–మంత్రి కందుల దుర్గేష్.
విశాలాంధ్ర – కడియం : పండుగను సేవతో కలిపి జరుపుకోవడం స్పూర్తిదాయకం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం దీపావళి సందర్భంగా, రాజమండ్రి ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో, చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి ఆధ్వర్యంలో, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, చిన్నారులతో కలిసి దీపాలు వెలిగించారు. మిఠాయిలు, చాక్లెట్లు, బహుమతులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెడ్డం శివ గత 25 ఏళ్లుగా నివసిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. గెడ్డం శివ మాట్లాడుతూ ప్రియదర్శిని ఆశ్రమంతో అనుబంధం 25 ఏళ్లనుండి కొనసాగుతోందని, చిన్నారుల విద్య, ఆరోగ్యం, అవసరాల పరంగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ జెనసేన అధ్యక్షులు వై. శ్రీనివాస్, చిరు సేవా సమితి సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.


