Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్ర స్థాయి జూడో పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన చిగిచెర్ల విద్యార్థులు

రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన చిగిచెర్ల విద్యార్థులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రస్థాయి జూడో పోటీలలో స్వర్ణ పథకాలు చికిచెర్ల విద్యార్థులు సాధించడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
6వ తేదీ నుండి 10 వ తేదీ వరకూ కాకినాడ డి ఎస్ ఏ స్టేడియం లో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 17 రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో చిగిచెర్ల పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభతో స్వర్ణ పతకాలు సాధించి ఉమ్మడి అనంతపురం జిల్లా జూడో బాల బాలికల జట్లు మొదటి స్థానంలో విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించారు అని తెలిపారు. విజయం సాధించిన వారిలో బాలుర కేటగిరి -45 కేజీ ల విభాగంలో ణ. యశ్వంత్,50 కేజీ ల విభాగంలో ఎం. విక్రాంత్, బాలికల కేటగిరి 36 కేజీ ల విభాగంలో ం. నందిని, ,48 కేజీ ల విభాగంలో కె. లాస్య రెడ్డి బంగారు పతకాలు సాధించారు అని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్, ఫిజికల్ డైరెక్టర్, పాఠశాల కమిటీ, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు