న్యూదిల్లీ: అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్‌పై అమెరికా సామ్రాజ్యవాద, జియోనిస్ట్ ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) దిల్లీ రాష్ట్ర సమితి సహా ఇతర వామపక్ష పార్టీలు మంగళవారం దిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వహించడంపై ఆగ్రహం వెలిబుచ్చాయి. ప్రపంచశాంతికి విఘాతం కలుగుతున్న ఈ తరుణంలో మౌనం, తటస్థ వైఖరి ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన, సార్వభౌమ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం, పశ్చిమాసియా, అంతకుమించి ప్రపంచ శాంతికి ముప్ప్పు కలిగించే ప్రమాదకరమైన యుద్ధోన్మాద చర్యలను తీవ్రంగా ఖండించాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ ప్రసంగించారు. సీపీఐ దిల్లీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ దినేష్ వర్షిణీ, సీపీఎం సీనియర్ నాయకురాలు బృందా కారత్, సీపీఎం దిల్లీ కార్యదర్శి అనురాగ్ సక్సేనా, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆరఎస్‌పీ కార్యదర్శి ఆరఎస్ డాగర్, ఎస్‌యూసీఐ కార్యదర్శి ప్రాణ్ శర్మ, సీజీఐపీ నాయకులు బిర్జు నాయక్‌తో పాటు సీపీఐ(ఎంఎల్), న్యూ డెమొక్రసీ, ఫార్వర్ బ్లాక్ నాయకులు ప్రసంగించారు. ఇరాన్‌పై జరిగిన దురాక్రమణలో భాగంగా అమెరికా-ఇజ్రాయిల్ కలిసి అయతుల్లా అలీ ఖామేనీ, ఆయన కుటుంబ సభ్యులను, ఇతర ఇరాన్ నాయకులను హత్య చేయడాన్ని వక్తలు తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఇజ్రాయిల్ సైనిక చర్యను అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం, సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించారు. ఇటువంటి దురాక్రమణ ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. ఏకపక్ష సైనిక దురాక్రమణను గట్టిగా వ్యతిరేకించడం ద్వారా భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధాన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచారు. సీపీఐ దిల్లీ రాష్ట్ర నాయకులు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఎనఎఫఐడబ్ల్యూ వంటి ప్రజా సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వం మౌనమెందుకు?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడిని, ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖామేనీ హత్యను నిరసిస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శించాయి. ఇక్కడ అనేక మంది నిరసనకారులు గుమిగూడి, ప్లకార్డులు పట్టుకుని, ఇరాన్‌పై అమెరికాఇజ్రాయిల్ దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దాడికి వ్యతిరేకంగా నిలబడాలని’, ఇరాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేయాలని ప్రజలను కోరారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద దుండగులపై, ఇరాన్‌పై దాడిపై భారత ప్రభుత్వం మౌనం... నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని సీపీఎం నాయకురాలు బృందా కారత్ ప్రశ్నించారు. ‘అతను నెతన్యాహు రక్తంతో తడిసిన చేతులను పట్టుకుని, అది భారత ప్రజల గొంతు అని అన్నాడు... ఇది ప్రజల గొంతు ఎలా అవుతుంది? మీరు మారణహోమానికి సహాయం చేయడానికి ఇజ్రాయిల్‌కు వెళ్లారు’ అని ఆమె అన్నారు. ప్రధాన మంత్రి మోదీ ఇజ్రాయిల్ నుంచి తిరిగి వచ్చిన 24 గంటల్లోనే ఇరాన్‌పై దాడి జరిగిందని కారత్ ఎత్తి చూపారు. ‘మీరు ఆమోద ముద్ర వేయడానికి అక్కడికి వెళ్లారా?’ అని ఆమె ప్రశ్నించారు. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి గజాను పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నారా’ అని గట్టిగా నిలదీశారు. మోదీ విదేశీ సంబంధాలను జాతీయ సార్వభౌమాధికారం కోణం నుంచి చూడాలని కూడా ఆమె అన్నారు. ‘జాతీయ సార్వభౌమాధికారం గురించి ఏమిటి... మీరు ట్రంప్‌కు తలవంచి, ఈ అంశంపై మౌనంగా ఉన్నారు. ఇది సామ్రాజ్యవాద అనుకూల విదేశాంగ విధానం’ అని కారత్ విమర్శించారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ భారత ప్రజలు ఈ యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. ‘ఇరాన్‌పై యుద్ధం నాలుగు రోజులుగా కొనసాగుతోంది. చర్చలు జరుగుతుండగా... ఇరాన్‌పై అమెరికాఇజ్రాయిల్ దాడికి దిగాయి. మనం గత ఏడాది 12 రోజుల యుద్ధం చూశాం. ఇప్ప్పుడిది ఒక మత యుద్ధం దిశలోకి వెళుతుందన్న విషయం స్పష్టమయింది’ అని తెలిపారు. ‘భారత ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతిని పునరుద్ధరించాలి. మోదీజీ ఇజ్రాయిల్ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఈ యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధంలో భారతదేశ పాత్ర ఏదీ లేదన్న విషయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని భట్టాచార్య అన్నారు. ‘భారత ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇరాన్‌లో సుప్రీం లీడర్ హత్యకు గురవడాన్ని మనం చూశాం. ఆయన ఇరాన్‌కు సుప్రీం లీడర్ మాత్రమే కాదు. షియా (ముస్లింలు) కు ఒక పెద్ద మత నాయకుడు కూడా. ఒక ప్రాథమిక పాఠశాలపై బాంబులతో దాడి చేశారు. అమెరికా`ఇజ్రాయిల్ అమాయక చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాయి’ అని ఆయన తెలిపారు.
‘ఈ యుద్ధం ప్రభావం భారత్ పైన మాత్రమే కాకుండా అనేక పశ్చిమాసియా దేశాల్లో పని చేస్తున్న భారతీయులపై కూడా ఉంటుంది. ఇరాన్‌తో మన దేశానికి మంచి స్నేహ, సాంస్కతిక సంబంధాలు ఉన్నాయి. భారత ప్రజలు ఇరాన్‌కు మద్దతుగా నిలబడాలి’ అని కోరారు. ఈ సందర్భంగా ఒక నిరసనకారుడు మాట్లాడుతూ ‘ఒక సార్వభౌమ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద కూటమి జరిపిన దాడి, దాని సుప్రీం నాయకుడిని చంపిన విధానం కేవలం ఒక దేశంపై జరిగిన దాడి కాదు. అన్ని దేశాలకు హెచ్చరిక’ అని వ్యాఖ్యానించారు.
ప్రపంచ శాంతికి ముప్ప్పు
- Advertisement -
RELATED ARTICLES


