Thursday, January 9, 2025
Home Blog Page 77

ఓనం చీరను ధరించి, రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణస్వీకారం..

వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకాగాంధీ ఘన విజయం
ప్రియాంకతో ప్రమాణస్వీకారం చేయించిన స్పీకర్ ఓం బిర్లా


కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంకాగాంధీ ప్రమణస్వీకారం చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం చేశారు. కేరళ సంప్రదాయ ఓనం చీరను ధరించి ఆమె పార్లమెంటుకు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను పార్లమెంటుకు తోడ్కుని వచ్చారు. ఇటీవల వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ప్రియాంక ఘన విజయం సాధించారు. 4.10 లక్షల భారీ మెజార్టీతో ఆమె జయకేతనం ఎగురవేశారు. ఆమెకు మొత్తం 6.22 లక్షల ఓట్లు పడ్డాయి. నాందేడ్ ఉపఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావ్ చవాన్ కూడా ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారాల కార్యక్రమం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను మధ్యాహ్నం 12 వరకు స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

ఇసుక దొరకడం లేదన్న మాట ప్రజల నుంచి వినిపించకూడదు

ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై గనుల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్‌లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదని పునరుద్ఘాటించారు.ఇసుక తవ్వకాలు, రవాణాను అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక దొరకడం లేదన్న మాట ఎవరి నోటా వినిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లిన ప్రతి వినియోగదారుడితో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించారు. ఇందు కోసం వినియోగదారులకు ఫోన్లు చేసే ఐవీఆర్ఎస్‌ను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్)తో అనుసంధానించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇసుకకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రీచ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. మాన్యువల్, సెమీ మెకనైజ్డ్‌గా తవ్వకాలకు అవసరమైన అనుమతులు అన్నీ తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా ఖర్చులు మరింత తగ్గించేలా చూడాలని సూచించారు. రవాణా ఖర్చు తగ్గించేందుకు ఏమి చేయాలో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత వినియోగానికి ఇసుక అవసరమైన వారికి ఎటువంటి ఆంక్షలు, జాప్యం లేకుండా ఇసుక లభించేలా చూడాలన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించకుండా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘా కోసం తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఇసుక రవాణాలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్

తాను పెట్టిన ఒక పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడుతున్నారన్న వర్మ
ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని పిటిషన్
ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న వర్మ
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్స్ లో తాను పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని… ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తుండటం చట్ట విరుద్ధమని అన్నారు. ఇకపై కేసులు పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని, ఇప్పటి వరకు నమోదైన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టును కోరారు.

మరోవైపు వర్మ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరగాల్సి ఉంది. అయితే, ఆ పిటిషన్ విచారణకు రాలేదు. ఈరోజు వర్మ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. వర్మ కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. విచారణకు హాజరుకాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వర్మపై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు.

ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ లిమిటెడ్‌తో అమెజాన్‌ భాగస్వామ్యం

0

ముంబై: ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అనేది ఒక ప్రముఖ నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ). ఇది అమెజాన్‌ అర్హత కలిగిన కస్టమర్‌లు, వ్యాపారులకు స్థోమత పెంచే లక్ష్యంతో వినూత్న క్రెడిట్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి అమెజాన్‌ ఫైనాన్స్‌ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ముంబైలో ఎల్‌టీఎఫ్‌ నిర్వహించిన బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మరియు ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) సెక్టార్‌లో భారతదేశం ప్రీమియర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నేపథ్య ఈవెంట్‌, ‘రెయిస్‌ 2024’లో ఫిన్‌టెక్‌ భాగస్వామ్యం ప్రకటించబడిరది. ఈ భాగస్వామ్యం ఎల్‌టీఎఫ్‌ ఉత్పత్తి వైవిధ్యీకరణ వ్యూహాన్ని మెరుగుపరుస్తుంది. వినియోగదారులకు వేగంగా, సజావు పద్ధతిలో క్రెడిట్‌ లభ్యతను మెరుగుపరుస్తుంది.

కర్షక, కార్మికాగ్రహం

0

. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
. నాలుగు లేబర్‌కోడ్‌లు ఎత్తివేయాలని డిమాండ్‌
. ఏపీ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మికసంఘాల ఐక్యవేదిక ధర్నాలు
. రాజ్యాంగ లక్ష్యాలను కాపాడాలని రాష్ట్రపతికి ఓబులేసు, వడ్డే, కేవీవీ వినతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రైతు, కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ సంయుక్త కిసాన్‌మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన 25 ప్రధాన డిమాండ్లపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. రాజ్యాంగ లక్ష్యాలను నీరుగార్చే విధంగా పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై రైతు, కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రైతులు, కార్మికులతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, దళిత, ఆదివాసి, మైనార్టీ,మహిళా సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు పన్నులు కడుతుంటే, లాభాలు కాంట్రాక్టర్లకు అందుతున్నాయని, సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుంటే, కార్పొరేట్లకు భారీ రుణమాఫీలు చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన తప్పుడు విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకే రాజ్యాంగ దినోత్సవమైన నవంబరు 26వ తేదీన ఈ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టినట్లు నేతలు వెల్లడిరచారు. ఈ పిలుపులో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ నగర సమితికి చెందిన రైతు, కార్మిక సంఘాల అధ్వర్యంలో విజయవాడలో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రైతులు పండిరచే అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు లేబర్‌ కోడ్‌లు ఎత్తివేయాలని నినదించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడ నుంచి బందరు రోడ్డు మీదుగా డాక్టర్‌ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ విగ్రహం మహాస్మృతి వనం వరకు ప్రదర్శన సాగింది.
అనంతరం ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ డాక్టర్‌ ఎంఎస్‌ సోమనాథన్‌ రైతు కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆత్మహత్య నివారణకై కేరళ తరహాలో ‘ రైతు రుణ ఉపవమన చట్టం’ను ఏపీలో కూడా తీసుకురావాలన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని, నిర్బంధ భూసేకరణ చేయరాదని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రోజు వేతనం రూ.600లకు పెంచాలని, ఒప్పంద, పొరుగు సేవలు, రోజువారీ, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరారు. సీపీఐ నగర విజయవాడ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యల్లమందారావు, వై. కేశవరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి యు. ఉమామహేశ్వరరావు, ఇఫ్టూ నేతలు పి. పోలారి, పి. ప్రసాద్‌, ఏఐయూటీసీ నాయకులు సుధీర్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె. ఉమామహేశ్వరరావు, సుబ్బరావమ్మ, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలవరపు కృష్ణా, ఏఐసీసీటీయూ ఈశ్వర్‌, డి. హరినాధ్‌, యు.వీరబాబు, టి.ప్రకాష్‌, ఎం.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి : పి.రామచంద్రయ్య
ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరణను నిలిపివేయాలని, దుర్మార్గమైన నాలుగుకోడ్‌లను రద్దుచేయాలని రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. జాతీయ సంఘాల పిలుపు మేరకు కర్నూలు, ఆదోనిలో బారీ ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఏపీ రైతుసంఘంరాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం,చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు , సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప, కార్మిక, రైతుసంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా కర్నూలు జిల్లా పరిషత్‌ నుండి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు విడనాడాలి: ఆర్‌.రవీంద్రనాథ్‌
దేశ ప్రజలకు నష్టం కలిగించే కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర కార్మిక,రైతు సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. రాంబాబు అధ్యక్షతన ఈ ధర్నాను ఉద్దేశించి ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాథ్‌, రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర కార్యదర్శి డి.వర్మ మాట్లాడారు. సర్వసంపదలు

పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది

జిల్లా మలేరియా అధికారి-ఓబులు
విశాలాంధ్ర ధర్మవరం:: ఇంటితో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని జిల్లా మలేరియా అధికారి ఓబులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆకస్మికంగా పట్టణంలోని శారద నగర్, తదుపరి మున్సిపల్ ఆఫీస్ వెనుక భాగానగల ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా వారు తనిఖీ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా రోగాల యొక్క పరిస్థితిని వారు గమనించారు. కంప్యూటర్లో నమోదు చేసిన వాటిని కూడా వారు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యము, మందులు పంపిణీ చేయాలన్నారు. రోగి పైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేయరాదని తెలిపారు. తదుపరి శారదానగర్లో పలు ఇళ్లల్లో డ్రమ్ము, నీటి తొట్టిలను వారు పరిశీలించారు. నీరు నిల్వ ఉండడం చూచి సిబ్బందితో నీటిని తొలగింపజేశారు. చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉన్న వాటిని పూర్తిగా మీరు తొలగించుకోవాలని అక్కడి ప్రజలకు వారు సూచించారు. ప్రజల నుంచి ఏవైనా జ్వరాలు వచ్చే పరిస్థితి ఉందా? ఇంతకు మునుపు వచ్చిందా? మరి ఏమైనా రోగాలు వచ్చాయా? అన్న వివరాలను నేరుగా ప్రజల వద్ద అడిగి తెలుసుకున్నారు. నీరు నిల్వ ఉన్నచోట దోమలు లార్వా స్థితిలో ఉంటూ గ్రుడ్లు పెడతాయని తెలిపారు. ఈజిప్ట్ అనే ఆడదోమ మనిషికి పుట్టినప్పుడు డెంగ్యూ చికెన్ గునియా అనే వ్యాధులు వస్తాయని తెలిపారు. తదుపరి అక్కడి ప్రజలకు ఈ వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు రాత్రి సమయాలలో దోమతెర కట్టుకోవాలని, వేపాకు పొగ పెట్టాలని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి జయరాం నాయక్, ఎం పి హెచ్ ఈ ఓ గిరిధర్ రెడ్డి, సూపర్వైజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రహదారులకు గ్రావెల్ తో మరమ్మతులు

