Wednesday, January 1, 2025
Home Blog Page 8

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి అంటే…!

సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వినతి
గ్రామీణ ప్రాంత ప్రజల అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగకే విద్యార్ధులకు ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా పనుల వల్ల ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉంటారు. అందుకే సంక్రాంతి సెలవులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024 – 25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటించినందున ఈ సారి 11వ తేదీ నుంచి 15 వరకు, లేదా 12 నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.

ఇప్పటికే 2025 సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయని ఆ జాబితాలో పేర్కొంది.

క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు

ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,850
22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,800

దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దిగుమతి దారులు, బ్యాంకర్ల నుంచి పెరిగిన గిరాకీతో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ భారీగా పతనం, జ్యువైలర్ల నుంచి డిమాండ్ రావడంతో తిరిగి బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.350లు పుంజుకుని రూ.79,200లకు చేరుకుంది. గురువారం తులం బంగారం ధర రూ.78,850ల వద్ద స్థిరపడింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్చత గల బంగారం తులం ధర రూ.350లు పెరిగి రూ.78,800 పలికింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.900 వృద్ధి చెంది రూ.91,700లకు చేరుకుంది. కామెక్స్ గోల్డ్ వ్యూచర్స్‌లో ఔన్స్ గోల్డ్ ధర 13.70 డాలర్లు పడిపోయి 2,640.20 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్ వ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 0.74 శాతం పతనంతో 30.17 డాలర్లకు చేరుకుంది.

క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

వెలగపూడి ఉ జ‌న‌సేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కడప పర్యటనకు బయల్దేరారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఈ దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న వీూణూ పై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఆయన చర్చించారు..కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించారు.

  • ఇక జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యం లోనే ఇవాళ‌ పవన్ కడపకు వెళ్తున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు.

7న విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డిని వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు పిలిచింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్‌రెడ్డి ఏ3గా కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఫార్ములా ఈ-రేసు కేసులో అనేక ఉల్లంఘనలు జరిగాయన్నది ఏసీబీ వాదన. 2022లో తొలిసారి జరిగిన ఒప్పందంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించడం పూర్తిగా నేరపూరిత చర్యేనన్నది ఏసీబీ వాదన. మొత్తం రూ. 54.9 కోట్లను కేటీఆర్ ఆదేశాలతోనే ఖర్చు చేశారని ఏసీబీ ధ్రువీకరించింది.

నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభం
సైనిక లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమయింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్ ఘాట్ సమీపంలో ఉన్న నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. మన్మోహన్ ను తరలిస్తున్న వాహనంలో… ఆయన పార్థివదేహం పక్కన రాహుల్ గాంధీ ఉన్నారు. నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయి. సైనిక లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది. మన్మోహన్ పార్థివదేహాన్ని ఈ ఉదయం ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన పార్థివదేహానికి పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళి అర్పించారు. మన్మోహన్ పార్థివదేహానికి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. మన్మోహన్ భార్య గుర్ శరణ్ కౌర్, ఆయన కుమార్తె పార్థివదేహం వద్ద ఉన్నారు.మరోవైపు మన్మోహన్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈవీఎం గోడౌన్ల తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భధ్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ టీఎస్ చేతన్ తనిఖీ చేశారు.
గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటి కప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు సూచించడం జరిగిందని తెలిపారు. అనంతరం పలు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీ జరిగింది అని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ధర్మవరం ఆర్డీవో మహేష్, ధర్మవరం ఎమ్మార్వో సురేష్ బాబు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రోగులకు సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది..

శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉందని, అది దైవ సేవ అవుతుందని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ పేర్కొన్నరు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, సహాయకులకు మొత్తం 360 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ఆసుపత్రిలోని వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారములతో ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. వారి ఆకలిని తీర్చడం ఆ భగవంతుని సేవతో తాము చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి కుమారి సాయి భవ్య శ్రీ తండ్రి నారాయణరెడ్డి.. ఆర్టీసీ వారు దాతగా వ్యవహరించడం పట్ల, కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవ కార్యక్రమాలకు ఆసక్తిగా గల దాతలు సెల్ నెంబర్ 9966047044కు గాని 9030444065కు గాని సంప్రదించాలని తెలిపారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ గత కొన్నివేలుగా శ్రీ సత్య సాయి సేవ సమితి వారు ఆసుపత్రిలోని వారికి ఇటువంటి సేవలు చేయడం రోగులకు వరంలాగా మారాయని, సుధీర గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారికి, పేద రోగులకు ఈ అన్నదాన సహాయం ఎంతో ఉపయోగపడిందని తెలుపుతూ, దాతలకు శ్రీ సత్య సాయి సేవ సమితి వారికి ఆసుపత్రి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలి

శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి)
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 53వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, డి ఐ ఈ పి ఓ సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) మాట్లాడుతూ… జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో 2020 -23 మరియు 2023- 27 పరిశ్రమల పాలసీలో 15 యూనిట్లకు గాను 239.45 లక్షల రూపాయల సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపారు. సింగిల్ విండో పోర్టల్ లో పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న అనుమతులను నిర్ణీత సమయంలో ఆమోదించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఫ్యాక్టరీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 64 పరిశ్రమలకు స్టాటిటరి నోటీసులు ఇవ్వడం జరగగా, వాటికి సంబంధించిన రిపోర్టులను అందించాలన్నారు. జిల్లాలో 89,500 ఎం‌ఎస్‌ఎం‌ఈలు వుంటే కేవలం 14,000 ఎం‌ఎస్‌ఎం‌ఈలు సర్వే చేయటం జరిగిందని, ఇప్పటివరకు 18 శాతం మాత్రమే సర్వే పూర్తిచేయటం జరిగిందని జనవరి నెలాఖరిలోగా సర్వే పూర్తి చేసేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి జీఎం.శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, కమర్షియల్ టాక్సెస్ డిప్యూటీ కమిషనర్ మురళి మనోహర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, ఎల్డిఎం నర్సింగరావు, డిటిసి వీర్రాజు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రామసుబ్బారెడ్డి, జెడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, సోషల్ వెల్ఫేర్ జెడి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, మార్కెటింగ్ ఎడి సత్యనారాయణ చౌదరి, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, మైన్స్ డిడి వెంకటేశ్వర్లు, ఖాదీ ఏడీ వెంకట్రావు, ఏపీపీసీబీ అనలిస్టు ఉమామహేశ్వరి, ఫ్యాక్టరీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఏపీఐఐసీ మేనేజర్ మల్లికార్జున, నాబార్డ్ ఏజీఎం అనురాధ, ఏపీఎస్ఎఫ్సి బిఎం మహేష్, డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, డిఎస్డిఓ ప్రతాపరెడ్డి, ఆయా శాఖల అధికారులు, పలువురు మెంబర్లు పాల్గొన్నారు.

శ్రీ అన్నమాచార్య విగ్రహం వద్ద నిరసన

విశ్వహిందూ పరిషత్, అన్నమయ్య సేవమండలి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం: తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద శ్రీ అన్నమాచార్య విగ్రహానికి క్రైస్తవ మతానికి చెందిన శాంటా క్లాస్ టోపీని పెట్టి స్వామివారిని అవహేళన చేస్తూ అవమానించడం జరిగింది అని ఎందుకు నిరసనగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణములో ఉన్న అన్నమయ్య విగ్రహం వద్ద విశ్వహిందూ పరిషత్, అన్నమయ్య సేవా మండలి కమిటీ, భక్తాదులు కలిసి నిరసనను వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలవల రామ్ కుమార్, అన్నమయ్య సేవ మండలి అధ్యక్షులు పొరాళ్ళ పుల్లయ్య, వారి శిష్యబృందం, అధిక సంఖ్యలో భక్తాదురు పాల్గొన్నారు.

సకాలంలో యువతిని రక్షించిన ధర్మవరం ఆర్పిఎఫ్ పోలీసులు

విశాలాంధ్ర ధర్మవరం; తిరుపతి-గుంతకల్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి కనపడటం లేదని ఒక తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్ రావడంతో, ధర్మవరం ఆర్పీఎఫ్ పోలీసులు సకాలంలో స్పందించి యువతిని రక్షించి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్పిఎఫ్సి బోయ కుమార్ మాట్లాడుతూ తప్పిపోయిన యువతి హరిత, తమ్ముడు కలికిరి నుంచి గుంతకల్లుకు వెళ్తున్నారని, ముదిగుబ్బ రైల్వే స్టేషన్ అనంతరం రెస్ట్ రూమ్ కు వెళ్లిన ఆమె తిరిగి కోచ్ వద్దకు రాలేదని ఫోన్ ద్వారా తెలపడం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు తప్పిపోయిన హరిత మొబైల్ నెంబర్ను, ధర్మవరం జి ఆర్ పి ఇన్స్పెక్టర్ వారి సహాయముతో ప్రత్యక్ష స్థానాన్ని ట్రాక్ చేయడం జరిగిందని తెలిపారు. దీంతో ఆ యువతి ముదిగుబ్బ-చినగుంటపల్లి స్టేషన్ల మధ్య డి చెర్లోపల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఉనికిని లోకేషన్ గుర్తించిందని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న సెక్షన్ లోని ఆన్ డ్యూటీ కి మెన్ మస్తాన్ను అప్రమత్తం చేసి తక్షణ చర్యలను చేపట్టడం జరిగిందని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఆ అమ్మాయి అనేక గాయాలతో ట్రాక్ పక్కన పడి ఉండటం గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా బత్తలపల్లి మండలంలోని ఆర్డిటి ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. గాయపడిన బాలిక పేరు బోయ హరిత అని గుర్తించడం జరిగిందన్నారు. ఈ అమ్మాయి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన నాగరాజు అనే తండ్రి యొక్క కుమార్తె అని తెలిపారు. కలికిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోందని, హరిత సోదరుడు గిరిబాబుతో సెలవులకు ఇంటికి వెళ్లేందుకు రైల్లో పోవడం జరిగిందని, ముదిగుబ్బ రైల్వే స్టేషన్ తర్వాత వాష్ రూమ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కదులుతున్న రైలు నుంచి హరిత జారిపడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ప్రస్తుతం హరిత ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఆర్డిటి ఆసుపత్రి వైద్యులు తెలపడం జరిగిందని తెలిపారు. ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ తో పాటు జిఆర్పి ద్వారా సమయానికి ఆ అమ్మాయిని రక్షించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేగవంతమైన ప్రతిస్పందన ప్రయాణికుల భద్రత సంక్షేమానికి ఆర్పిఎఫ్ యొక్క నిబద్దతను హైలెట్ చేయడం మాకెంతో గర్వకారణమని తెలిపారు.