గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి
విశాలాంధ్ర -అనంతపురం : కుక్కల దాడిలో16 గొర్రెల మృతి చెందడంతో దాని మీదే ఆధారపడుతున్న గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలని గొర్లు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్లపోతలయ్య సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య కోరారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జమ్మలదిన్నె గ్రామానికి చెందిన పుట్లయ్య యాదవ్ తన జీవన ఉపాధి కోసం గొర్రెలపై పెట్టుబడి పెట్టి జీవనం సాగించేవారు అన్నారు. రెండు రోజుల క్రితం గ్రామంలో ఉన్న వీధి కుక్కలు గొర్రెల పై దాడి చేయడంతో 16 గొర్రెలు మృతి చెందడం జరిగిందన్నారు. ఒక్కసారిగా 16 గొర్రెలు మృతి చెందడంతో పుట్ల యాదవ్ కుటుంబం రోడ్డును పడిందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గొర్ల కాపర్ ని విచారించి తగిన ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి. నాగప్ప, కార్యదర్శి సివి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


