస్కవర్ అనంతపురం గ్రీన్ ఆర్మీ తో చేతులు కలిపిన ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తుల అసోసియేషన్

విశాలాంధ్ర అనంతపురం : నగరంలో గత రెండు వారాలుగా నో టు ప్లాస్టిక్ బ్యాగ్స్ కార్యక్రమం కింద లక్ష బట్ట బ్యాగులు ఉచితంగా నగర ప్రజలకు పంచుతూ వారిలో అవగాహన కల్పిస్తూ విశేష స్పందన లభించిన అనంతపురం అనిల్ కుమార్ కార్యక్రమానికి గురువారం మాజీ సైనిక ఉద్యోగస్తులు వారితో చేతులు కలిపారు. ఈ సందర్భంగా మాజీ సైనికు ఉద్యోగి షేక్ అన్నా మాట్లాడుతూ… సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం వల్ల నగరానికి నగర ప్రజలకు జరిగే నష్టం వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని అందువలన నగర ప్రజలకు అలాగే పారిశుధ్య కార్మికులకు చెప్పలేని నష్టం జరుగుతుందని గ్రీన్ ఆర్మీ చేస్తున్న ఈ లక్ష బ్యాగుల మహాయజ్ఞంలో తాముపాలుపంచుకుంటున్నామన్నారు. దేశ పరిరక్షణ కోసం మేము బార్డర్లో పనిచేస్తుంటే పర్యావరణ పరిరక్షణ కోసం డిస్కవర్ అనంతపూర్ గ్రీన్ ఆర్మీ వ్యవస్థాపకులు అనంతపూర్ అనిల్ కుమార్ ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేదించాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ బట్టల సంచులను వితరణ చేయడం అభినందనీయమన్నారు. అనంతపూర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ… ఈరోజు పాతూరులోని మార్కెట్లో సుమారు రెండున్నర వెయ్యి బట్ట బ్యాగులు ప్రజలకు గ్రీన్ ఆర్మీ సభ్యులు మరియు మాజీ సైనికులు పంచడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక్ ఉద్యోగులు భాష, గ్రీన్ ఆర్మీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎంపిక…

ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం : అనంతపురంలోని పిటిసి గ్రౌండ్లో ఈనెల 21వ తేదీన ఎస్జీఎఫ్-అండర్ 19 క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ధర్మవరం పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని అయిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజ్ దీపిక రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులకు అభ్యాసాలు నిర్వహించడం జరుగుతుందని, జాతీయ, రాష్ట్ర పోటీలకు కూడా మా విద్యార్థినీలు ఎంపిక కావడం జరుగుతోందని తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తూ, ఆరోగ్య సూత్రాలను కూడా విద్యార్థులకు వివరిస్తూ, విద్య యందు కూడా మంచి ప్రతిభను కనబరుచుచున్నామని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు, బోధనేతర బృందం, తల్లిదండ్రులు తేజ్ దీపికాకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.