వాషింగ్టన్: అమెరికా రక్షణశాఖ డిమాండ్లకు నో చెప్పిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్‌తో వ్యాపారం చేయబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ టెక్నాలజీని వాడడం వెంటనే ఆపేయాలని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. అదే సమయంలో ఆంథ్రోపిక్ ప్రత్యర్థి సంస్థ ఓపెన్ఏఐతో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ (Sam Altman) వెల్లడించారు (OpenAI-Anthropic). ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్‌ను సైన్యం అపరిమితంగా వాడుకునేలా యాక్సెస్ ఇవ్వాలని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ డిమాండ్ చేసింది. అందుకు శుక్రవారం వరకు గడువు విధించింది. అయితే అది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ పేర్కొన్నారు. ఇది ట్రంప్ నకు ఆగ్రహం తెప్పించింది. ఆ సంస్థతో మరోసారి వ్యాపారం చేయమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ ఎంటర్ అయింది.
ఆంథ్రోపిక్‌తో వ్యాపారం కటీఫ్: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