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని పీకలబెట్ట గ్రామంలో పంచాయతీ నిధులతో గ్రామ సర్పంచ్ మూలింటి లక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ నేత మూకిరెడ్డి రహదారులకు గ్రావెల్ వేసి మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా మూకిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వర్షాలకు రహదారులు గుంతలు పడ్డాయని గుర్తు చేశారు. వీటికి గ్రామ పంచాయతీ నిధులతో గ్రావెల్ వేయించి మరమ్మతులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

మామిడి సాగు చేసిన రైతులకు అవగాహన సదస్సు..

జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామములో గల రైతు సేవ కేంద్రం నందు మామిడి సాగు చేసిన రైతులకు అవగాహన సదస్సును జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, డివిజన్ ఉద్యాన అధికారిని అమరేశ్వరి నిర్వహించారు. మామిడి చిగుళ్ళు మొగ్గ రావడానికి 0.52:34(మూడు గ్రాములు), సూపర్ కాన్ఫిడర్ అర్ధ మిలిటరీ, ఆగ్రోమిన్ మాల్స్ రిక్సోలిన్ ఒక గ్రామం, కాంటాక్ట్ భావిస్టిక్ షాపు మూడు గ్రాములు కలిపి స్ప్రే చేయడం ద్వారా చిగుళ్ళు మొగ్గ రావడానికి అనుకూలమైన సమయం ఏర్పడుతుందని తెలిపారు. తదుపరి స్ప్రే చేశాక డిసెంబర్లో 8వ రోజు లేదా 10వ తేదీ వర్షం పడకపోతే తప్పక నీరు పెట్టాలని తెలిపారు. నీరు పెట్టేటప్పుడు సల్ఫర్ లిక్విడ్ ను నాలుగు లీటర్ల డ్రిప్ ద్వారా పంపాలని తెలిపారు. స్ప్రే చేసేటప్పటికీ పూత రాకపోతే డబుల్ ఒక ఎం ఎల్తో పాటు విపుల్ 3 ఎం ఎల్ లేదా ఫ్రాన్పిక్స్ 10 లీటర్లు, సైటు జైమ్ 20 ఎంఎల్ కలిపి స్ప్రే చేయాలని తెలిపారు. అలాగే పురుగు గురుడు చెట్టు మొదలు లో ఉన్నట్లయితే కరాటే డిసిసెస్ అర్ధా ఎమ్మెల్, స్ప్రే చేయాలని తెలిపారు. అనంతరం రైతులకు వచ్చిన అనుమానాలను కూడా నివృత్తి చేయడం జరిగిందని తెలిపారు. పంటల ఎడల తగిన శ్రద్ధ తప్పనిసరి ఉండాలని. ఎప్పటికప్పుడు అధికారుల సలహా సూచనలతో పంట దిగుబడి వచ్చే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకములు ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకములను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో హౌసింగ్ ఏఈ. భార్గవి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి సమావేశాన్ని ఏర్పరిచారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.5 లక్షలు రూపాయలు, రాష్ట్ర షేర్ కింద లక్ష రూపాయలు, అలాగే జాబ్ కార్డు ఉంటే అదనంగా 30 వేల రూపాయలు మొత్తం వెరసి రూ .2,80,000, స్థలము ఉండి ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మిస్తుందని వారు తెలిపారు. పేదలకు ఇల్లు నిర్మించడమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలిపారు. తదుపరి అర్హులైన లబ్ధిదారులతో దరఖాస్తులను ప్రాసెసింగ్ మొదలు పెట్టాలని హౌసింగ్ ఏఈ, సచివాలయ సిబ్బందికి సూచించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా సచివాలయం కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ రాష్ట్ర జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక

సెట్టిపి జయచంద్రారెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం : జాతీయ స్థాయిలో ఈ నెల నవంబర్ 29 తేదీ నుండి డిసెంబర్ 05 తేదీ వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా నగరంలో జరిగే 39వ యూత్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు నందు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి బాస్కెట్బాల్ క్రీడాకారిణి ఎంపికయ్యారని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మే 21వ తేదీ నుండి 24 వరకు విజయవాడ నగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల నందు ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు నందు ఎంపికై ఉమ్మడి జిల్లా జట్టులో చక్కగా రాణించి రాష్ట్ర జట్టుకి ఎంపిక అవడం హర్షనీయమని అభినందనీయమని వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు . కిరణ్మయి జాతీయ స్థాయిలో రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు… బాలికల ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టులో కిరణ్మయి ఒక్కరే జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ జట్టుకి ఎంపిక కావడం ధర్మవరం పట్టణానికి గర్వకారణం అని అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు.