పోలీసుల లుకౌట్ నోటీసులపై బహిరంగంగా స్పందించిన సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే
నాగ్‌పూర్ నిరసన సభలో పోలీసులకు అరెస్ట్ సవాల్ విసిరిన వైనం
తనపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సంవిధాన్ చౌక్‌లో జరిగిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి్ణ నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ అక్కడే ఉన్న పోలీసులకు బహిరంగ సవాల్ విసిరారు.బహిరంగ సభలో అభిజిత్ దీప్కే మాట్లాడుతూ…’ ‘నాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. వారు నా కోసం వెతుకుతున్నారు. నేను ఇక్కడే సంవిధాన్ చౌక్‌లో ఉన్నాను. నన్ను అరెస్ట్ చేయండి. నేను రెండుసార్లు జైలుకు వెళ్లాను. నాకు జైలు భయాన్ని చూపించాలనుకోకండి.. నాకు కొత్తేం కాదు’ అని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, దేశంలోని ప్రతి వ్యవస్థను హైజాక్ చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజలు 12 ఏళ్లుగా భయంతో బతికారని, అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రజలకు మళ్లీ గొంతుకను ఇచ్చిందని పేర్కొన్నారు. మరో రెండేళ్లపాటు ఎంత భయాన్ని సృష్టించుకుంటారో సృష్టించుకోవాలని, 2029 సమీపిస్తోందని హెచ్చరించారు.ఇదే కార్యక్రమంలో లుకౌట్ నోటీసులు ఎదుర్కొంటున్న మరో సీజేపీ నేత అశుతోష్ రాంకా కూడా ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే, దేశాన్ని కూడా కాపాడుకోలేం’ అని ఆయన అన్నారు.


