Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు, సన్మాన కార్యక్రమం..

ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు, సన్మాన కార్యక్రమం..

- Advertisement -

యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎర్రగుంట వద్దగల యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీ వారు ఇటీవల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, జనరల్ సెక్రెటరీ కప్పల బలరాముడు, కోశాధికారి బండి ఉజ్జినప్ప మాట్లాడుతూ 2026 సంవత్సరములో పదవ, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో కురుబ కులస్తుల విద్యార్థులు అత్యధిక మార్కులతో రావడం నిజంగా సంతోషించదగ్గ గర్వించదగ్గ విషయమని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రధమ బహుమతిగా 3 వేల రూపాయలు నగదు తో పాటు మెమొంటో, ద్వితీయ బహుమతిగా 2,500 రూపాయలు నాగదితో పాటు మెమొంటో, తృతీయ బహుమతిగా 2000 రూపాయలు నగదు తో పాటు మెమొంటో అందజేయడం జరిగిందన్నారు. తదుపరి పదవ తరగతిలో 50 మంది 500 మార్కులు పైగా సాధించిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు నగదు తో పాటు మెమొంటోస్, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 25 మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలతో పాటు మెమొంటోళ్లను ఇస్తూ, విద్యార్థులందరికీ ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జేఈఈ మెయిన్స్, ఎన్ ఈ ఈటి, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన 8 మంది కు కూడా ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోటి వెంకటేష్, ఎజ్జన, గవరనారాయణ స్వామి, డైరెక్టర్లు కేసీ నారాయణస్వామి, చిలిపి ఆంజనేయులు, సహకార దర్శి పూల గుండ్ల నాగార్జున, ఉప కోశాధికారి పామాల విజయభాస్కర్, గిరకే నాగేంద్ర, బెల్లం తిరుపాల్, డైరెక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు