Homeజిల్లాలుకర్నూలుజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు సోమన్న, కార్యదర్శి రామన్న, తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, కొత్త అక్రిడేషన్ ఇవ్వాలన్నారు. జర్నలిస్టులకు ప్రమాద భీమాను పునరుద్ధరించాలని, పింఛన్లు, హెల్త్ స్కీం మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్ ఐ జెర్మియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, ఈరన్న, ఏలియస్, లింగమూర్తి, మల్లికార్జున, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు