తెహ్రాన్:ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని అధ్యక్ష భవనంపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. రాజధానిలో అత్యంత పటిష్ట భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) విరుచుకుపడ్డాయి. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. కచ్చితమైన సమాచా రంతో సుమారు 100 ఫైటర్ జెట్‌లను ఉపయోగించి 250కి పైగా బాంబులను జారవిడిచినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ రాజకీయ, సైనిక నిర్ణయాలు తీసుకునే కీలక కేంద్రంగా ఈ సముదాయం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, ఇజ్రాయెల్‌పై వ్యూహాలను ఇక్కడే రచిస్తారని, అందుకే ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయిల్ తెలిపింది. ఇక్కడి నుంచే ఇరాన్ సైనిక, భద్రతా వ్యవహారాలన్నీ నడుస్తాయని, ఇది ఉగ్రవాద పాలనకు ప్రధాన కార్యాలయంగా మారిందని ఐడీఎఫ్ పేర్కొంది.
ఇరాన్ అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం
- Advertisement -
RELATED ARTICLES


