రిటైర్డ్ జిల్లా అందత్వా నివారణ అధికారి సంకారపు నర్సింహులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి ఆసుపత్రి యందు ప్రతి నెలలో ఒకటవ మూడవ ఆదివారములు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి సమస్యలు, ఉచిత ఆపరేషన్లు నిర్వహించబడునని శ్రీ చక్ర కంటి ఆసుపత్రి -అనంతపురం డిఎన్బి ఆప్తాల్ డాక్టర్ ఈశ్వర్ రావు సాకరే, రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. షుగర్ కలవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, అన్ని వయసులో కలవారికి సంపూర్ణ కంటి పరీక్షలు, నల్ల గుడ్డు వ్యాధుల చికిత్స, ఫెకో పద్ధతి ద్వారా శుక్లాం శాస్త్ర చికిత్స, పిల్లలకు ప్రత్యేక కంటి పరీక్షలు, కొయ్య ఖండా శాస్త్ర చికిత్సలు, రెటీనా లేజర్ ఇంజక్షన్లు, పొడిబారిన కళ్ళు చికిత్సకు పూర్తిగా వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ తో పాటు ఈ హెచ్ ఎస్ సౌకర్యం కూడా కలదని వారు తెలిపారు. కనుక ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఉచిత కంటి ఆపరేషన్లను సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


