Thursday, December 5, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులాల వారీగా గణన చేయాలి..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులాల వారీగా గణన చేయాలి..

బీసీ సమన్వయ కమిటీ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులాల వారీగా గణన చేయాలని బీసీ సమన్వయ కమిటీ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి గోవిందు అధ్యక్షతన బీసీల కుల జన గణన చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తెలపడం జరిగిందన్నారు. అనంతరం గోవిందు మాట్లాడుతూ 78 ఏళ్లుగా కోల్పోతున్న తమ వాటాలను సాధించుకోవడానికి సమగ్ర కులాల వారీగా జన గణన చేయాలని బీసీలు అందరూ తమ ఇండ్ల నుంచి బయటికి వచ్చి, వీధి పోరాటాలు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. బీసీలకు కుల గణన లేకపోవడం వలన జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన వాటా అన్నింటిలోనూ దక్కకుండా ఓసీలే అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. నిజానికి విద్యతోపాటు ఉద్యోగాలు చట్టసభలు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు తదితర వాటిల్లో బీసీలకు జనాభా దామాసా ప్రకారం దక్కాల్సి ఉందని తెలిపారు. అంతేకాకుండా బడ్జెట్లో నిధులు కూడా ఈ మేరకు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. బీసీలకు కూడా ఆర్టికల్ 340 ద్వారా వచ్చే ప్రభుత్వాలు వారి వాటా వారికి ఇవ్వాలని తెలిపారు. కానీ నేటి రాజకీయాలు గెలుపొందిన పార్టీ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని తమ జనాభాకు మించిన రిజర్వేషన్లను ఈ డబ్ల్యూ ఎస్ పేరుతో 10 శాతము విద్యా ఉద్యోగాల్లో పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా బీసీ పెద్దలు న్యాయస్థానాలకు వెళ్లినప్పుడు బీసీలకు అధికారికంగా జనాభా లెక్కలు ఉంటే వారి వాటా తీసుకోవాలని తీర్పును కూడా వెల్లడించడం జరిగిందని వారు గుర్తు చేశారు. నిజానికి కమ్మ రెడ్ల జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సిన పోగా మిగిలినవన్నీ సీట్లు బీసీ లవే తెలిపారు. బీసీలు పెద్ద ఎత్తున అన్ని రంగాలలో నష్టపోతున్నారని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గ్రహించి గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జంగమన్న, వెంకటేశు, బోయ రవిచంద్ర, నరసింహులు, రోషన్ జమీర్, పొలాల లక్ష్మీనారాయణ, రామచంద్ర,సూరి, కళ్యాణి, లక్ష్మీనారాయణ, వీర నాగప్ప, శ్రీరాములు, నాగయ్య, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు