Homeఆంధ్రప్రదేశ్వాతావరణం దోబూచులాట

వాతావరణం దోబూచులాట

- Advertisement -

 ఎట్టకేలకు గట్టెక్కిన దీపావళి వ్యాపారులు, రైతులు.

 విశాలాంధ్ర -కొవ్వూరు:  వాతావరణం దోబూలాచకు దిగిన వేళ దీపావళి వ్యాపారస్తులు గట్టెక్కారు. దీపావళి అనగానే ముసురు వచ్చి అటు రైతులు, ఇటు దీపావళి వ్యాపారులు ప్రతి ఏటా నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా దీపావళికి రెండు రోజులు ముందు వాతావరణం మబ్బుతో అందర్నీ దిగాలకు గురిచేసింది. దీపావళి ముందు ఆదివారం కూడా వర్షం పడటంతో అందరి మదిలో ఆందోళన నెలకొంది. అదేవిధంగా దీపావళి నాడు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండాకాలం మాదిరిగా తీవ్రమైన ఎండ కాసింది. తీరా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొన్ని చినుకులుపడడంతో దీపావళి వ్యాపారస్తుల ఆందోళన అధికమైంది. పది నిమిషాలు తర్వాత మరల ఎండ కాయడంతో దీపావళి వ్యాపారస్తులతో పాటు రైతులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపద్యంలో దీపావళి సామాన్లు కొనుక్కున్న ఇతర దారులు ఈ వాతావరణం ఎలా ఉంటే ఎలా మందులు కాల్చుకోవాలి అన్న మేము పడ్డారు. మొత్తం మీద వాతావరణం అనుకూలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. థాంక్స్ టూ వాతావరణం అని సంబరపడ్డారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు