Sunday, December 7, 2025
Homeహైదరాబాద్ప్రజా సమస్యలపై అలసత్వమెందుకు

ప్రజా సమస్యలపై అలసత్వమెందుకు

- Advertisement -

కాలనీల సమస్యలను గాలికొదిలేస్తున్న అధికారులు

ప్రజలంటే పట్టింపు లేదా-డిప్యూటీ కమిషనర్ నరసింహతో కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి

విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజా సమస్యలపై అధికారులకు అలసత్వమెందుకని,కాలనీల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మొద్దు నిద్రను వీడడం లేదని కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు సోమవారం కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి,సుభాష్ నగర్ 130 డివిజన్ లో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నరసింహకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపడం లేదని,పలుమార్లు డివిజన్ లోని కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల విన్నవించిన పెడచెవిన పెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ప్రజా సమస్యలు పట్టించుకొని సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ నరసింహకు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు