Friday, December 13, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉద్దానం కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రంలో 75 శాతం మేర పోస్టులు ఖాళీ

ఉద్దానం కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రంలో 75 శాతం మేర పోస్టులు ఖాళీ

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దీనిపై శ్ర‌ద్ధ పెట్ట‌లేదు

శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించి శాస్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు

కిడ్నీ పరిశోధనా సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం..

శాస‌న స‌భ‌లో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి

విశాలాంధ్ర ధర్మవరం : ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రంలో స‌రిప‌డా స్పెషలిస్టులు, ముఖ్యంగా నెఫ్రాల‌జిస్టులు, సిబ్బందిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో స‌రిప‌డా నియ‌మించ‌లేద‌ని, ఐదేళ్ల కాలంలో దీని ప‌ట్ల ఏమాత్రం శ్ర‌ద్ధ‌పెట్ట‌లేద‌ని ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. శుక్ర‌వారం శాన‌స స‌భ‌లో ఉద్దానం కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రంపై స‌భ్యులు గౌతు శిరీష‌, కూన ర‌వికుమార్ త‌దిత‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ స‌మ‌స్య ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యమ‌ని, దీర్ఘ‌కాలిక స‌మ‌స్య అని అన్నారు. కిడ్నీ స‌మస్య‌ల‌తో చాలా మంది ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ స‌మ‌స్య‌పై గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌యాంలో జార్జియాతో ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకోవ‌డం ద్వారా ఇక్క‌డ ప‌రిశోధ‌నా కేంద్రాన్ని నిర్మించాల‌ని అప్ప‌ట్లో నిర్ణ‌యించార‌న్నారు. జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించాక దీనిపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దృష్టిసారించార‌న్నారు. స్థానిక ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో 2019 డిసెంబ‌రులో ఆర్భాటంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్క‌డ కిడ్నీ ప‌రిశోధ‌నా కేంద్రాన్ని ప్రారంభించారే త‌ప్ప స‌రిప‌డా వైద్య నిపుణుల్ని, సిబ్బందిని నియ‌మించ‌లేద‌న్నారు. ఆరుగురు నెఫ్రాల‌జిస్టు లకు గాను కేవలం ఒక్కరే ఉన్నారని, యూరాలజీలో ఆరుగురు అవసరం ఉండగా నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అనిపిస్తే విభాగంలో 8 మందికి ఆరుగురు రేడియాలజిస్టులు నలుగురు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు అని తెలిపారు. అన్ని విభాగాలలో మొత్తం 61 మంది ఉండాల్సి ఉండగా కేవలం 17 మంది మాత్రమే ఉన్నారని 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ పోస్టులు పూర్తి కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అక్కడ సిలికా పురుగుమందుల అవశేషాలు తదితర సమస్యలు ఉన్నట్లు నిపుణుల బృందం గుర్తించిందని ప్రధానంగా జెనెటిక్స్ సమస్యలు ఉన్నట్లు కూడా తాము గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సురక్షితమైన నీరు వాడాలని వారు సూచించారు. నాన్ రికరింగ్ కింద 8.19 కోట్లు మేరా రావాల్సి ఉందని, దీని కారణంగానే జీతాలు కూడా చెల్లించలేదని విషయం వారు స్పష్టం చేశారు. అధికారులతో మాట్లాడి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకాకుళం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నందున స్పెషలిస్టులకు టీచింగ్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ పథకం కింద 53 ఎన్టీఆర్ వైద్య సేవ కింద 217 డయాలసిస్ కేంద్రాలు మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయిలో సర్వే చేయించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా తెలిపారు. డయాలసిస్ రోగులకు ఇప్పటికే పదివేల రూపాయలు ప్రభుత్వం పెన్షన్ రూపంలో ఇస్తోందని మందులు వాడటానికి కూడా 5000 రూపాయలు ఇస్తే బాగుంటుందని సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఆర్థిక శాఖతో సంప్రదించాకే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు