Friday, January 10, 2025
Home Blog Page 76

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

0

శాసనసభ్యులు బడేటి చంటి….

ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి (పేర్కొన్నారు). గురువారం స్థానిక బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేయగా ఎన్నికల కోడ్ అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించి మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడిపి మూడవ డివిజన్ ఇంచార్జ్ జాలా బాలాజీ, కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, నగర కార్పొరేషన్ మాజీ విప్ గూడవల్లి వాసు, పలువురు కార్పొరేటర్లు, టిడిపి సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్,పెద్ది బోయిన శివప్రసాద్,చల్లా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ గ్రంథాలయ అధికారికి సన్మానం

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ గ్రంథాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తొలత నివాళులు అర్పించారు. తర్వాత ఉత్తమ గ్రంథాల అధికారి మహబూబ్ బాషాను ఘనంగా సన్మానించారు, సన్మాన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్ బాషా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ యొక్క చేతులు మీదుగా ఆగస్టు 15న మహబుబ్ బాషా ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అవార్డు తీసుకోవడం మన పెనుకొండ కు ఎంతో గరవకారణం అని అన్నారు. ఈ యొక్క జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఉత్తమ గ్రంథాలయ అధికారి అయిన టువంటి మహబూబ్ బాషాని మన సన్మానించుకోవడం ఎంతో గర్వకారణమైన విషయం అన్నారు,మంచిస్వభావి,గ్రంథాలయంలోని పుస్తకాలను పరిరక్షింక్షిచడం ,ప్రాచీన గ్రంధాలను బద్రపరచడం.పాఠకుల యొక్క సంఖ్యను పెంచడంలోనూ గ్రంధాలయం పరిశుభ్రంగా ఉంచడంలోని గ్రంథాలయాన్ని విద్యార్థులకు ఉపయోగ కరంగా మలచటంలోను, పాఠకుల ఆదరణ పొందడం లోను, పాఠకులకు అందుబాటులో కావాల్సిన పుస్తకాలని భద్ర పరచ డంలోను.నియమ నిబంధనలను పాటిస్తూ గ్రంథాలయయాన్ని అన్ని విధాలుగా అందరికీ అందు బాటులోకి తీసుకు రావటంలో చాలా కృషిచేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంఎన్ మూర్తి , .నంజుశీడ ఇమ్రాన్, పెద్దన్న, రామాంజ నేయులు, నారాయణ, జాఫర్ వలి పాన్ భాష,ప్రతాపరెడ్డి, శివ, నరసింహులు, గ్రంధాలయ పాఠకులు మరియు తదితరులు.

సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే

మంత్రి పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర -అనంతపురం : శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక డ ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ మేయర్ వసీం, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పూల నాగరాజు, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, డిఆర్ఓ ఏ.మాలోల, తదితరులు పాల్గొని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సమాజంలో మార్పు తెచ్చిన, స్ఫూర్తి నింపిన వ్యక్తులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. అణగారిన వర్గాలను సమాజంలో వేరుచేసి చూస్తున్న రోజుల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే సమాజంలో మార్పులను తీసుకురావాలని పూలే తను, తన భార్యతో మాత్రమే తన మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించారన్నారు. జ్యోతిబా పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో సామాజిక అంతరాలు తొలగించేందుకు దేశంలో మొట్టమొదటిసారి ప్రయత్నం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతీరావ్ ఫూలే వర్థంతి కి ఘన నివాళి

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర పెనుకొండ : పెనుకొండ పట్టణం లోని టిడిపి కార్యాలయం నందు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, మహాత్మా జ్యోతి రావ్ ఫూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడని,
ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారని ,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని మతాలు, కులాల పేద ప్రజల అభ్యున్నతి కి కృషి చేశాడని టీడీపీ నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు,నారాయణస్వామి, చంద్రమౌళి, వెంకట రాముడు, మాజీ సర్పంచ్ అశ్వర్థ నారాయణ, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, మండల రూరల్ కన్వీనర్ సిద్దయ్య, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ , కౌన్సిలర్ గిరి,రామలింగ, నరేంద్ర, పులుగుర శ్రీనివాసులు,బోయ నంజుండ కురబ నంజుండ సూరి , గోపి, చెన్నరాయుడు, లక్ష్మీదేవమ్మ, శ్రీదేవి సుబ్రమణ్యం మల్లికార్జున సోము తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. రైతు సంఘం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ విమర్శించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు కాస్తో కూస్తో గిట్టుబాటు ధర ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా నిట్టనిలువ ముంచే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడైనా రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తానని అబద్దపు హామీలు ఇచ్చిందన్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 వేలు ఇస్తానని చెప్పి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రైతులకు ఇంతవరకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక మోడీ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదని వారన్నారు. వెంటనే మిర్చి ధరకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పంట నష్ట పరిహారం కింద మిర్చిని కూడా చేర్చాలని, అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో 1000 మంది పైగా రైతులు ట్రాన్స్ ఫార్మర్లు కోసం డీడీలు చెల్లించినా కూడా ఇంతవరకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వకుండా కూటమీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగిలి మారెప్ప, మదరసాబు, రజ్జప్ప, బుడ్డన్న, మహబూబ్, ముక్కన్న, భాష, తదిత రైతులు పాల్గొన్నారు.

గ్రామ న్యాయాలయాలు ఏర్పాటుపై న్యాయవాదులు నిరసన, విధులు బహిష్కరణ

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర పెనుకొండ : పెనుకొండ లోని కోర్టు ప్రాంగణం నందు గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలియ జేసారు. న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వము తెచ్చిన గ్రామ న్యాయాలయాల వ్యవస్థ కక్షిదారులకు హక్కులను తీవ్రంగా హరించి వేస్తుందని, వాటి వల్ల కక్షి దారులకు లాభం కన్నా నష్టం ఎక్కువ అని, కోర్టుల్లో కేసులు పెండింగ్ పెరిగి పోవుటకు ప్రధాన కారణం ఉన్న కోర్టులకు తగిన సిబ్బంది, సకాలంలో జడ్జీల నియామకం లేకపోవడం, కోర్టుల సంఖ్య పెంచక పోవడం ప్రధాన కారణం కావున జడ్జిలను సకాలంలో నియమించి కోర్టు సంఖ్యలను పెంచి కేసుల పరిష్కరించక కేసులు దిగువ కోర్టుల్లో పేరుకుపోతున్నాయనిగ్రామ న్యాయాయలాలు ఏర్పాటు చేస్తే గ్రామాలలో బలవంతునికి ఆధిపత్యం పెరుగుతుంది కానీ, నిజమైన కక్షిదారునికి న్యాయం జరగదని అలాగే చాలా ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుం దని ,ప్రభుత్వము ఉన్న కోర్టులకు తగిన సహకారం అందిస్తే కేసులు త్వరగా పరిష్కారం చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారని అలా చేయకుండా గ్రామ న్యాయల యాలు ఏర్పాటు వెంటనే రద్దుచేయాలని నిరసన తెలియ జేస్తూ కోర్టు విధులను బహిష్క రించారు,ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభు త్వము వెనక్కి తీసుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు, వైఎస్ ఆర్సీపీ లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి నాగరాజు, ముదిగుబ్బ శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఆసిఫ్, నాగిరెడ్డి, మోహన్, అశ్వర్థ నారాయణ, బాలాజీ, హరి, విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం: రేవంత్ రెడ్డి

0

గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో తరచుగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుంటుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, గురుకులాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని అన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలని సీఎం చెప్పారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు డైట్ ఛార్జీలను కూడా పెంచామని తెలిపారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరించారు. పదేపదే హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ అన్నారు. బాధ్యులపై జిల్లా కలెక్టర్లు వేటు వేయాలని ఆదేశించారు.

అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని క‌థ‌లు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ

తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట్వ‌ర్యూ ఇచ్చిన వ‌ర్మ
తాను ఎక్క‌డికి పారిపోలేద‌ని వివ‌ర‌ణ‌
ఒంగోలు పోలీసులు త‌న‌ను అరెస్టు చేయ‌డానికి రాలేద‌న్న ఆర్‌జీవీ

అజ్ఞాతంలో ఉన్న‌ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక వీడియో విడుద‌ల చేశారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డటం లేద‌ని, సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌డంతోనే పోలీసుల విచార‌ణ‌కు రావ‌డంలేద‌ని వివ‌రించారు.తాజాగా మ‌రోసారి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న కోసం పోలీసులు వెత‌క‌డంపై ఆర్‌జీవీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేద‌న్నారు. ఒక‌వేళ త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేస్తే, జైల్లో కూర్చుని క‌థ‌లు రాసుకుంటాన‌ని చెప్పుకొచ్చారు. అలాగే ఒంగోలు పోలీసులు త‌న‌ను అరెస్టు చేయ‌డానికి రాలేద‌న్నారు. వాళ్లు క‌నీసం త‌న ఆఫీస్‌లోకి కూడా రాలేద‌ని తెలిపారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌లువురు త‌న‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించ‌డం చేస్తున్నార‌ని, అది న‌చ్చ‌కే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాన‌ని చెప్పుకొచ్చారు.

నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుపానుగా మారే అవకాశం ఉండటంతో ఆ ప్రభావం ఏపీకి కూడా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి, ఆపై తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్లై, చెన్నై మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా సూచించిన ాఫెంగల్్ణ అనే పేరును ఈ తుపానుకు పెట్టడం జరిగింది. తుపాను ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే, వచ్చే మూడు రోజులపాటు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, క‌ృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

బంగాళాఖాతంలో తుఫాన్.. ఏపీలో ప‌లు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ శాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఇది బుధవారం సాయంత్రం తుపాను (ఫెంగల్)గా బలపడింది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. ఫెంగల్ తుపాను శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపుకు కదిలే అవకాశముంది. ఈ నెల 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్ 4తో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో వైపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఎవరూ డిసెంబర్ 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఫెంగల్ తుపాను దూసుకుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని తెలిపారు.