-వెస్టిండీస్ పై భారత్ కు మెరుగైన రికార్డు
పొట్టి ప్రపంచకప్(T-20 world cup) సూపర్ 8లో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమ్ఇండియా (Team India) ఆదివారం వెస్టిండీస్‌తో తలపడనుంది. భారత్‌కు సూర్యకుమార్ యాదవ్, వెస్టిండీస్‌కు షాయ్ హోప్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. సెమీస్‌కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి. వెస్టిండీస్‌కు కూడా ఈ పోరు చావోరేవో లాంటింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. ప్రత్యర్థి వెస్టిండీస్‌కు మాత్రం గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో పొట్టిఫార్మాట్లో టీమ్‌ఇండియా, వెస్టిండీస్ గణాంకాలు ఎలా ఉన్నాయంటే.
భారత్ మెరుగైన రికార్డు…
టీ20ల్లో టీమ్‌ఇండియాదే కరేబియన్ జట్టుపై పైచేయి.. అయినప్పటికీ పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం భారత్ కంటే, వెస్టిండీస్ రికార్డ్ కాస్త మెరుగ్గా ఉంది. అయితే జింబాబ్వేపై సాధించిన విజయంతో టీమ్ఇండియా జోష్ మీద ఉంది. ఇదే ఊపులో వెస్టిండీస్‌ను సైతం మట్టి కరిపించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.


