Homeజిల్లాలుఏలూరుఅంబులెన్స్ ఢీకొని ఇద్దరు మృతి

అంబులెన్స్ ఢీకొని ఇద్దరు మృతి

- Advertisement -


విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా ): ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన రైతు గున్ను శ్రీరామ్మూర్తి (70), వ్యవసాయ కూలీ పెండ్ర చిరంజీవి (42) ద్విచక్ర వాహనంపై భీమడోలు మండలం పూళ్లలోని పొలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.రాంగ్ రూట్లో వెళ్తున్న ద్విచక్ర వాహన దారులను హైదరాబాదు నుంచి వస్తున్న అంబులెన్స్ కైకరం శివారులో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు