Sunday, December 7, 2025
Homeజిల్లాలుప్రకాశంఆటోల ఫిట్నెస్ లోను… గ్యాస్!

ఆటోల ఫిట్నెస్ లోను… గ్యాస్!

- Advertisement -

విశాలాంధ్ర కందుకూరు: కందుకూరు పట్టణం కాళిదాసు వారి వీధిలో ఉన్న సుచిత భారత్ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే రెండు ఆటోల ఫిట్నెస్ కూడా ఉత్తి గ్యాస్ ను తలపించే విధంగా ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఏపీ 27 టి టి 32 32., ఏపీ 26 టి ఈ 49 21. అను నెంబర్ గల వాహనాలు దశాబ్దాలకు పైబడి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా తిరగడం ఎంతవరకు సమంజసమని వారు అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రమారమి ₹.1. లక్ష 30 వేల వరకు ఆదాయం గండి పడింది. గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయాన్ని పొందుతున్న సుచిత భారత్ గ్యాస్ నిర్వహకులు గ్యాస్ రవాణా వాహనాలకు ఫిట్నెస్లు ,ఇన్సూరెన్స్ లు లేకుండా వాహనాలను తిప్పడం ఆర్టిఏ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వడమేనని ప్రజలు అంటున్నారు. వీరిపై ఆర్టిఏ అధికారులు దృష్టి సారించి ప్రభుత్వానికి రావలసిన అన్ని రకాల బకాయిలను తక్షణమే రాబట్టాలని వారు కోరుతున్నారు. ఈ వాహనాలకు ప్రమాదం జరిగితే, ఎంతటి ఇబ్బంది ఎదురుకోవలసి ఉంటుందో ఆర్టిఏ అధికారులకు తెలియదా? అని ప్రజలు విమర్శిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా సు చిత భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడి పనితీరు కూడా వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు