పుట్టపర్తి లో ధర్నా విజయవంతం చేయండి..
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత సమస్యలపై చలో హ్యాండ్లూమ్ పుట్టపర్తి ధర్నాలు ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చేనేత సంఘం నాయకులు ఎస్హెచ్ భాష, హరికుమార్, ఖాదర్బాషా, జంగం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వ్యవసాయం తర్వాత చేనేత ప్రధాన వృత్తిగా ప్రసిద్ధి చెందిన పరిశ్రమ కార్పొరేట్ విధానాల వలన సంక్షోభంలో చిక్కుకున్నది అని, దాని ఫలితంగా చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలకు బలి అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేనేత పై జిఎస్టి వేయడంతో చేనేత రంగం మరింత సంక్షోభలోకి నెట్టబడింది అని వారు దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించాలని చెప్తున్నా చేనేత పై తగ్గించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇస్తున్నా నేతన్న నేస్తం పథకం కూటమి ప్రభుత్వం అమలు జరపలేదు అని స్పష్టం చేశారు. బడ్జెట్లో చేనేత కేటాయింపులు కూడా లేవు అని, 200 యూనిట్లు ఉచిత కరెంటు అమలు జరపకపోవడం దారుణమన్నారు. చేనేతలకు 25 వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన అమలకు నోచుకోలేదన్నారు.కనుక చేనేత కార్మికులు సమస్యలు పరిష్కరించాలని చేనేత పరిశ్రమకు రక్షణకు ప్రభుత్వం అండగాఉండాలన్నారు. చేనేత సమస్యలు పరిష్కరించేంతవరకు మా పోరాటాలు ఆపము అని స్పష్టం చేశారు.
చేనేత సమస్యలు పై చలో హ్యాండ్లూమ్..
- Advertisement -
RELATED ARTICLES


