అంగన్వాడీ సూపర్వైజర్ సునీత
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : నవజాత శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని అంగన్వాడి సూపర్వైజర్ సునీత అన్నారు. మంగళవారం తల్లిపాల వారోత్సవాలలో భాగంగా కందుకూరు ప్రాజెక్ట్ వలెటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె 1 అంగన్వాడీ సెంటర్ నందు సీడీపీఓ మాధవిలత సూచనల మేరకు సూపెర్వైజర్ సునీతఅధ్యక్షతన తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పుట్టినబిడ్డకు గంట లోపు ముర్రు పాలు పట్టించాలని తల్లి పాలు అమృతం అని, సంపూర్ణ పోషకాహారం అని ప్రకృతి వరం అని తల్లి మొదట ఇచ్చే పాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధి నిరోధక టీకా, బిడ్డ ఆరోగ్యంగా, బలంగా శరీరకంగా ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్స్ తల్లిపాలల్లో ఉంటాయని అన్నారు. తల్లి పాలు ఇవ్వటం వలన తల్లికి కూడా గర్భాసయ కాన్సర్, రొమ్ము కాన్సర్ రాకుండా నిరోదిస్తుందని తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సూపర్వైజర్ సునీత, స్కూల్ టీచర్స్ యం. హనుమంతరావు, పి వెంకరరావు, రజిత,అంగన్వాడీ కార్యకర్తలు సుమలత, జ్యోతి, పార్వతి, రాజ్యలక్ష్మి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


