జీఎస్టీ తగ్గినా గుంజుడు తగ్గలేదు
విశాలాంధ్ర – తాళ్లపూడి : ధరలు బాగా పెరిగాయి, ఆకాశాన్ని అంటుతున్నాయ్ అనే మాటలు సాధారణంగా మనకు మార్కెట్లో వినిపిస్తుంటాయి. నిత్యావసరాలు, కూరగాయలు కానీ రేట్లు పెరిగిన సమయం లో ఈ మాటలు ఎక్కువ గా పేద ప్రజలు మధ్య వినబడతాయి. కానీ తాళ్లపూడి మండలం లో మాత్రం ఆఫీసుల్లో కూడా రేట్లు కూడా పెరిగాయని అన్న పుకారు బాగా వినబడుతోంది. డబ్బులేనిదే ఏ పని జరగదన్నది సాధారణంగా వినబడే మాట. ప్రస్తుతం గతం కంటే రేట్లు పెరిగాయన్నది కొత్తగా వినబడుతున్న మాట. తాళ్లపూడి మండలం లో వివిధ రెవెన్యూ సేవలకు కాస్తంత రేట్లు పెరిగాయని గుసగుసలు విని పిస్తున్నాయి. తాళ్లపూడి మండలం ఇప్పటికే నాలుగు సార్లు ఏ.సి.బి దాడులు జరిగిన దాఖలాలు ఉండగా వసూళ్ల విషయం మరో సారి ఏ.సి.బి కి పని పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


